మోటార్ వెహికల్ చట్టంలోని మార్పులను క్యాబినెట్ ఆమోదించింది

Written By:

వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్‌కు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేస్తూ మరియు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు విధించేందుకు మోటార్ వాహనాల చట్టంలోని 2016 సవరణ బిల్లును క్యాబినెట్ ఆమోదించింది.

మద్యం సేవించి వాహనాలను నడిపే వారిపై చర్యలను మరింత కఠినం చేసారు. ప్రస్తుతం ఉన్న జరిమానాను ఐదు రెట్లు పెంచుతూ రూ. 10,000 లుగా డ్రంక్ అండ్ డ్రైవ్‌కు ఫైన్ ఖరారు చేశారు. మద్యం మత్తులో ఎవరినైనా ఢీ కొంటె బెయిల్ రహిత పదేళ్ల జైలు శిక్షను తీసుకొచ్చారు. నూతన చట్టంలో ఉన్న మరిన్ని నేరాలకు సంభందించిన ఫైన్ల వివరాలు

1. యజమానులు యువతకు కార్లు ఇచ్చినట్లయితే వాటి రిజిస్ట్రేషన్ రద్దు చేయడం, ఇదే సందర్భంలో వారు ప్రమాదం చేస్తే ఆ కుటుంబం సుమారుగా రూ. 25,000 ల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మరియు మూడేళ్ల వరకు జైలు శిక్షపడే అవకాశం కూడా ఉంది.

2. నాణ్యత ప్రమాణాలను పాటించే హెల్మెట్ మాత్రమే వినియోగించాలనే అంశాలను సవరణ బిల్లులో పొందుపరిచారు.

3. శిరస్త్రాణం లేకుండా నడిపే వారికి సుమారుగా రూ. 1,000 ల వరకు జరిమానా విధిస్తూ, డ్రైవింగ్ లైసెన్స్ మూడు నెలల పాటు రద్దు చేయనున్నారు. సిగ్నల్ జంప్ అవ్వడం మరియు సీట్ బెల్ట్ లేకుండా డ్రైవ్ చేసినా కూడా ఈ చర్యలు తప్పవు.

4. ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేసేటపుడు పోలీసులకు పట్టుబడితే విధించే జరిమానాను రూ. 1,000 లు నుండి రూ. 5,000 లకు పెంచారు.

5. తప్పులేకుండా రహదారి ప్రమాదానికి గురైనపుడు మరణించే బాధితులకు రూ. 10 లక్షల వరకు మరియు తీవ్రంగా గాయపడిన వారికి రూ. 5 లక్షల వరకు పరహారం అందజేయనున్నారు. గతంలో ప్రమాదంలో గాయపడిన వారికి రూ. 25,000 లు మరియు మరిణించిన వారి తరపున రూ. 50,000 లు మాత్రమే పరిహారంగా చెల్లించేవారు.

6. హిట్ అండ్ రన్ (ఢీ కొట్టి పారిపోతే) ఎవరైనా ప్రమాదం చేసి పారిపోతే హిట్ అండ్ రన్ ప్రమాదం క్రింద మరణించిన వారికి రూ. 2 లక్షలు మరియు తీవ్రంగా గాయపడ్డవారికి రూ. 50,000 ల వరకు ప్రభుత్వం పరిహారం అందివ్వనుంది.

7. భీమాదారులు మరణిస్తే గరిష్ట పరిహారం రూ. 10 లక్షలు మరియు తీవ్రంగా గాయపడితే రూ. 5 లక్షలు పరిహారం చెల్లించాలనే మంత్రిత్వ శాఖ ప్రతిపాదనను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆమోదించింది.

అంతే కాకుండా వాహన రిజిస్ట్రేషన్ పనులను సంభందిత డీలర్‌కు అప్పగించాలని మరియు రిజిస్ట్రేషన్ ప్రదేశం ఆర్‌టిఓ కార్యాలయంలోనా ? లేదా విక్రయ దారుని వద్దే ఉండాలా ? అనే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకునేట్లు చట్టం తీసుకొచ్చారు.

నకిలీ రిజిస్ట్రేషన్ మరియు నకిలీ లైసెన్స్ సమస్యను రూపుమాపేందుకు జాతీయ రిజిస్ట్రేషషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా ఏకైక నమోదు సంఖ్యను జారీ చేయడానికి ఆస్కారం ఉంది.

వాహన తయారీదారులు ఉత్పత్తి చేసే వాహనాలలోని విడి భాగాలు మరియు ఇంజన్‌లు ప్రమాణాలకు తగ్గట్లుగా లేకపోతే కేంద్రం రీకాల్ చేయనుంది. ఇందుకు వాహన తయారీ సంస్థలు రూ. 500 కోట్ల వరకు ప్రభుత్వానికి జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Motor Vehicle Bill Amendments Approved By Cabinet, Motor vehicle bill amendments details in telugu
Please Wait while comments are loading...

Latest Photos