అనంతపురంలోని పెనుకొండకు వస్తున్న కియా కార్ల తయారీ యూనిట్

కియా కార్ల తయారీ సంస్థ ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రొడక్షన్ ప్లాంటు ఏర్పాటుకు మొగ్గు చూపుతోంది. తయారీ యూనిట్‌కు కావాల్సిన భూమిని కొనుగోలు చేయడానికి కియా మోటార్స్ కసరత్తు చేస్తోంది.

By Anil

దక్షిణ కొరియాకు చెందిన కియా కార్ల తయారీ సంస్థ దేశీయ ప్యాసింజర్ కార్ల మార్కెట్లో అధికారిక కార్యకలాపాలు ప్రారంభించనుంది. అందు కోసం తొలుత సుమారుగా పది వేల కోట్ల రుపాయల పెట్టుబడులు పెట్టనుంది. కియా కార్ల తయారీ కోసం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంచుకున్నట్లు అధికారిక సమాచారం.

ఆంధ్రప్రదేశ్‌కే మొగ్గు చూపుతున్న కియా కార్ల తయారీ సంస్థ

కియా యొక్క తొలి తయారీ యూనిట్‌ను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అనంతపురంలో ఉన్న పెనుకొండ సమీపంలో ఏర్పాటు చేయడానికి సుముఖత చూపుతోంది.

ఆంధ్రప్రదేశ్‌కే మొగ్గు చూపుతున్న కియా కార్ల తయారీ సంస్థ

ప్రభుత్వ అధికారుల సమక్షంలో ప్రొడక్షన్ ప్లాంటుకు కావాల్సిన భూమిని కొనుగోలు చేయడానికి కియా మోటార్స్ ప్రతినిధులు ప్రారంభించారు.

ఆంధ్రప్రదేశ్‌కే మొగ్గు చూపుతున్న కియా కార్ల తయారీ సంస్థ

ఈ ప్రాజెక్టు సంభందించి ఓ అధికారి మాట్లాడుతూ, కియా మోటార్స్ ఇండియా విభాగం యొక్క మొదటి తయారీ యూనిట్‌ను ఆంధ్ర ప్రదేశ్‌లో నెలకొల్పనుంది మరియు రెండు దశలలో 10,300 కోట్ల రుపాయల పెట్టుబడి పెట్టనుంది.

ఆంధ్రప్రదేశ్‌కే మొగ్గు చూపుతున్న కియా కార్ల తయారీ సంస్థ

మొదటి దశ పెట్టుబడిగా 6,000 కోట్ల రుపాయలు పెట్టుబడులు పెట్టనున్నట్లు కియా ప్రతినిధులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు భూమిని సమకూర్చమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అనంతపురం కలెక్టర్‌ను ఆదేశించారు.

ఆంధ్రప్రదేశ్‌కే మొగ్గు చూపుతున్న కియా కార్ల తయారీ సంస్థ

ఈ ప్లాంటు తొలి దశ నిర్మాణం పూర్తియితే ఏడాదికి సుమారుగా 3 లక్షల యూనిట్ల తయారీ సామర్థ్యం ఉండనుంది. కియా మోటార్స్ తమ తొలి కారును 2019లో మార్కెట్లోకి విడుదల చేయనుంది.

ఆంధ్రప్రదేశ్‌కే మొగ్గు చూపుతున్న కియా కార్ల తయారీ సంస్థ

దేశీయంగా కియా మోటార్స్ కార్యకలాపాలు ప్రారంభించే విషయమై కియా ప్రతినిధులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే కొంత మంది విక్రయదారులను హ్యుందాయ్ మోటార్స్ ద్వారా సంప్రదిస్తున్నట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్‌కే మొగ్గు చూపుతున్న కియా కార్ల తయారీ సంస్థ

సప్లయింగ్ ఎక్సిక్యూటివ్ మాట్లాడుతూ, అనంతపురంలో లాజిస్టిక్స్ ధరలు గురించి మరియు భలిష్యత్తులో వీటి ధరల గురించి ప్రణాళిక వేసుకుని ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌కే మొగ్గు చూపుతున్న కియా కార్ల తయారీ సంస్థ

అంతే కాకుండా కియా తమ మొదటి వెహికల్‌కు ఎస్‌పి2 అనే కోడ్ పేరును ఖరారు చేసినట్లు తెలిసింది. దీని మేరకు ఎస్‌పి2 అనగా ఎస్‌యూవీ అని తెలుస్తోంది. దీనిని క్రెటా సెగ్మెంట్లో అభివృద్ది చేయనుంది.

ఆంధ్రప్రదేశ్‌కే మొగ్గు చూపుతున్న కియా కార్ల తయారీ సంస్థ

హ్యుందాయ్ వద్ద ఉన్న పెయింట్ షాప్ మరియు బాడీ షాప్ ప్లాంట్లకు దగ్గరలో దీనిని నెలకొల్పడం ద్వారా ఆ రెండు ప్లాంట్లను కియా మోటార్స్ ఉపయోగించుకోనుంది.

Most Read Articles

English summary
Read In Telugu To Know About Kia Motors Set-Up Production Facility Andhra Pradesh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X