ఐరోపా రోడ్ల మీదకు మేడిన్ ఇండియా జీప్ కంపాస్‌ ఎస్‌యూవీలు

జీప్ దేశీయంగా ఉత్పత్తి చేసిన కంపాస్ ఎస్‌యూవీవి యూరోపియన్ మార్కెట్లోకి విడుదల చేసింది.

By Anil

'మేడ్ ఇన్ ఇండియా' పేరుతో జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకు తమ ఉత్పత్తులను ఇండియాలో తయారుచెయ్యమని పిలుపు నిచ్చిన మోడీ ప్రణాళికు మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే ఎన్నో పరిశ్రమలు 'మేడ్ ఇన్ ఇండియా' తో లబ్ది పొందగా, తాజాగా అమెరికాకు చెందిన జీప్ కంపెనీ ఇండియాలో తమ ఉత్పత్తుల తయారీని ప్రారంభించింది.

జీప్ దేశీయంగా ఉత్పత్తి చేసిన కంపాస్ ఎస్‌యూవీవి యూరోపియన్ మార్కెట్లోకి విడుదల చేసింది.

జీప్ కంపెనీ గురించి ఒక మాట...

జీప్ కంపెనీ గురించి ఒక మాట...

అమెరికన్ ఆటోమొబైల్ బ్రాండ్ అయిన జీప్, ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్‌లో ఒక భాగం. 1941 నాటి నుండి జీప్ తమ వాహనాలను అమెరికా ఆర్మీ కోసం మరియు రెండవ ప్రపంచ యుద్ధం కొరకు తయారుచేసింది.

మేడిన్ ఇండియా జీప్ కంపాస్

ప్రస్తుతం స్పోర్ట్స్ యుటిలిటీ, ఆఫ్-రోడ్ వాహనాలను మరియు పికప్ ట్రక్కులను తయారుచేస్తున్న జీప్, ఇప్పుడు తాజాగా తమ కంపాస్ ఎస్‌యూవీ దేశీయంగా ఉత్పత్తి చేసి ఐరోపా విపణిలో లాంచ్ చేసింది.

మేడిన్ ఇండియా జీప్ కంపాస్

జీప్ కంపాస్ ఎస్‌యూవీని చూడటానికి జీప్ గ్రాండ్ చెరోకి ఎస్‌యూవీ శైలిలో ఉంటుంది. నిజానికి కంపాస్ ఎస్‌యూవీ, లాక్‌హీడ్ మార్టిన్ ఎస్ఆర్71 బ్లాక్ బర్డ్' గూఢచారి విమాన స్ఫూర్తితో తయారుచెయ్యబడింది. అద్బుతమైన ఇంజనీరింగ్‌‌ను ఆవిష్కరింపచేసే కంపాస్ ఎస్‌యూవీలో యూరోపియన్లకు అనుగుణంగా నాలుగు ఇంజన్ వేరియంట్ల అందివ్వడం జరిగింది.

యూరోపియన్ మార్కెట్లోకి మేడిన్ ఇండియా జీప్ కంపాస్

యూరోపియన్ మార్కెట్లోకి మేడిన్ ఇండియా జీప్ కంపాస్

పూర్తి స్థాయిలో ఇండియాలో తయారైన కంపాస్ ఎస్‌యూవీలు యూరోపియన్ రోడ్ల మీద తిరగడం, వాటి మీద మేడిన్ ఇండియా అనే వాక్యం ఉండటం నిజంగా భారతీయులుగా మనం గర్వపడాల్సిన సందర్భం. సొగసైన హెడ్ లాంప్స్ కు మధ్యలో ఉన్న జీప్ సిగ్నేచర్ సెవెన్-స్లాట్ ఫ్రంట్ గ్రిల్ జోడింపుతో కంపాస్ ఎస్‌యూవీ ఫ్రంట్ డిజైన్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

మేడిన్ ఇండియా జీప్ కంపాస్

ఐరోపాలో విడుదలైన జీప్ కంపాస్ ఎస్‌యూవీ రెండు పెట్రోల్ మరియు రెండు డీజల్ ఇంజన్‌లతో లభ్యమవుతుంది. రెండు ఇంధన వేరియంట్లలో ఉన్న జీప్ నాలుగు వెర్షన్‌లలో లభించును. అవి, స్పోర్ట్, లాంగిట్యూడ్, లిమిటెడ్ మరియు ట్రయల్‌హాక్.

జీప్ కంపాస్ ఎస్‌యూవీ స్పెసిఫికేషన్స్....

జీప్ కంపాస్ ఎస్‌యూవీ స్పెసిఫికేషన్స్....

కంపాస్ ఎస్‌యూవీలోని 1.4-లీటర్ సామర్థ్యం ఉన్న టుర్బో ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ రెండు ట్రాన్స్‌మిషన్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల వేరియంట్ గరిష్టంగా 138బిహెచ్‌పి పవర్ మరియు 230ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా 9-స్పీడ్ ఆటోమేటిక్ మరియు ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ఉన్న వేరియంట్ 168బిహెచ్‌పి పవర్ మరియు 250ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

మేడిన్ ఇండియా జీప్ కంపాస్

కంపాస్‌ డీజల్ వెర్షన్‌‌లో 1.6-లీటర్ మరియు 2.0-లీటర్ సామర్థ్యం ఇంజన్ వేరియంట్లు ఉన్నాయి. 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల 1.6-లీటర్ ఇంజన్ 118బిహెచ్‌పి పవర్ మరియు 320ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా 9-స్పీడ్ ఆటోమేటిక్ మరియు ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ అనుసంధానం గల 2.0-లీటర్ ఇంజన్ 138బిహెచ్‌పి పవర్ మరియు 350ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

డ్రైవింగ్ మోడ్స్....

డ్రైవింగ్ మోడ్స్....

అంతే కాదండి, కంపాస్ ఎస్‌యూవీలో ఐదు విభిన్న డ్రైవింగ్ మోడ్స్ అందించింది. అవి, ఆటో, స్నో, మడ్ మరియు రాక్ మోడ్. 'జీప్ ఆక్టివ్ డ్రైవ్' మరియు 'జీప్ ఆక్టివ్ డ్రైవ్ లో' అనే రెండు ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్లను కూడా పరిచేసింది.

ఫీచర్లు

ఫీచర్లు

యూరోపియన్ మార్కెట్లో విక్రయాల్లో ఉన్న జీప్ కంపాస్ లోని టాప్ ఎండ్ వెర్షన్ అయిన ట్రయల్‌హాక్ లో 5-అంగుళాలు, 7-అంగుళాలు లేదా 8.4-అంగుళాల శ్రేణిలో ఉన్న పరిమాణంలో యుకనెక్ట్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్ల్పేలు ఉన్నాయి.

Most Read Articles

Read more on: #జీప్ #jeep
English summary
Read In Telugu: Jeep Officially Launches 'Made-In-India' Compass In Europe
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X