ఆంధ్రప్రదేశ్ లో కియా మోటార్స్ మొదటి ఉత్పత్తి ప్లాంటు

భారత దేశపు రెండవ అతి పెద్ద కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్‌ భాగస్వామి కియా మోటార్స్ ఈ ఏడాది ఇండియన్ మార్కెట్లోకి తమ ఉత్పత్తులను విడుదల చేయనుంది.

Written By:

దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి తమ నూతన ఉత్పత్తులను విడుదల చేయడానికి సిద్దమైంది. దేశీయంగా ఉత్పత్తి ప్లాంటును నిర్మించేందుకు కియా ఆసక్తి చూపుతోంది.

ఇందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనంతపురం జిల్లాలో సుమారుగా 600 ఎకరాలు కియా మోటార్స్ ఉత్పత్తి ప్లాంటుకు కేటాయించడానికి సిద్దంగా ఉంది. ఆంధ్రాతో పాటు గుజరాత్ మరియు మహారాష్ట్ర రాష్ట్రాలు కూడా కియా మోటార్స్‌కు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.

కియా మోటార్స్ ప్రస్తుతం హ్యుందాయ్ మోటార్స్ భాగస్వామ్యంతో కార్యకలాపాలు సాగిస్తోంది. హ్యుందాయ్ ఇప్పుడు ఇండియాలో రెండవ అతి పెద్ద కార్ల తయారీ సంస్థగా ఉంది. ఇక ప్రపంచంలోనే ఐదవ అతి పెద్ద కార్ల తయారీ సంస్థలలో హ్యుందాయ్ మరియు కియా మోటార్స్ భాగస్వామ్యం నిలిచింది.

కియా మోటార్స్ జూలై 2019 నాటికి ఇండియాలో తమ మొదటి తయారీ ప్లాంటులో ఉత్పత్తిని ప్రారంభించడానికి ప్రణాళికలు వేసుకుంది. ప్రారంభమైన తరువాత కాంపాక్ట్ సెడాన్లను మరియు కాంపాక్ట్ ఎస్‌యూవీలను ఉత్పత్తి చేయనున్నట్లు సమాచారం.

ఈ విషయమై కియా మోటార్స్ సిఇఒ పార్క్ హాన్ వూ స్పందిస్తూ, ఇండియాలో తయారీ ప్లాంటుకు కావాల్సిన ప్రాంతాన్ని గుర్తించే పనిలో మా బృందం నిమగ్నమయ్యింది. అయితే ఏ రాష్ట్రంలో ఉంటుందనే విషయాన్ని వెల్లడించడానికి నిరాకరించారు.

కియా దేశీయంగా పూర్తి స్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించి కార్లను అందుబాటులోకి తీసుకువస్తే ప్రస్తుతం ఉన్న టాటా మోటార్స్, హోండా, టయోటా మరియు మారుతి సుజుకి ఉత్పత్తులకు గట్టి పోటీనివ్వనున్నాయి.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Wednesday, February 8, 2017, 19:15 [IST]
English summary
Kia Motors May Set Up Its First India Plant In Andhra Pradesh
Please Wait while comments are loading...

Latest Photos