మారుతి పాపులర్ కార్లపై ఫిబ్రవరి ఆఫర్లు మరియు డిస్కౌంట్లు

Written By:

ఫిబ్రవరి 2017 లో మారుతి సుజుకి నుండి కొత్త కారును కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. దేశ వ్యాప్తంగా ఉన్న మారుతి డీలర్లు మరియు మారుతి సుజుకి ప్రీమియమ్ విక్రయ కేంద్రాలు నెక్సా షోరూమ్‌లు కూడా పాపులర్ కార్ల మీద ప్రత్యేక ఆఫర్లు మరియు డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. ప్రత్యేకించి నూతన పెట్రోల్ కారును ఎంచుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లయితే, డీలర్లను సంప్రదించే ముందు ఈ కథనంలోని ఆఫర్లను గమనించాల్సిందే...

మారుతి ఆల్టో 800/ కె10

మారుతి సుజుకి లైనప్‌లో మంచి మైలేజ్ ఇవ్వగల కార్లలో ఆల్టో 800 ఒకటి. ఇక ఈ చిన్న కారుకు ఏదయినా సమస్య వచ్చిందంటే దేశం మొత్తం మీద విస్తారంగా వ్యాపించిన మారుతి డీలర్ల ద్వారా చక్కబెట్టుకోవచ్చు.

మారుతి డీలర్లు ఆల్టో 800 మీద మొత్తం 45,000 రుపాయల వరకు ఆఫర్లు ప్రకటించారు. (ఇందులో రూ. 25,000 లు క్యాష్ డిస్కౌంట్ మరియు రూ. 20,000 లు ఎక్స్‌చ్ఛేంజ్ బోనస్) ఎల్ఎక్స్ఐ మరియు ఎల్ఎక్స్ఐ(సిఎన్‌జి) వేరియంట్ల మీద ఈ ఆపర్లు ఉన్నట్లు గుర్తించండి.

శక్తివంతమైన కె10 మోడల్‌ మ్యాన్యువల్ వేరియంట్ల మీద రూ. 40,000 ల వరకు డిస్కౌంట్లు(రూ. 25,000 లు క్యాష్ డిస్కౌంట్ మరియు రూ. 20,000 లు ఎక్స్‌చ్ఛేంజ్ బోనస్) ఉన్నాయి. ఆటోమేటిక్ కె10 వేరియంట్ల మీద మనసు మళ్లిన వారికి 40 వేలతో పాటు మరో 5,000 రుపాయలను అదనపు డిస్కౌంట్లతో అందిస్తున్నారు.

మారుతి సుజుకి సెలెరియో

సెలెరియో లోని ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ, జడ్ఎక్స్ఐ మ్యాన్యువల్ వేరియంట్ల మీద రూ. 45,000 ల వరకు ఆఫర్లను ప్రకటించారు. ఇందులో రూ. 25,000 లు క్యాష్ డిస్కౌంట్ మరియు రూ. 25,000 లు ఎక్స్‌చ్ఛేంజ్ బోనస్ ఉంది.

ఇవే వేరియంట్లను ఆటోమేటిక్ ఆప్షన్‌లో ఎంచుకునే వారికి రూ. 40,000 ల వరకు ఆఫర్లను అందివ్వడం జరిగింది. సెలెరియో లోని సిఎన్‌జి వేరియంట్ల మీద క్యాష్ డిస్కౌంట్ రూపంలో రూ. 15,000 లు మరియు ఎక్స్‌చ్చేంజ్ క్రింద రూ. 25,000 లు వరకు ఆఫర్లు ఉన్నాయి.

మారుతి వ్యాగన్ ఆర్

వ్యాగన్ ఆర్ లోని పెట్రోల్ పవర్ మ్యాన్యువల్ వేరియంట్ల మీద గరిష్టంగా రూ. 40,000 ల(రూ. 25,000 లు క్యాష్ డిస్కౌంట్ మరియు రూ. 15,000 లు ఎక్స్‌చ్ఛేంజ్ బోనస్)) వరకు డిస్కౌంట్లను ప్రకటించాయి. వీటినే ఆటోమేటిక్ వేరియంట్లో ఎంచుకునే వారికి అదనంగా రూ. 5,000 ల వరకు అందుబాటులో ఉన్నాయి.

