33 వేల బుకింగ్స్ , 10 వారాల వెయిటింగ్ పీరియడ్ అందుకున్న న్యూ డిజైర్

Written By:

మారుతి సుజుకి తమ నూతన కాంపాక్ట్ సెడాన్ న్యూ డిజైర్ మీద వెయిటింగ్ పీరియడ్ 10 వారాలుగా ఉన్నట్లు తెలిపింది. విడుదలైన రెండవ రోజు నాటికి ఈ న్యూ డిజైర్‌పై మొత్తం 33,000 ల బుకింగ్స్ నమోదయ్యాయి.

మారుతి సుజుకి ఈ సరికొత్త డిజైర్ కాంపాక్ట్ సెడాన్ మీద మే 5 వ తేదీన రూ. 11,000 ల ధరతో బుకింగ్స్ ప్రారంభించింది. విడుదలైన రెండవ రోజు నాటికి 11 రోజుల్లో 33,000 బుకింగ్స్ నమోదయ్యాయి.

సగటున రోజుకు 3,000 యూనిట్లు చొప్పున బుక్ అయ్యాయి. తక్కువ ధరతో బుకింగ్ చేసుకునే అవకాశం మరియు డిజైర్ బ్రాండ్ పాపులారిటీ నేపథ్యంలో ఈ విధమైన బుకింగ్స్ సాధ్యమయ్యాయని చెప్పవచ్చు.

బుకింగ్స్ భారీగా పెరిగినందున వాటిని డెలివరీ ఇచ్చేందుకు తీసుకునే సమయం కూడా విపరీతంగా పెరిగింది. ప్రత్యేకించి డిజైర్‌లోని 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఉన్న వాటి మీద వెయిటింగ్ పీరియడ్ ఎక్కువగా ఉంది.

మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల డిజైర్‌ల మీద ఎనిమిది నుండి తొమ్మిది వారాల వరకు అదే విధంగా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ గల వేరియంట్ల మీద నాలుగు నుండి ఐదు వారాల వరకు వెయిటింగ్ పీరియడ్ డీలర్లు పేర్కొంటున్నారు.

మారుతి విడుదల చేసిన న్యూ డిజైర్‌లో బేస్ వేరియంట్ మినహాయిస్తే, మిగతా అన్ని వేరియంట్లలో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ట్రాన్స్‌మిషన్(AGS) అందుబాటులో ఉంది.

ఈ తరహా బుకింగ్స్ నమోదుకావడానికి మరో కారణం దీని మైలేజ్. మునుపటి వేరియంట్ కన్నా తక్కువ బరువుతో నిర్మించడం, మరియు అత్యుత్తమ సామర్థ్యం గల ఇంజన్ అందివ్వడం ద్వారా డీజల్ వేరియంట్ లీటర్‌కు 28.40కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలిగింది. దీంతో ఇది భారత దేశపు అత్యుత్తమ మైలేజ్ ఇవ్వగల కారుగా నిలిచింది.

ఇంటీరియర్‌లో ఈ సారి డిజైర్ ప్రేమికులను సంతృప్తి పరిచింది మారుతి. ప్రీమియమ్ ఫీచర్లు మరియు విశాలమైన క్యాబిన్ ద్వారా ఎక్కువ హెడ్ మరియు లెగ్ రూమ్ ఉండటం ద్వారా సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు.

సరికొత్త మారుతి సుజుకి డిజైర్ పెట్రోల్ వేరియంట్ ధర రూ. 5.45 లక్షలు మరియు డీజల్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 6.45 లక్షలు ఎక్స్-షోరూమ్‌(ఢిల్లీ)గా ఉన్నాయి.

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Read In Telugu Maruti Dzire Recieves 33000 Bookings 10 Week Waiting Period
Please Wait while comments are loading...

Latest Photos