2-3 మూడు నెలల పాటు వెయిటింగ్‌ పీరియడ్‌తో 10,000 బుకింగ్స్ నమోదు చేసుకున్న ఇగ్నిస్

Written By:

మారుతి సుజుకి ఇగ్నిస్ విడుదలైనప్పటి నుండి భారీ బుకింగ్స్ నమోదు చేసుకుంటోంది. కేవలం 20 రోజుల్లో 10,000 బుకింగ్స్ నమోదయ్యాయి. తద్వారా వెయిటింగ్ పీరియడ్ 2 - 3 నెలల వరకు ఉన్నట్లు మారుతి తెలిపింది.

మారుతి సుజుకి తమ మొదటి క్రాసోవర్ కారును జనవరి 13, 2017న దేశీయ విపణిలోకి విడుదల చేసింది. విడుదల కంటే ముందుగా జనవరి 1, 2017 నుండి బుకింగ్స్ ప్రారంభించింది. విడుదలకు ముందే 6,000 లకు పైగా బుకింగ్స్ నమోదు చేసుకుంది.

అసాధారణ స్పందనకు ప్రొడక్షన్ ప్లాంటులో ఉత్పత్తిలో జాప్యం జరుగుతున్న కారణంగా వెయిటింగ్ పీరియడ్ మూడు నెలల పాటు ఉన్నట్లు మారుతి తెలిపింది.

మారుతి సుజుకి విడుదల చేసిన ఇగ్నిస్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 4.59 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 7.46 లక్షలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉంది.

మారుతి తమ లైనప్‌లో ఉన్న స్విఫ్ట్, రిట్జ్ తో పాటు స్విఫ్ట్ డిజైర్ అమ్మకాలను ఈ ఇగ్నిస్‌ తినేస్తోంది. ఈ మూడు ఉత్పత్తుల్లో లేని ఫీచర్లు ఇగ్నిస్‌లో ఉండటం ఇందుకు ప్రధానం కారణం అని చెప్పవచ్చు.

గుజరాత్ లోని ప్లాంటులో అవసరాన్ని బట్టి ప్రొడక్షన్‌ను పెంచుకునే సామర్థ్యాన్ని కలిగింది. కాబట్టి వెయిటింగ్ పీరియడ్ ఎక్కువగా పెరిగే అవకాశం లేదు.

పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వేరియంట్లలో లభించే ఇగ్నిస్ క్రాసోవర్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో అందుబాటలో ఉంది.

ఇగ్నిస్ లో 81.2బిహెచ్‌పి పవర్ మరియు 113ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల 1.2-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ మరియు 74బిహెచ్‌పి పవర్ మరియు 190ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల 1.3-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ కలదు.

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ గ్రాండ్ ఐ10, మారుతి సుజుకి కెయువి100 లకు గట్టి పోటీనిస్తోంది. అంతే కాకుండా మారుతి లైనప్‌లో ఉన్న స్విఫ్ట్‌కు కూడా ఇది బలమైన పోటీనిస్తోంది.

మారుతి సుజుకి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారును కొనుగోలు చేయాలని చూస్తున్నారా...? కొద్ది రోజులు ఆగండి, ఎందుకంటే మారుతి త్వరలో తమ నెక్ట్స్ జనరేషన్‌ స్విఫ్ట్ ను విడుదల చేయనుంది. దీనికి సంభందించిన ఫోటోలు....

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Maruti Suzuki Ignis Receives Tremendous Bookings
Please Wait while comments are loading...

Latest Photos