2017 స్విఫ్ట్ డిజైర్ తొలిరూపాన్ని మరియు విడుదల తేదీని ఆవిష్కరించిన మారుతి సుజుకి

మారుతి సుజుకి తమ నెక్ట్స్ జనరేషన్ 2017 స్విఫ్ట్ డిజైర్‌ను తొలిసారిగా ఆవిష్కరించింది. మార్కెట్ దిగ్గజాలు ఊహించని డిజైన్ మార్పులతో సరికొత్త స్విఫ్ట్ డిజైర్‌ను తొలి పరిచయం చేసింది.

By Anil

మారుతి సుజుకి మరో నెలలో విడుదల చేయనున్న స్విఫ్ట్ డిజైర్ కాంపాక్ట్ సెడాన్ నెక్ట్స్ జనరేషన్‌ను ఆవిష్కరించింది. డిజైన్ పరంగా మార్పులు చేర్పులు చేసి ప్రపంచానికి ఈ తరువాత తరం స్విఫ్ట్ డిజైర్‌ను తొలి పరిచయం చేసింది.

మారుతి సుజుకి 2017 స్విఫ్ట్ డిజైర్

మారుతి సుజుకి 2008లో తొలిసారిగా విడుదల చేసిన మరియు 2012లో ఫేస్‌లిఫ్ట్ రూపంలో విడుదల చేసిన తమ స్విఫ్ట్ డిజైర్ పేరును సేకరించి తరువాత తరం స్విఫ్ట్ డిజైర్‌గా మనం ఏ మాత్రం ఊహించని మార్పులతో తీర్చిదిద్దింది.

మారుతి సుజుకి 2017 స్విఫ్ట్ డిజైర్

మారుతి సుజుకి ఈ సరికొత్త స్విఫ్ట్ డిజైర్‌ను తమ మునుపటి సింపుల్ ఫ్లాట్‌ఫామ్ మరియు బాలెనో వేదిక ఆధారంగా అభివృద్ది చేసింది. సాధారణ స్విఫ్ట్ డిజైర్ కన్నా దీని వీల్ బేస్ మరియు వెడల్పు 40ఎమ్ఎమ్ వరకు పెరిగింది. తద్వారా మునుపటి మోడల్ కన్నా మరింత విశాలమైన ఇంటీరియర్ స్పేస్ కలిగి ఉంది.

మారుతి సుజుకి 2017 స్విఫ్ట్ డిజైర్

డిజైన్ విషయానికి వస్తే, దీని రూపాన్ని మార్చేందుకు మారుతి డ్రాయింగ్ టేబుల్‌కు అతుక్కుపోయిందనే చెప్పాలి. మునుపటిలా సాధారణ స్విప్ట్‌కు బూట్ తగిలించడం ద్వారా కనిపించే కాంపాక్ట్ సెడాన్‌లా కాకుండా సరికొత్త సెడాన్‌ను తలపిస్తోంది దీని మొత్తం డిజైన్.

మారుతి సుజుకి 2017 స్విఫ్ట్ డిజైర్

ముందు డిజైన్ త్వరలో విడుదల కానున్న మరియు జపాన్ మార్కెట్లో విడుదలైన స్విఫ్ట్‌నే పోలి ఉంది. అయితే ముందు వైపున అద్దం తరువాత ప్రారంభమయ్యే కారు పైభాగం ఎత్తుగా ఉండి, వెనక్కిపోయేకొద్దీ ఎత్తు తగ్గిపోయింది... వాలుగా ఉంటుంది. తద్వారా ఈ సెడాన్ యొక్క ఎత్తు దాదాపు తగ్గిపోయిందని చెప్పాలి.

మారుతి సుజుకి 2017 స్విఫ్ట్ డిజైర్

ఫ్రంట్ డిజైన్‌లో అధునాతన విభిన్న ఆకారంలో, అనేక క్రోమ్ స్లాట్లున్న విశాలమైన ఫ్రంట్ గ్రిల్ కలదు. దీనికి ఇరువైపులా పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు మరియు ఎల్ఇడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఇందులో ఉన్నాయి.

