మీ టియువి300 ని కోటి రుపాయల విలువైన గ్రాండ్ చిరోకీ తరహాలో మోడిఫై చేయాలా...?

Written By:

ఆఫ్ రోడింగ్ వాహనాలలో ప్రపంచ వ్యాప్తంగా జీప్ సంస్థకు విపరీతమైన అభిమానులు ఉన్నారు. దేశీయంగా జీప్ తమ ఉత్పత్తులను విడుదల చేశాక ఆఫ్ రోడింగ్ ఆశావహులు జీప్ వారి గ్రాండ్ చిరోకీ వాహనాన్ని దక్కించుకోవడానికి తెగ ప్రయత్నాలు చేసారు. అయితే వీటి ధరల శ్రేణి విడుదల చేశాక, ఓ మోస్తారు ఆఫ్ రోడింగ్ ఆశావహులు ఈ వాహనం మీద కోరికను చంపుకున్నారు.
 

జీప్ వాహనాన్ని కొనలేక వెనుదిరిగిన వారందరూ కేరళకు చెందిన ప్రసాద్ చౌదరి కి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే జీప్ గ్రాండ్ చిరోకీ వాహనాన్ని కొనుగోలు చేయలేక టియువి300 వాహనాన్ని ఆఫ్ జీప్ తరహాలో కేవలం లక్షా యాభైవేలకే మోడిఫై చేయించుకుని సంతోషపడుతున్నాడు. కాబట్టి జీప్ ప్రేమికులు ఇప్పుడు ఈ దారిని ఎంచుకోక తప్పదు.

ఇక ఇందులో మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దీనిని ప్రసాద్ స్వయంగా మోడిఫై చేసుకున్నాడు. తన టియువి300 వాహనాన్ని ఇండియాలో ఆన్ రోడ్ ధర కోటి రుపాయలుగా ఉన్న జీప్ గ్రాండ్ చిరోకీ రూపంలోకి మార్చేశాడు.

ఈ మోడిఫికేషన్‌కు గాను ఫ్రంట్ గ్రిల్, బాడీ స్కర్ట్స్ మరియు జీప్ లోగోను జీప్ సంస్థ నుండి సేకరించాడు. పగటి పూట వెలిగే లైట్లు గల ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్‌ను ఆడి క్యూ3 నుండి సేకరించాడు.

ముందు వైపున న్యూ బ్యానెట్ మరియు బంపర్‌తో పాటు వెనుక వైపున అదనపు స్పేర్ వీల్, క్లీన్ డిజైన్ అందివ్వడం జరిగింది.

డిజైన్ పరంగా జీప్ గ్రాండ్ చిరోకీ తరహాలో మార్పులు చోటు చేసుకున్నప్పటికీ సాంకేతికంగా ఎలాంటి మార్పులు సంభవించలేదు. ఇందులో మహీంద్రా అందించిన అదే 1.5-లీటర్ సామర్థ్యం గల మూడు సిలిండర్ల ఎమ్‌హాక్ డీజల్ ఇంజన్ కలదు.

ఇందులోని శక్తివంతమైన డీజల్ ఇంజన్ గరిష్టంగా 84బిహెచ్‌పి పవర్ మరియు 230ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభ్యం అవుతోంది.

మహీంద్రా అండ్ మహీంద్రా ఈ సబ్-నాలుగు మీటర్ల కాంపాక్ట్ ఎస్‌యువి టియువి300 వాహనాన్ని అభివృద్ది చేయడానికి రూ. 1,200 కోట్ల రుపాయల పెట్టుబడితో నూతన ఫ్లాట్‌ఫామ్‌ను నిర్మించింది.

విడుదలయిన తొలినాళ్లలో విక్రయాలు అధకంగా నమోదయ్యాయి. ఒకానొక దశలో ఫోర్డ్ ఎకోస్పోర్ట్ అమ్మకాలను కూడా మించిపోయాయి. ప్రతి నెలా 5,000 ల యూనిట్లకు పైబడి విక్రయాలు జరిగేవి.

నిచ్చెన లాంటి ఆకారంలో ఉన్న బాడీ మరియు ఛాసిస్ గల టియువి300 మిగతా కాంపాక్ట్ ఎస్‌యువిల కన్నా చాలా విభిన్నమైన డిజైన్‌లో ఉంటుంది. అయితే గత కొంత కాలంలో టియువి300 విక్రయాలు మందగించాయి. నెలకు కేవలం 2,000 యూనిట్లు మాత్రమే అమ్ముడవుతున్నాయి.

కోటి రుపాయలు విలువ చేసే గ్రాండ్ చిరోకీ వాహనం తరహాలో మీ టియువి300 ను మోడిఫై చేసుకోవడం మీకు నచ్చిందా... అయితే మీరు కూడా ప్రయత్నించండి. ఆ వివరాలను మాతో పంచుకోండి. మీరు మోడిఫై చేసిన వాహనం గురించి కూడా డ్రైవ్‌స్పార్క్ తెలుగు ద్వారా పాఠకులతో పంచుకోండి....

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Monday, January 23, 2017, 14:25 [IST]
English summary
Mahindra TUV300 modified to look like a Jeep at just INR 1.5 lakh
Please Wait while comments are loading...

Latest Photos