సుప్రో శ్రేణిలో ఏడు కొత్త వాహనాలను విడుదల చేసిన మహీంద్రా

Written By:

909సీసీ సామర్థ్యమున్నడీజల్ ఇంజన్ గల మహీంద్రా మినివ్యాన్ ప్రారంభ ధర రూ. 4.71 లక్షలు మరియు సుప్రో మినిట్రక్కు ధర రూ.4.28 లక్షలు ఎక్స్ షోరూమ్ కలకత్తాగా ఉన్నాయి.

రెండు ధరలు కూడా ప్రస్తుతం విపణిలో ఉన్నపోటీని దృష్టిలో ఉంచుకుని నిర్ణయించబడ్డాయి. వీటిలో బిఎస్-IV ఉద్గార నియమాలను పాటించే ఇంజన్ అందివ్వడం జరిగింది.

మినివ్యాన్‌ను మూడు విభిన్న వేరియంట్లలో అందివ్వడం జరిగింది. అవి, విఎక్స్, సిఎన్‌జి మరియు స్కూల్ వ్యాన్.

సుప్రో వేదిక ఆధారంగా అభివృద్ది చేసిన అన్ని వాహనాలను కూడా మహారాష్ట్రలో ఉన్న మహీంద్రా చకన్ ప్లాంటులో ఉత్పత్తి చేస్తోంది. పనితీరు, భద్రత మరియు నాణ్యత వంటి అంశాల పపరంగా కఠినమైన పరీక్షల అనంతరం పూర్తి స్థాయిలో అభివృద్ది చేయడం జరిగింందని మహీంద్రా తెలిపింది.

మహీంద్రా విడుదల చేసిన ప్రకటన ప్రకారం సుప్రో ప్యాసింజర్ శ్రేణిలో సుప్రో మినివ్యాన్ విఎక్స్, సుప్రో మినివ్యాన్ సిఎన్‌జి మరియు సుప్రో స్కూల్ వ్యాన్ అనే మూడు వేరియంట్లతో పాటు, కమర్షియల్ వాహన శ్రేణిలో సుప్రో మిని ట్రక్కు, సుప్రో మిని ట్రక్కు సిఎన్‌జి మరియు సుప్రో కార్గో వ్యాన్ లను పరిచయం చేసింది.

మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ ఛీఫ్ ఎక్జ్సిక్యూటివ్ పవన్ సాహ్ మాట్లాడుతూ," భవిష్యత్తులో సుప్రో బ్రాండ్ గొడుకు క్రింది అనేక ఉత్పత్తులను విడుదల చేసి సుప్రో బ్రాండ్ పేరుకు బలాన్ని పెంచనున్నామని తెలిపారు. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను అభివృద్ది చేయడమే మహీంద్రా ఫిలాసఫీ యొక్క ముుఖ్య ఉద్దేశ్యమని తెలిపాడు"

మహీంద్రా కొత్తగా పరిచయం చేసిన అన్ని వాహనాలకు రెండు సంవత్సరాలు లేదంటే 60,000 కిలోమీటర్ల వరకు వారంటీ ఉందని మహీంద్రా ప్రతినిధులు పేర్కొన్నారు.

మహీంద్రా మొదటిసారిగా అక్టోబర్ 2015 లో మ్యాక్సిట్రక్కును విడుదల చేసింది, ఆ తరువాత అక్టోబర్ 2016 లో ఇసుప్రో వ్యాన్ మరియు ఇకార్గో వ్యాన్ అనే రెండు ఎలక్ట్రిక్ వేరియంట్లను విడుదల చేసింది. సుప్రో బ్రాండ్ మంచి విజయాన్ని అందుకుంటున్న తరుణంలో సుప్రో పేరుతో మరిన్ని వేరియంట్లను విడుదల చేసింది.

ఇండియన్ మార్కెట్లో మరే ఎస్‌యూవీ తరహాలో కాకుండా రెనో ఇండియా భిన్నమైన ఎస్‌యూవీని విడుదల చేయనుంది. దానికి చెందిన ఫోటోల కోసం క్రింది గ్యాలరీ మీద క్లిక్ చేయండి.

 

English summary
Mahindra & Mahindra Launches 7 New Vehicles Under Supro Brand
Please Wait while comments are loading...

Latest Photos