సెలెరియో ఇంత పెద్ద సక్సెస్ సాధించడానికి కారణం

Written By:

మారుతి సుజుకి ఇండియా లైనప్‌లో ఉన్న బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో సెలెరియో ఆటోమేటిక్ ఒకటి. 2014 నుండి దేశీయ మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన సెలెరియో ఇప్పటికీ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా స్థిరంగా అద్బుతమైన ఫలితాలు సాధిస్తోంది. మార్కెట్లోకి దీనికి ఎన్నో ఉత్పత్తులు పోటీ గా వచ్చినప్పటికీ కస్టమర్లలో దీనికంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

సెలెరియో ఆటోమేటిక్ హ్యాచ్‌బ్యాక్ సక్సెస్‌కు గల కారణాలు ఇవాళ్టి కథనంలో తెలుసుకుందాం రండి...

సెలెరియో హ్యాచ్‌బ్యాక్ గొప్ప విజయం సాధించడానికి గల ప్రధాన కారణం ఏఎమ్‌టిగా పిలువబడే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్. ఇండియన్ మార్కెట్లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో విడుదలైన మొదటి కారు సెలెరియో హ్యాచ్‌బ్యాక్.

ఏఎమ్‌టి గేర్‌బాక్స్ మనకు కొత్తే కావచ్చు, కానీ ప్రపంచ ఆటోమొబైల్ పరిశ్రమలో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వాడకం 1986 నుండే మొదలైంది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ ఆవశ్యకతను తెలుసుకున్న విదేశీ కార్ల తయారీ సంస్థ తాము ఉత్పత్తి చేసే స్పోర్ట్స్ కార్లలో ఏఎమ్‌టిని తప్పనిసరిగా అందిస్తూ వచ్చాయి.

ఆ తరుణంలో ఇండియన్ రోడ్లకు అనువైన డ్రైవింగ్ కోసం ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల కార్ల ఎంపిక చాలా ఉత్తమం అని భావించిన మారుతి సుజుకి తమ సెలెరియో హ్యాచ్‌బ్యాక్ కారులో ఏఎమ్‌టి గేర్‌బాక్స్ అందించి విడుదల చేసింది.

ఏఎమ్‌టి గేర్‌బాక్స్‌ల ఉత్పత్తి కోసం ప్రత్యేక ప్రొడక్షన్ యూనిట్, అధిక మొత్తంలో పెట్టుబడి మరియు టెక్నాలజీ గురించి తలమునకలు కాకుండా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ల ఉత్పత్తి చేసే సంస్థ మ్యాగ్నెట్టీ మారెల్లీతో ఒప్పందం కుదుర్చుకుని ఏఎమ్‌టి గేర్‌బాక్స్‌లను సేకరించి సెలెరియోలలో అందివ్వడం జరిగింది.

ఈ ఏఎమ్‌టి ట్రాన్స్‌మిషన్ ఉన్న కార్లను నడపడానికి క్లచ్ అవసరం లేదు. కేవలం బ్రేక్ మరియు యాక్సిలరేటర్ పెడల్స్ ఉంటే చాలు. మారుతికి విస్తారమైన డీలర్‌షిప్ నెట్‌వర్క్ ఉండటం ద్వారా దేశవ్యాప్తంగా నలుమూలలా ఏఎమ్‌టి సెలెరియో కార్లు అందుబాటులోకి వచ్చాయి.

కారు వేగం ఆధారంగా కంప్యూటర్ ఐఎస్‌యు మరియు సెన్సార్ల సహాయంతో గేర్లు ఆటోమేటిక్‌గా మారుతూ ఉంటాయి. తద్వారా మనం చేతులతో మార్చాల్సిన గేర్లు వేగాన్ని బట్టి అవసరమైన గేరును అదే మార్చేస్తూ ఉంటుంది.

మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌కు ఎంత స్పేస్ అవసరమో అదే స్పేస్‌లో ఏఎమ్‌టి ట్రాన్స్‌మిషన్ అమర్చవచ్చు. తద్వారా తక్కువ ఖర్చుతో ఏఎమ్‌టి అందించవచ్చు. మ్యాన్యువల్ మరియు ఏఎమ్‌టి వేరియంట్ల మైలేజ్ దాదాపుగా సమానంగానే ఉంటుంది.

ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సాంకేతికంగా మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ తరహాలోనే ఉంటుంది. తద్వారా చిన్న చిన్న రిపేర్లు వచ్చినా కూడా లోకల్‌గా ఉన్న మెకానిక్‌లు సరిచేయగలరు మరియు ఆటోమేటిక్ కార్ల నిర్వహణ కూడా చాలా సులభం.

ఈ అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని మారుతి సుజుకి తమ సెలెరియో హ్యాచ్‌బ్యాక్‌లో అందించింది. సాధారణ మరియు మధ్య తరగతి కస్టమర్లకు ఏఎమ్‌టి ట్రాన్స్‌మిషన్ గల కారను చేరువ చేసింది.

మార్కెట్లోకి విడుదలైన అనంతరం భారీ సక్సెస్ అందుకుంది సెలెరియో ఏఎమ్‌టి. దీని విజయాన్ని పసిగట్టిన ఇతర కార్ల తయారీ సంస్థలు టాటా టియాగో, రెనో క్విడ్ మరియు హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 కార్లు అందుబాటులోకి వచ్చాయి.

కొత్త మోడళ్లు మార్కెట్‌ను తాకినప్పటికీ సెలెరియో ఏఎమ్‌టికి ఉన్న డిమాండ్ తగ్గలేదు. ఈ విజయాన్ని ఇలాగే కొనసాగించాడినికి మారుతి తమ సెలెరియోలో కొన్ని మార్పులు చేర్పులు చేసి ఫేస్‌లిఫ్ట్ రూపంలో మళ్లీ విడుదల చేయనుంది.

Story first published: Tuesday, May 23, 2017, 13:19 [IST]
English summary
Read In Telugu: After Maruti launched the Celerio in 2004, Indians have been taking a big liking to it. The recent news about a Celerio facelift on its way has made me think. What's the big deal in a Celerio? And why are Indians going crazy over the Celerio?
Please Wait while comments are loading...

Latest Photos