భారీ బుకింగ్స్ కారణంతో గుదిబండగా మారిన డెలివరీ

2017 జనవరి నాటికి మారుతి సుజుకి వితారా బ్రిజా మీద 45,000 పెండింగ్ బుకింగ్స్ ఉన్నాయి. వితారా బ్రిజాలోని అన్ని వేరియంట్ల మీద వెయిటింగ్ పీరియడ్ సుమారుగా 6 నుండి 7 నెలల వరకు ఉంది.

By Anil

భారత దేశపు అతి పెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి వితారా బ్రిజా తెచ్చిన సంతోషాన్ని ఇంకా అనుభవిస్తూనే ఉంది. మారుతి పరిచయం చేసిన తమ మొదటి కాంపాక్ట్ ఎస్‌యూవీ అమ్మకాల్లో విజయాన్ని అలాగే కొనసాగిస్తోంది. అయిlతే దీర్ఘ కాలం పాటున్న వెయింట్ పీరియడ్ కారణంగా ఇప్పుడు డెలివరీలిచ్చేందుకు నానా అవస్థలు పడుతోంది.

మారుతి సుజుకి వితారా బ్రిజా

మారుతి సుజుకి కస్టమర్లకు సమయానికి డెలివరీ ఇచ్చే విషయంలో కాస్త తటపటాయిస్తోంది. జనవరి 2017 నాటికి మొత్తం 45,000 పెండింగ్ బుకింగ్స్ ఉన్నాయి. వివిధ వేరియంట్ల వారీగా కాల పరిమితి సుమారుగా 6 నుండి 7 నెలల వరకు ఉంది.

మారుతి సుజుకి వితారా బ్రిజా

ప్రస్తుతం వితారా బ్రిజాను ఉత్పత్తి చేస్తున్న ప్లాంటు నుండి బాలెనో ప్రొడక్షన్‌ను గుజరాత్‌లో రెండు వారాల క్రితం మారుతి ప్రారంభించిన నూతన ప్లాంటుకి మార్చడం జరిగింది. తద్వారా వితారా బ్రిజా ఉత్పత్తి కాస్త జోరందుకుంది.

మారుతి సుజుకి వితారా బ్రిజా

మారుతి సుజుకి ప్రతి నెలా సగటున 9,000 నుండి 10,000 వరకు వితారా బ్రిజా లను మరియు 12,000 నుండి 14,000 యూనిట్ల వరకు బాలెనో లను ఉత్పత్తి చేస్తోంది.

మారుతి సుజుకి వితారా బ్రిజా

మారుతి తమ వితారా బ్రిజా ను విడుదల చేసినప్పటి(మార్చి 2016) నుండి జనవరి 2017 వరకు మొత్తం 90,000 యూనిట్లను డెలివరీ ఇచ్చింది. ప్రతి నెలా సగటున 9,000 నుండి 10,0000 యూనిట్లను విక్రయిస్తోంది.

మారుతి సుజుకి వితారా బ్రిజా

విడుదలయిన కేవలం 11 నెలల్లోనే లక్ష అమ్మకాల మైలురాయిని చేరుకునే వేగవంతమైన కాంపాక్ట్ ఎస్‌యూవీ వితారా బ్రిజా అని నిఖ్కచ్చితంగా చెప్పవచ్చు.

మారుతి సుజుకి వితారా బ్రిజా

మారుతి వితారా బ్రిజా కాంపాక్ట్ ఎస్‌యూవీ నాలుగు విభిన్న వేరియంట్లలో లభించును. అవి, ఎల్‌డిఐ, విడిఐ, విడిఐ ప్లస్, జడ్‌డిఐ మరియు జడ్‌డిఐ ప్లస్. అన్ని వేరియంట్లు కూడా కేవలం డీజల్ ఇంజన్ ఆప్షన్‌లలో మాత్రమే లభించును.

మారుతి సుజుకి వితారా బ్రిజా

సాంకేతికంగా వితారా బ్రిజాలో 1.3-లీటర్ సామర్థ్యం గల డిడిఐఎస్ 200 నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 88.50బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

మారుతి సుజుకి వితారా బ్రిజా

ఇందులోని ఇంజన్‌కు అనుసంధానం చేసిన 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ద్వారా పవర్ మరియు టార్క్ ముందు చక్రాలకు అందుతుంది.

మారుతి సుజుకి వితారా బ్రిజా

వితారా బ్రిజా ప్రారంభ వేరియంట్ ధర రూ. 7.26 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 9.92 లక్షలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి. మీకు నచ్చిన నగరంలో వితారా బ్రిజా ధరలను తెలుగులో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

.

ఒక మంచి శక్తివంతమైన, నాణ్యమైన, భద్రత మరియు ఇంటీరియర్ ఫీచర్లతో నిండిన ఎస్‌యూవీని కొనుగోలు చేయాలనుకుంటున్నారా....? ధరకు తగ్గ విలువలతో టాటా మోటార్స్ విడుదల చేసిన హెక్సా ఒక ఉత్తమ ఎంపిక అని చెప్పవచ్చు. ఫోటోల కోసం క్రింది గ్యాలరీని క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Maruti Brezza Still Has A Huge Number Of Pending Bookings
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X