మారుతి నుండి లిమిటెడ్ ఎడిషన్ మోడిఫైడ్ వితారా బ్రిజా

మారుతి సుజుకి అధీకృత డీలర్ కళ్యాణి మోటార్స్ హైదరాబాద్ మరియు బెంగళూరులో లిమిటెడ్ ఎడిషన్‌గా మోడిఫైడ్ వితారా బ్రిజా కాంపాక్ట్ ఎస్‌యువిని అందుబాటులో ఉంచింది. మీకు ఇలాంటిది కావాలంటే ఈ కథనాన్ని పూర్తిగా చూడ

Written By:

మారుతి సుజుకి హైదరాబాద్ మరియు బెంగళూరు ఆధారిత అధీకృత డీలర్ కళ్యాణి మోటార్స్, మారుతి సుజుకి యొక్క ఐక్రియేట్ అనే మోడిఫికేషన్ ప్రోగ్రామ్ వినియోగించి వితారా బ్రిజా కాంపాక్ట్ ఎస్‌యూవీని ఇలా విభిన్నంగా మోడిఫై చేయించింది.

అయితే ఈ విభిన్నన మోడిఫైడ్ వితారా బ్రిజాను కేవలం లిమిటెడ్ ఎడిషన్‌గా మాత్రమే అందుబాటులో ఉంచినట్లు కళ్యాణి మోటార్స్ తెలిపింది.

విడిఐ ఆధారిత వితారా బ్రిజా ను గ్లాస్ బ్లాక్ గ్రిల్, గ్లాస్ వైట్ ఫాగ్ లైట్ల చుట్టూ పొగచూరిన హెడ్ ల్యాంప్స్, బ్యానెట్ మీద వితారా బ్రిజా పేరు, ముందు వైపు డోరు మీద లిమిటెడ్ ఎడిషన్ బ్యాడ్జ్ కలదు.

డ్యూయల్ టోన్ గల 16-అంగుళాల అల్లాయ్ చక్రాలు, సిల్వర్ సైడ్ గార్నిష్, నల్లటి రంగులో ఉన్న పిల్లర్లు మరియు రూఫ్, నల్లటి పూత పూయబడిన టెయిల్ ల్యాంప్స్, టెయిల్ గేట్ మీదుగా సుజుకి పేరు కలదు.

లిమిటెడ్ ఎడిషన్ వితారా బ్రిజా ఇంటీరియర్‌లోఫాక్స్ లెథర్ సీట్ కవర్లు, డ్యాష్్ బోర్డ్ మీద మరియు డోర్ ప్యానల్స్ మీద మెరుగులు దిద్దిన ప్లాస్టిక్ సొబగులు, లెథర్ తొడుగులు గల స్టీరింగ్ వీల్ మరియు ఆర్మ్ రెస్ట్ మరియు ఒఇఎమ్ తాకే తెర గల ఆడియో సిస్టమ్ కలదు.

ఈ మోడిఫైడ్ లిమిటెడ్ ఎడిషన్ విడిఐ వితారా బ్రిజా వేరియంట్లో 1.3-లీటర్ సామర్థ్యం గల డిడిఐఎస్ నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్ కలదు. 

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ గరిష్టంగా 89బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఈ వితారా బ్రిజా లీటర్‌కు 24.5కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు.

ప్రస్తుతం వితారా బ్రిజా విడిఐ వేరియంట్‌ను రూ. 9,80,338 ల ఆన్ రోడ్ ధరతో విక్రయిస్తోంది. కస్టమైజేషన్ ఖర్చుల(రూ. 2,40,000)తో కలుపుకుంటే ఈ మోడిఫైడ్ వితారా బ్రిజా ధర రూ. 12.20 లక్షలు ఆన్ రోడ్‌గా ఉంది.

ఎయిర్ బ్యాగ్ జోడింపుతో స్విఫ్ట్ డిఎల్ఎక్స్ విడుదల: ప్రారంభ ధర రూ. 4.8 లక్షలు
మారుతి సుజుకి లైనప్‌లోని స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ డిఎల్ఎక్స్ వేరియంట్‌ను డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగు జోడింపుతో మార్కెట్లోకి విడుదల చేసింది. దీని రూ. 4.8 లక్షలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నట్లు తెలిపింది.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Wednesday, February 1, 2017, 18:17 [IST]
English summary
Modified Vitara Brezza Is Asking For a INR 2.4 Lakh Premium
Please Wait while comments are loading...

Latest Photos

LIKE US ON FACEBOOK