మారుతి సుజుకి 2017 స్విఫ్ట్ డిజైర్

బూట్ (డిక్కీ) కాస్త ఎత్తులో ఉండటాన్ని గమనించవచ్చు. కాని ఇప్పట్లో ఇలాంటి మోడళ్లకు గిరాకీ పెరుగుతోంది. రియర్ డిజైన్‌లో ఇరువైపులా సిగ్నేచర్ ఎల్ఇడి టెయిల్ లైట్లు, ఈ రెండింటిని కలిపే క్రోమ్ పట్టీ వెడల్పుగా ఉంటుంది.

మారుతి సుజుకి 2017 స్విఫ్ట్ డిజైర్

సరికొత్త 2017 స్విఫ్ట్ డిజైర్‌లో రెండు పరిమాణాల్లో వీల్ ఆప్షన్స్ ఉన్నాయి. అవి 14 అంగుళాలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ 15 అంగుళాల పరిమాణం ఉన్న చక్రాలతో అందుబాటులోకి రానున్నాయి.

మారుతి సుజుకి 2017 స్విఫ్ట్ డిజైర్

స్విప్ట్ డిజైర్ అనేక ప్రీమియమ్ ఇంటీరియర్ ఫీచర్లతో రానుంది. టాప్ ఎండ్ వేరియంట్ స్విఫ్ట్ డిజైర్‌లో పెద్ద పరిమాణంలో ఉన్న తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ రానుంది, ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే అప్లికేషన్లను సపోర్ట్ చేయనుంది.

మారుతి సుజుకి 2017 స్విఫ్ట్ డిజైర్

స్టీరింగ్ వీల్ మరియు డ్యాష్ బోర్డు కలపతో రూపొందించిన తొడుగులను అందించింది. మరియు వెనుక వైపు కూర్చునే ప్రయాణికులకు ఆటోమేటిక్ ఎయిర్ కండీషన్ వెంట్‌లను అందివ్వడం జరిగింది.

మారుతి సుజుకి 2017 స్విఫ్ట్ డిజైర్

సరికొత్త 2017 స్విఫ్ట్ డిజైర్‌లో అవే ఇంజన్ వేరియంట్లను కొనసాగించనుంది. అవి 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ మరియు 1.3-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్. వీటితో పాటు 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లను యథావిధిగా కొనసాగించనుంది.

మారుతి సుజుకి 2017 స్విఫ్ట్ డిజైర్

భద్రత పరంగా మారుతి ఈ సరికొత్త స్విఫ్ట్ డిజైర్‌లో యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, డ్రైవర్ మరియు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగులు మరియు వెనుక సీట్లకు స్టాండర్డ్ ఫీచర్‌గా ఐఎస్ఒఫిక్స్ పాయింట్లను అందిస్తోంది.

మారుతి సుజుకి 2017 స్విఫ్ట్ డిజైర్

నూతన స్విఫ్ట్ డిజైర్ ఆరు విభిన్న రంగుల్లో అందుబాటులోకి రానుంది. అవి, ఆర్కిటిక్ వైట్, సిల్కి సిల్వర్, మ్యాగ్మా గ్రే, గల్లంట్ రెడ్, షెర్వూడ్ బ్రౌన్ మరియు ఆక్స్‌ఫర్డ్ బ్లూ.

మారుతి సుజుకి 2017 స్విఫ్ట్ డిజైర్

మారుతి సుజుకి ఈ నెక్ట్స్ జనరేషన్ 2017 స్విఫ్ట్ డిజైర్ సెడాన్ కారును మే 16 2017 న దేశీయ మార్కెట్లోకి విడుదల చేయనుంది.

Most Read Articles

English summary
Read In Telugu To Know About 2017 Maruti Suzuki Dzire Unveiled; Launch Date Revealed
Story first published: Monday, April 24, 2017, 21:21 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X