వ్యాగన్ ఆర్ సిఎన్‌జి వేరియంట్ల మీద క్యాష్ బ్యాక్ రూపంలో రూ. 2,000 ల వరకు మరియు ఎక్స్‌చ్చేంజ్ బోనస్‌గా రూ. 15,000 ల వరకు లాభాలను పొందవచ్చు.

మారుతి స్విప్ట్

మారుతి సుజుకిలో అత్యంత పాపులర్ మోడల్ స్విఫ్ట్ మీద కూడా మారుతి డీలర్లు ఆఫర్లను ప్రకటించారు. క్యాష్ బ్యాక్ మరియు ఎక్స్‌చ్ఛేంజ్ బోనస్ కలుపుకొని రూ. 25,000 ల వరకు ఆఫర్లను అందించారు.

మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్

మారుతి లోని కాంపాక్ట్ సెడాన్ వెర్షన్ స్విప్ట్ డిజైర్ స్విఫ్ట్ కన్నా భారీ విక్రయాలు సాధిస్తంది. అయినప్పటికీ దీని మీద రూ. 25,000 ల వరకు డిస్కౌంట్లను ప్రకటించారు.

మారుతి ఎర్టిగా ఎమ్‌పివి

ప్రస్తుతం ఇండియన్ ఎమ్‍‌పీవీ సెగ్మెంట్లో ఉన్న మిగతా వాటితో పోల్చుకుంటే ఎర్టిగా పరిమాణం పరంగా చిన్నగానే ఉంటుంది. కాని ఇందులో ఏడు మంది వరకు ప్రయాణించవచ్చు. మారుతి డీలర్లు ఈ ఎర్టిగా మీద మొత్తం 20,000 ల వరకు డిస్కౌంట్ ప్రకటించారు.

మారుతి సుజుకి సియాజ్

మారుతి సుజుకి సియాజ్ సెడాన్ మీద డీలర్లు గరిష్టంగా రూ. 45,000 ల (రూ. 30,000 లు క్యాష్ డిస్కౌంట్ మరియు రూ. 15,000 లు ఎక్స్‌చ్ఛేంజ్ బోనస్) వరకు ప్రయోజనాలను అందిస్తున్నారు.

మారుతి ఇఎకో

మారుతి లైనప్‌లోని -సీటింగ్ సామర్థ్యం ఉన్న ఇఎకో పెట్రోల్ వేరింట్ మీద ఎక్స్‌చ్చేంజ్ బోనస్ రూపంలో రూ. 10,000 లు మరియు ఇఎకో సిఎన్‌జి వేరియంట్ మీద మరో అదనపు పది వేల రుపాయలను బోనస్‌‌గా అందిస్తున్నారు.

దయచేసి గమనించండి - ఒక డీలర్ నుండి మరో డీలర్‌కి ఆఫర్ల మధ్య వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి షోరూమ్ లలో ఎంక్వైరీ చేసి అదనపు బోనస్‌లు అందించే అత్యుత్తమ డీల్స్‌ను పొందండి. మీకు నచ్చిన నగరంలో మారుతి సుజుకిలోని అన్ని వేరియంట్ల ధరలను తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి...

డ్రైవ్‌స్పార్క్ తెలుగు పాఠకుల కోసం కొత్త ఆప్షన్ పరిచయం చేసింది. దేశీయ ఆటోమొబైల్ వెబ్‌సైట్లలో తొలిసారిగా అన్ని వాహన తయారీ సంస్థలకు చెందిన వివిధ కార్ల ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ ఫోటోలను ఒక చోట చేర్చి ఫోటో గ్యాలరీ అనే సెక్షన్ ప్రారంభించింది. మీకు నచ్చిన ఫోటోలను వీక్షించేందుకు www.telugu.drivespark.com వెబ్‌సైట్లో ఫోటోలు సెక్షన్ మీద క్లిక్ చేయగలరు.... ఉదాహరణకు: మీ కోసం టాటా బెస్ట్ సెల్లింగ్ కారు టియాగో ఫోటో గ్యాలరీ...

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Maruti's Massive Discount Bonanza — Grab Yours Now
Please Wait while comments are loading...

Latest Photos