ఎవోక్ మరియు డిస్కవరీ స్పోర్ట్ ల మీద ధరలు తగ్గించిన ల్యాండ్ రోవర్

Written By:

ఖరీదైన మరియు శక్తివంతమైన లగ్జరీ ఎస్‌యూవీల తయారీ దిగ్గజం ల్యాండ్ రోవర్ దేశీయంగా ఉన్న తమ ఎవోక్ మరియు డిస్కవరీ స్పోర్ట్ వేరియంట్లలో ఉన్న పెట్రోల్ వాహనాల మీద ధరలను తగ్గించింది. అమెరికాకు చెందిన ఫియట్ క్రిస్లర్ సంస్థ జీప్ వ్రాంగ్లర్ పెట్రోల్ వేరియంట్ విడుదల కారణంగా సుమారుగా రూ. 7 లక్షల వరకు ధర తగ్గించినట్లు తెలుస్తోంది.

ల్యాండ్ రోవర్ లోని ఎవోక్ ఎస్ఇ పెట్రోల్ వేరియంట్ మీద రూ. 2 లక్షలు మరియు ల్యాండ్ రోవర్ ఎవోక్ ఎస్‌యూవీ వేరియంట్‌ను రూ. 51.2 లక్షల ఎక్స్ షోరూమ్ ఢిల్లీ ప్రారంభ ధరతో అందుబాటులో ఉంచింది.

డిస్కవరీ స్పోర్ట్ హెచ్ఎస్ఇ పెట్రోల్ వేరియంట్ ఎస్‌యూవీ మీద సుమారుగా రూ. 7 లక్షల వరకు ధర తగ్గించి, రూ. 49.5 లక్షల ఎక్స్ షోరూమ్ ఢిల్లీ ప్రారంభ ధరతో రిటైల్‌గా అందుబాటులో ఉంచింది.

ల్యాండ్ రోవర్ ఎవోక్ మరియు డిస్కవరీ స్పోర్ట్ వేరియంట్లలో 2.0-లీటర్ సామర్థ్యం ఉన్న టుర్బో ఛార్జ్‌డ్ నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 236బిహెచ్‌పి పవర్ మరియు 340ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

ఈ 2.0-లీటర్ ఇంజన్‌కు అనుసంధానం చేసిన 9-స్పీడ్ గేర్‌బాక్స్ ద్వారా ఇంజన్ విడుదల చేసే పవర్ మరియు టార్క్ నాలుగు చక్రాలకు సరఫరా అవుతుంది.

ప్రస్తుతం ధరలు తగ్గించబడిన ఎవోక్ మరియు డిస్కవరీ లలో 2.2-లీటర్ సామర్థ్యం ఉన్న టుర్బో డీజల్ ఇంజన్ కూడా కలదు. ఇది రెండు రకాలుగా 148బిహెచ్‌పి మరియు 187బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయును.

మరిన్ని ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ ఫోటోల కోసం క్రింది గ్యాలరీ మీద క్లిక్ చేయండి.

 

English summary
Land Rover India Slashes Prices of Evoque And Discovery Sport — The Wrangler Effect?
Please Wait while comments are loading...

Latest Photos