11 నెలల్లో రెండు లక్షల వితారా బ్రిజా వాహనాల విక్రయాలు

మారుతి సుజుకి వితారా బ్రిజా అమ్మకాలతో మరో మైలు రాయిని చేధించింది. కేవలం 11 నెలల్లో 2 లక్షల బుకింగ్స్ నమోదు చేసుకుని కాంపాక్ట్ ఎస్‌యువి సెగ్మెంట్లో అత్యుత్తమ అమ్మకాలు సాధిస్తోంది.

Written By:

మారుతి సుజుకి గత ఏడాది మార్చిలో ఇండియన్ మార్కెట్లోకి తమ మొట్టమొదటి కాంపాక్ట్ ఎస్‌యువి వితారా బ్రిజా ను విడుదల చేసింది. చిన్న కార్లలో విప్లవాత్మక అమ్మకాలు జరిపే మారుతికి ఇప్పుడు తమ లైనప్‌లో పెద్ద వాహనం వితారా బ్రిజా భారీ విక్రయాలు సాధించిపెడుతోంది.

వితారా బ్రిజా విడుదలైనప్పటి నుండి భారీ విక్రయాలు జరుపుతోంది. కాంపాక్ట్ ఎస్‌యువి సెగ్మెంట్లో ఆలస్యంగా విడుదలైనప్పటికీ పోటీదారులు కోలుకోని విధంగా విక్రయాలు జరుపుతోంది. కేవలం 11 నెలల కాలంలో రెండు లక్షలకు పైగా బుకింగ్స్ నమోదు చేసుకుంది.

కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో బెస్ట్ సెల్లింగ్ వాహనంగా నిలిచిన వితారా బ్రిజా కేవలం డీజల్ వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉంది, అయితే దీనికి పోటీగా ఉన్న ఫోర్డ్ ఎకో స్పోర్ట్, మహీంద్రా టియువి300 వాహనాలు పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంధన వేరియంట్లలో లభిస్తున్నాయి.

కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఇదో సునామీ అని చెప్పవచ్చు. ఎందుకంటే సగటున 9,000 వితారా బ్రిజా వాహనాలను అమ్ముడుపోతున్నాయి. అది కూడా మారుతి లిమిటెడ్‌గా డెలివరీలు చేపడుతోంది.

వితారా బ్రిజా విడుదలయ్యి దాదాపు సంవత్సరం కావస్తోంది. అయినప్పటికీ కాంపాక్ట్ ఎస్‌యూవీలో దీనికున్న డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు. దాదాపు అన్ని వేరియంట్ల మీద వెయింటింగ్ పీరియడ్ ఏడు నెలలుగా ఉంది.

మారుతి ఈ వితారా బ్రిజా ద్వారా మరో గర్వించదగ్గ అవార్డును గెలుచుకుంది. 2017 సంవత్సారానికి గాను ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ 2017 అవార్డును వితారా బ్రిజా సొంతం చేసుకుంది. ఈ అవార్డుకు బరిలో నిలిచిన ఇన్నోవా క్రిస్టా మరియు హ్యుందాయ్ టక్సన్ ఎస్‌యూవీలను కూడా వెనక్కి నెట్టేసింది.

మారుతి సుజుకి పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో 100 శాతం దేశీయంగా ఉన్న మారుతి సుజుకి ఆర్&డి కేంద్రాలలో వితారా బ్రిజా కాంపాక్ట్ ఎస్‌యూవీని అభివృద్ది చేసింది.

సాంకేతికంగా వితారా బ్రిజా కాంపాక్ట్ ఎస్‌యువిలో 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న డిడిఐఎస్ డీజల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 88.5బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. దీనికి 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

వితారా బ్రిజా ప్రారంభ వేరియంట్ ధర రూ. 7.19 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 9.88 లక్షలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి. మీ నగరంలో మీకు నచ్చిన కార్ల ధరలు తెలుసుకోవడానికి......

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Maruti Suzuki Vitara Brezza Garners A Whopping 2 Lakh Bookings In 11 Months
Please Wait while comments are loading...

Latest Photos