2017 హ్యుందాయ్ ఎలైట్ ఐ20 విడుదల:ధర, ఇంజన్, మైలేజ్, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

హ్యందాయ్ మోటార్స్ ఇండియా లైనప్‌లో మంచి సక్సెస్ సాధించిన ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ మోడల్ ఎలైట్ ఐ20 హ్యాచ్‌బ్యాక్ కారును 2017 మోడల్‌గా విపణిలోకి విడుదల చేసింది.

By Anil

దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ మోటార్స్ ఇండియా విభాగం దేశీయ మార్కెట్లోకి తమ వద్ద ఇది వరకే ఉన్న హ్యుందాయ్ ఎలైట్ ఐ20 వేరియంట్‌ను 2017 మోడల్‌గా మళ్లీ విడుదల చేసింది. దీని ధరల శ్రేణి రూ. 5.36 లక్షల నుండి 8.51 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది. అప్‌డేటెడ్ 2017 ఎలైట్ ఐ20 గురించి మరిన్ని వివరాలు...

2017 హ్యుందాయ్ ఎలైట్ ఐ20 విడుదల

హ్యుందాయ్ తమ అప్‌డేటెడ్ 2017 ఎలైట్ ఐ20 లో నూతన భద్రత ఫీచర్లు, స్టైలింగ్ పరమైన ఫీచర్ల జోడింపుతో ప్రీమియమ్ హ్యాచ్‌‌బ్యాక్ సెగ్మెంట్లో ఫస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లు అందివ్వడం జరిగింది.

2017 హ్యుందాయ్ ఎలైట్ ఐ20 విడుదల

2017 ఎలైట్ ఐ20 ను రెండు విభిన్నమైన డ్యూయల్ టోన్ బాడీ కలర్ ఆప్షన్‌లలో ఎంచుకోవచ్చు. అవి, రెడ్ ప్యాసన్ బాడీ కలర్ మరియు ఫాంటమ్ బ్లాక్ రూఫ్ అదే విధంగా పోలార్ వైట్ బాడీ కలర్ మరియు ఫాంటమ్ బ్లాక్ రూఫ్ తో లభించును.

2017 హ్యుందాయ్ ఎలైట్ ఐ20 విడుదల

మొట్టమొదటి సారిగా తమ ఎలైట్ ఐ20 ఇంటీరియర్‌లో డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్ కలదు. బ్లాక్ ఇంటీరియర్ మరియు అక్కడక్క ఆరేంజ్ కలర్ మెరుగులు కలవు. డ్యూయల్ టోన్ ఆప్షన్ వేరియంట్ ఆస్టా ట్రిమ్‌లో మాత్రమే లభించును.

2017 హ్యుందాయ్ ఎలైట్ ఐ20 విడుదల

ప్రస్తుతం ఉన్న మారుతి వారి ప్రీయమిమ్ హ్యాచ్‌బ్యాక్ బాలెనోను అత్యధికంగా విక్రయిస్తోంది ప్రీమియమ్ అర్బన్ బ్లూ షేడ్ కలదు. ఈ సెగ్మెంట్లో బాలెనోను ఎదుర్కునేందుకు మెరైన్ బ్లూ కలర్‌ను కూడా సరికొత్త ఐ20 లో పరిచయం చేయడం జరిగింది.

2017 హ్యుందాయ్ ఎలైట్ ఐ20 విడుదల

సరికొత్త 2017 ఎలైట్ ఐ20 కారులో అధునాతన 7-అంగుళాల పరిమాణం గల టచ్ స్క్రీన్ ఏవిఎన్ సిస్టమ్(ప్రస్తుతం ఐ20 ఆస్టాలో లభిస్తున్నది), ఈ సిస్టమ్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు మిర్రర్ లింక్ కనెక్టివిటి వంటి సపోర్ట్ చేస్తుంది.

2017 హ్యుందాయ్ ఎలైట్ ఐ20 విడుదల

హ్యుందాయ్ మోటార్స్ భద్రత దృష్ట్యా సరికొత్త ఎలైట్ ఐ20లో ఆరు ఎయిర్ బ్యాగులను అందించింది. అవి, డ్రైవర్, కో-ప్యాసింజర్, మరియు సైడ్ కర్టన్ ఎయిర్ బ్యాగులు.

2017 హ్యుందాయ్ ఎలైట్ ఐ20 విడుదల

ఇంజన్ విషయానికి వస్తే, హ్యుందాయ్ ఇంజన్ లైనప్‌లో ఉన్న 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల 1.2-లీటర్ కప్పా డ్యూయల్ విటివిటి పెట్రోల్ ఇంజన్, 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానిత 1.4-లీటర్ డ్యూయల్ విటివిటి పెట్రోల్ ఇంజన్ కలదు.

2017 హ్యుందాయ్ ఎలైట్ ఐ20 విడుదల

అదే విధంగా 1.4-లీటర్ సామర్థ్యం ఉన్న యు2 సిఆర్‌డిఐ డీజల్ ఇంజన్ కలదు. ఇందులో 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను హ్యుందాయ్ ఆఫర్ చేస్తోంది.

2017 హ్యుందాయ్ ఎలైట్ ఐ20 విడుదల

సరికొత్త 2017 ఎలైట్ ఐ20 విడుదల సందర్భంగా హ్యుందాయ్ మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు ముఖ్య కార్యనిర్వహణ అధికారి వైకె కూ మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా విజయవంతమైన ఎలైట్ ఐ20 ను విడుదల చేసిన 2014 నుండి ఇప్పటి వరకు సుమారుగా 3,00,000 యూనిట్లకు పైగా విక్రయించినట్లి తెలిపాడు.

2017 హ్యుందాయ్ ఎలైట్ ఐ20 విడుదల

డ్యూయల్ టోన్ ఇంటీరియర్ మరియు ఎక్టీరియర్, ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్లు, అదనపు భద్రత ఫీచర్ల జోడింపుతో మరింత కస్టమర్లను చేరుకుంటామని తెలిపాడు.

2017 హ్యుందాయ్ ఎలైట్ ఐ20 విడుదల

హ్యుందాయ్ మోటార్స్ దేశీయ విపణిలో ఒక్కో నెలకు సుమారుగా 9,000 నుండి 10,000 యూనిట్ల మధ్య విక్రయాలు చేపడుతోంది. హ్యుందాయ్ మోటార్స్‌కు రెండవ బెస్ట్ సెల్లింగ్ కారుగా ఎలైట్ ఐ20 రెండవ స్థానంలో నిలిచింది.

2017 హ్యుందాయ్ ఎలైట్ ఐ20 విడుదల

ప్రస్తుతం ఇండియన్ ప్రీమియమ్ సెగ్మెంట్లో అగ్రభాగంలో ఉన్న మారుతి సుజుకి బాలోనోతో ఎలైట్ ఐ20 పోటీపడుతోంది.

Most Read Articles

English summary
Read in Telugu to know about 2017 hyundai elite i20. 2017 hyundia elite i20 price, mileage, engine, features, specifications and more
Story first published: Friday, April 7, 2017, 11:24 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X