జూలైలో విడుదలకు సిద్దమవుతోన్న సెకండ్ జనరేషన్ బీట్ హ్యాచ్‌బ్యాక్

Written By:

షెవర్లే ఇండియా తమ రెండవ తరం బీట్ హ్యాచ్‌బ్యాక్ కారును ఇండియన్ మార్కెట్లోకి ఈ జూలైలో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఆటో కార్ ఇండియా ప్రకారం, ఈ బీట్‌ను ఇంటెల్లీ బీట్ పేరుతో అందుబాటులోకి తీసుకురానుంది.

అంతర్జాతీయ విపణిలో స్పార్క్ పేరుతో అందుబాటులో ఉన్న బీట్ హ్యాచ్‌బ్యాక్‌ను మునుపటి మోడల్ కన్నా సరికొత్త ప్రేరణతో అభివృద్ది చేస్తోంది. బీట్ ఇంటెల్లీ తరువాత బీట్ ఆక్టివ్ క్రాసోవర్ మరియు ఎసెన్షియా కాంపాక్ట్ సెడాన్ కార్లను వరుసగా విడుదల చేయనుంది.

షెవర్లే ఇండియాకు మంచి విక్రయాలు సాధించిపెడుతున్న వాటిలో బీట్ అతి ముఖ్యమైన మోడల్. మొదటి తరం బీట్ కన్నా ఇది మరింత మృదువైన ఆకృతిని కలిగి ఉంటుంది.

బీట్ సెకండ్ జనరేషన్‌లో విభిన్నమైన రియర్ డోర్ హ్యాండిల్ పిల్లర్ మీద అందివ్వడం జరిగింది. అచ్చం ఇలాంటి దానినే మహీంద్రా కెయువి100లో గమనించవచ్చు. అదే విధంగా అప్ కమింగ్ 2017 మారుతి సుజుకి స్విఫ్ట్‌లో కూడా ఇది రానుంది.

రియర్ డిజైన్‌లో ఉన్న నెంబర్ ప్లేట్ బంపర్ మీదకు మార్చడం జరిగింది. సరికొత్త షెవర్లే బీట్ పెద్ద పరిమాణంలో ఉన్న టెయిల్ లైట్లు ఉన్నాయి.

నిజానికి ఇది ఈ ఏడాది చివరి నాటికి విడుదల కావాల్సి ఉండగా, ఈ జూలైలోనే విడుదలకు సన్నాహాలు చేసుకుంటోంది. దీని విడుదల నేపథ్యంలో బీట్ ఎసెన్షియా విడుదల ఆలస్యం అవుతోంది.

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Read In Telugu To Know About New Chevrolet Beat India Launch Date Revealed
Please Wait while comments are loading...

Latest Photos