రిట్జ్ కారుకు శాశ్వతంగా వీడ్కోలు పలికిన మారుతి సుజుకి

Written By:

భారత దేశపు అతి పెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తమ బెస్ట్ సెల్లింగ్ పాపులర్ హ్యాచ్‌బ్యాక్ రిట్జ్ కారును అమ్మకాలను నుండి పూర్తిగా తొలగించింది. దేశీయ మరియు అంతర్జాతీయ విపణి నుండి శాశ్వతంగా తొలగించింది.

మారుతి సుజుకి ఇండియా 2009 లో పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వేరియంట్లలో రిట్జ్ హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసింది. మారుతి ఇప్పటి వరకు సుమారుగా నాలుగు లక్షల యూనిట్ల రిట్జ్ కార్లను విక్రయించింది.

మారుతి సుజుకి ఇండియా అభివృద్ది విభాగానికి చెందిన వ్యక్తి మాట్లాడుతూ, "పోర్ట్‌ఫోలియోలో ఉన్న మోడళ్లను రీఫ్రెష్ చేయడంలో భాగంగా, ఇది వరకే ఉన్న ఉత్పత్తుల మీద నిర్వహించిన సమీక్ష మేరకు కొన్ని మోడళ్లను తొలగించాల్సి వచ్చింది. అందులో భాగంగానే రిట్జ్ హ్యాచ్‌బ్యాక్‌ను తొలగించడం జరిగిందని తెలిపాడు."

ప్రస్తుతం ఉన్న అనేక కాంపాక్ట్ కార్ల మధ్య మారుతి స్థానాన్ని పధిలం చేయడంలో రిట్జ్ అతి ముఖ్యమైన పాత్ర వహించింది. అనతి కాలంలో మంచి విజయాన్ని అందుకున్న రిట్జ్ మారుతి యొక్క పాపులర్ మోడల్‌గా నిలిచింది.

కాంపాక్ట్ సెగ్మెంట్లోకి మారుతి ప్రవేశపెట్టిన ఇగ్నిస్, స్విఫ్ట్, సెలెరియో, డిజైర్ మరియు బాలెనో కార్లు మంచి విజయాన్ని అందుకొన్నాయి. జనవరి 2017 కాలంలో కాంపాక్ట్ సెగ్మెంట్ విభాగంలో 25.2 శాతం వృద్దిని నమోదు చేసుకుంది.

రిట్జ్‌తో పాటు మారుతి ఈ మధ్య ఎస్-క్రాస్ లోని లో ఎండ్ వేరియంట్లను తక్కువ డిమాండ్ ఉన్న కారణంగా లైనప్‌ నుండి తొలగించింది.

మారుతి సుజుకి కొన్ని పాత మోడళ్లకు స్వస్తిపలుకుతూనే, నూతన మోడళ్లకు స్వాగతం పలుకుతోంది. ప్రస్తుతం ఉన్న స్విఫ్ట్ స్థానంలోకి 2017 స్విఫ్ట్ విడుదలకు మారుతి సిద్దం అవుతోంది. ఇదే మోడల్‌ను ఇది వరకే జపాన్‌లో విడుదల చేసారు. ఈ అప్ కమింగ్ స్విఫ్ట్ ఫోటోల కోసం క్రింది గ్యాలరీ మీద క్లిక్ చేయండి....

  

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Maruti Suzuki's Popular Hatcback Is No More - Not Ritzy Enough?
Please Wait while comments are loading...

Latest Photos