భారతదేశపు రెండవ అతి పెద్ద విక్రయాలు జరిపిన కారు: మారుతి బాలెనో

భారీ విక్రయాలతో భారతదేశపు రెండవ బెస్ట్ సెల్లింగ్ కారుగా బాలెనో నిలిచింది. వ్యాగన్ ఆర్, డిజైర్ మరియు స్విఫ్ట్ విక్రయాలను వెనక్కి నెట్టి మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచిన బాలెనో గురించి మరిన్ని వివరాలు...

Written By:

భారత దేశపు టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో మారుతికి చెందిన కార్లే అధిక సంఖ్యలో ఉంటాయి. ఈ జాబితాలో మొదటి స్థానం ఎప్పుడూ ఆల్టోదే. అయితే ద్వితీయ మరియు తృతీయ స్థానాల్లో నిలిచే డిజైర్, వ్యాగన్ ఆర్ మరియు స్విఫ్ట్ లను వెనక్కి నెట్టి మారుతి వారి ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ బాలెనో టాప్-10 విక్రయాల జాబితాలో రెండవ స్థానాన్ని చేరుకుంది.

మార్చి 2017 విక్రయాలు మారుతి సుజుకి సంస్థకు ఓ కొత్త మైలు రాయిని సాధించిపెట్టాయి. మారుతి లైనప్‌లో ఉన్న ఆల్టో, వ్యాగన్ఆర్, డిజైర్ మరియు స్విఫ్ట్ కార్లు టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచేవి.

అయితే మార్చి 2017 విక్రయాల్లో ఈ ధోరణి పూర్తి మారిపోయింది. మారుతి వారి ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ బాలెనో కారు భారీ సంఖ్యలో విక్రయాలు నమోదు చేసుకుని టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది. మారుతి ఆల్టో యథావిధిగా తొలి స్థానంలో నిలిచింది.

మార్చి 2017 కార్ల విక్రయాల గణాంకాలను పరిశీలిస్తే భారీ రికార్డును నమోదు చేసుకుని 16,426 యూనిట్ల బాలెనో కార్లు అమ్ముడుపోయాయి. గత ఏడాది మార్చి నెల విక్రయాలు 6,236 యూనిట్లతో పోల్చుకుంటే 163.40 శాతం వృద్ది నమోదైంది.

మారుతి సుజుకి బాలెనో ప్రీమియమ హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసినప్పటి నుండి దేశవ్యాప్తంగా ఎంతో మంది ఫేవరెట్ కారుగా నిలిచింది. ఇప్పటికీ అనేక డెలివరీలు పెండింగ్‌లో ఉన్నాయి మరియు వివిధ వేరియంట్ల వారీగా వెయిటింగ్ పీరియడ్ అధికంగానే ఉంది.

డిమాండ్‌కు తగిన మేర మారుతి సుజుకి బాలెనో కార్లను ఉత్పత్తి చేయడంలో విఫలం చెందుతూ వచ్చింది. అయితే గుజరాత్‌లోని నూతన ప్లాంటులో ఉత్పత్తిని ప్రారంభించిన తరువాత వెయిటింగ్ పీరియడ్ కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తోంది.

ప్రస్తుతం 80,000 యూనిట్లకు పైగా ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయి. మరియు వెయిటింగ్ పీరియడ్ నాలుగు నుండి ఐదు నెలల మధ్య ఉంది. మారుతి సుజుకి బ్రాండ్ విలువను పెంచే విధంగా బాలెనోలో అద్బుతమైన డిజైన్ మరియు ఫీచర్లు ఉన్నాయి.

బాలెనో పేరుకు మరింత ఖ్యాతిని గడించిపెట్టే విధంగా మారుతి బాలెనోలో మరింత శక్తివంతమైన వేరియంట్ బాలెనో ఆర్ఎస్‌ను అందుబాటులోకి తెచ్చింది.

మారుతి సుజుకి ప్రీమియమ్ విక్రయ కేంద్రం నెక్సా షోరూమ్ ద్వారా బాలెనోను అందుబాటులో ఉంచింది. ఇదే నెక్సా అవుట్ లెట్‌లో ఎస్-క్రాస్, ఇగ్నిస్ మరియు కొత్తగా విడుదలైన సియాజ్ సెడాన్ లను కూడా అందుబాటులో ఉంచింది.

భారీ స్థాయిలో ఇండియన్స్ ఎంచుకుంటున్న ఈ బాలెనో యొక్క ఇంజన్, ధరలు, ఫీచర్లు మరియు మరిన్ని ఇతర వివరాలను చూద్దాం రండి.... మారుతి సుజుకి బాలెనో పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్‌లలో లభిస్తుంది.

ఇందులోని 1.2-లీటర్ సామర్థ్యం గల నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ 83బిహెచ్‌పి పవర్ మరియు 115ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. దీనిని 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ ట్రాన్స్‌మిషన్‌తో ఎంచుకోవచ్చు.

బాలెనో లోని మరో ఇంజన్ ఆప్షన్, 1.3-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ గరిష్టంగా 74బిహెచ్‌పి పవర్ మరియు 190ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. దీనిని కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో ఎంచుకోవచ్చు.

మారుతి తమ బాలెనోకు కొనసాగింపుగా శక్తివంతమైన వేరియంట్‌తో విడుదల చేసిన బాలెనో ఆర్ఎస్ లో 1.0-లీటర్ సామర్థ్యం ఉన్న బూస్టర్ జెట్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 100బిహెచ్‌పి పవర్ మరియు 150ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. దీనికి 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ అనుసంధానం కలదు.

ధరలు

పెట్రోల్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 5.28 లక్షలు
డీజల్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 6.45 లక్షలు
బాలెనో ఆర్ఎస్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 8.69 లక్షలు
అన్ని ధరలు ఎక్స్-షోరూమ్‌గా ఇవ్వబడ్డాయి. మీ నగరంలో బాలెనో ధరలు తెలుసుకోండి

 

WHAT OTHERS ARE READING

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Saturday, April 8, 2017, 11:57 [IST]
English summary
Read in Telugu to know about india's second largest selling car baleno premium hatchback. Get more details about baleno premium hatchback price, engine, mileage, features, specs, photos and more.
Please Wait while comments are loading...

Latest Photos

LIKE US ON FACEBOOK