కొత్త ఫీచర్ల జోడింపుతో సరికొత్త ఎక్స్‌యూవీ500 విడుదల: ప్రారంభ ధర రూ. 13.8 లక్షలు

Written By:

దేశీయ ఎస్‌యూవీ వాహనాల తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తమ ఫ్లాగ్‌షిప్ వెహికల్ ఎక్స్‌యూవీ 500 లో టెక్నాలజీ పరంగా అధనాతన ఫీచర్లను జోడించి మళ్లీ మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 13.8 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉన్న మహీంద్రా నిర్ణయించింది.

ఆండ్రాయిడ్ ఆటో, కనెక్టెడ్ యాప్స్, ఎకోసెన్స్ మరియు ఎమర్జెన్సీ కాల్ వంటి ఫీచర్లను కొత్తగా పరిచయం చేయడం జరిగింది. అంతే కాకుండా సరికొత్త లేక్ సైడ్ బ్రౌన్ కలర్ బాడీ మరియు బ్లాక్ కలర్ ఇంటీరియర్‌ను తమ డబ్ల్యూ10 వేరియంట్లో అందించింది.

దీని విడుదల వేదిక మీద మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ సెక్టార్ ప్రెసిడెంట్ రాజన్ వాధేరా మాట్లాడుతూ, ఎక్స్‌యూవీ500 ను తొలిసారిగా 2011లో విడుదల చేసినపుడు సరికొత్త ఉత్పత్తి కొత్త సెగ్మెంట్ సృష్టించి భారీ విజయాన్ని అందుకున్నట్లు గుర్తుచేశాడు.

ఇందులో ఆధునికతకు తగిన ఫీచర్లను జోడించడం ద్వారా అదే విజయం కొనసాగింది. కస్టమర్లకు ఎప్పటికప్పుడు నూతనత్వాన్ని పరిచయం చేసే క్రమంలో నూతన ఫీచర్లను జోడించి ఎక్స్‌యూవీ500 ను మళ్లీ విడుదల చేశామని రాజన్ చెప్పుకొచ్చారు.

ఎస్‌యూవీ కెటగిరీలో మరో బెంచ్ మార్క్ సాధించడానికి ప్రస్తుతం పరిచయం చేసిన ఆండ్రాయిడ్ ఆటో మరియు ఎకోసెన్స్ ఫీచర్లు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.

ఎక్స్‌యూవీ500 లోని ప్రధాన కీ ఫీచర్లు

ఆండ్రాయిడ్ ఆటో - ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్ ద్వారా కాల్స్, మెసేజ్, న్యావిగేషన్, మ్యూజిక్, మరియు గూగుల్ కనెక్టివిటి వంటి వాటిని సులభంగా వినియోగించుకోవచ్చు. వెహికల్‌లోని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌కు ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్ అనుసంధానించుకోవచ్చు.

కనెక్టెడ్ యాప్

ఎక్స్‌యూవీ500 లోని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లో వాహన పరిశ్రమలోనే తొలిసారిగా కనెక్టెడ్ యాప్ ను అందించింది మహీంద్రా. అత్యవసరమైన అప్లికేషన్లతో పాటు, ప్రస్తుతం విరివిగా అవసరమున్న గానా, జోమాటో, బుక్ మై షో మరియు ఇతర అప్లికేషన్లను ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ద్వారా వాడుకోవచ్చు.

ఎకో సెన్స్ ఫీచర్ - వాహన పరిశ్రమలో తొలిసారిగా మహీంద్రా ఈ ఎకోసెన్స్ టెక్నాలజీని అందించింది. ఇంధన వినియోగాన్ని సరళతరంగా నియంత్రిస్తూ, కార్బన్ డై ఆక్సైడ్ వాయువులను తక్కువ పరిమాణంలో పొగనుండి వెలువడే విధంగా డ్రైవర్‌కు సూచనలు చేస్తుంది ఈ వ్యవస్థ.

ఇందులో ఎకోస్కోర్ అనేది ఉంటుంది. ప్రతి 100 మార్కులకు గాను ఎకోస్కోక్ లెక్కించబడుతుంది. ప్రతి ట్రిప్పులో డ్రైవర్ వినియోగించే స్పీడ్, సెలెక్ట్ గేర్, యాక్సిలరేషన్, ఐడ్లింగ్, క్లచ్ ఉపయోగిస్తూ నడపడం మరియు కోపంగా బ్రేకులు వేస్తూ నడపడం వంటి అంశాలను ఆధారంగా ఎకోస్కోర్ లెక్కించడం జరుగుతుంది. వీటన్నింటిని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మీద ఎకోస్కోర్ మరియు సగటు ఎకోస్కోర్ ఎలా ఉందనేది డిస్ల్పే అవుతూ ఉంటుంది.

తమ ట్రిప్పు తరువాత 100 కు వచ్చిన ఎకోస్కోర్ ను ఎకోసెన్స్ ద్వారా సామాజిక మాద్యమాలైన ఫేస్‌బుక్, ట్విట్టర్ మరియు వాట్సాప్ ద్వారా స్నేహితులతో పంచుకోవచ్చు. వినియోగదారులు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ద్వారా వెహికల్ యొక్క ఎకోసెన్స్ డాటా మరియు హిస్టరీని తెలుకునే వెసులుబాటు ఉంది.

ఎమర్జెన్సీ కాల్

ఫస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్‌గా మహీంద్రా తమ ఎక్స్‌యూవీలో ఇ-కాల్ సిస్టమ్ అందించింది. దీని ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ కాల్ చేసుకోవచ్చు. ప్రమాదం జరిగిన వెంటనే ముందుగా సెట్ చేసిన రెండు నెంబర్లకు ఆటోమేటిక్‌గా కాల్ వెళుతుంది.

చివరగా "వన్ టచ్ లేన్ చేంజ్ ఇండికేటర్". మహీంద్రా తమ ఎక్స్‌యూవీలో సింగల్ టచ్ లేనే చేంజ్ ఇండికేటర్ అందించింది.

సాంకేతింకగా మహీంద్రా ఎక్స్‌యూవీ500లో 2.2-లీటర్ సామర్థ్యం ఉన్న ఎమ్‌హాక్ డీజల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 140బిహెచ్‌పి పవర్ మరియు 330ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. దీనిని 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌‌మిషన్‌తో ఎంచుకోవచ్చు.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Read In Telugu to know about Mahindra XUV500 Launched With New Features; Priced At Rs 13.8 Lakh
Please Wait while comments are loading...

Latest Photos