నెక్ట్స్ జనరేషన్ వెర్నాను విడుదలకు సిద్దం చేసిన హ్యుందాయ్

Written By:

హ్యుందాయ్ సరికొత్త నెక్ట్స్ జనరేషన్ వెర్నా సెడాన్ కారును వచ్చే ఆగష్టు 2017 లో విడుదల చేయడానికి సిద్దం చేసింది. సెడాన్ సెగ్మెంట్‌ను శాసిస్తున్న మారుతి సియాజ్, హోండా సిటి మరియు మూడవ బెస్ట్ సెల్లింగ్ సెడాన్ స్కోడా ర్యాపిడ్‌లకు గట్టి షాక్ ఇవ్వనుంది నెక్ట్స్ జనరేషన్ హ్యుందాయ్ వెర్నా.

పోటీదారులను ఎదుర్కునేందుకు డిజైన్ పరంగా అనేక మార్పులు ఇందులో చోటు చేసుకున్నాయి. తరువాత హ్యుందాయ్ ఎలంట్రా మరియు హ్యుందాయ్ వారి ఫ్ల్యూయిడిక్ 2.0 డిజైన్ లాంగ్వేజ్ లక్షణాలతో కొత్త వెర్నాను ఆవిష్కరించింది.

విడుదలను సూచిస్తూ, హ్యుందాయ్ ఈ నెక్ట్స్ జనరేషన్ వెర్నా సెడాన్ కారును ఇండియన్ రోడ్ల మీద రహస్యంగా పరీక్షించింది. ఎక్ట్సీరియర్ మీద తెలుపు మరియు నలుపు రంగు చారలున్న పేపర్‌తో కప్పివేయడం ద్వారా డిజైన్ ఫీచర్లను గుర్తించడం సాధ్యపడలేదు.

మునుపటి వెర్నా కన్నా సరికొత్త హ్యుందాయ్ వెర్నా వీల్ బేస్ 10ఎమ్ఎమ్, పొడవు 15ఎమ్ఎమ్ మరియు వెడల్పు 29ఎమ్ఎమ్ పెరిగింది. ప్రస్తుతం విపణిలో ఉన్న వెర్నా కన్నా నెక్ట్స్ జనరేషన్ వెర్నా మరింత విశాలంగా ఉంటుంది.

కొలతలతో పాటు బరువు కూడా 10కిలోల వరకు పెరిగింది. తేలికగా మరియు ధృడంగా ఉండేందుకు ఎక్కువ ధృడత్వం ఉన్న స్టీల్‌తో తయారు చేసిన కొత్త ఛాసిస్ ఇందులో అందివ్వడం ద్వారా బరువు పెరగడం జరిగింది. విపణిలో ఉన్న వెర్నాతో పోల్చుకుంటే నూతన వెర్నాలో సస్పెన్షన్ సిస్టమ్ కూడా మార్చడం జరిగింది.

2017 హ్యుందాయ్ వెర్నా 1.4-లీటర్ పెట్రోల్ మరియు 1.6-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్లలో 5 లేదా 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో వచ్చే అవకాశం ఉంది.

నూతన వెర్నా ఇంటీరియర్‌లో అనేక డిజైన్ మార్పులు చోటు చేసుకున్నాయి. మరింత ప్రీమియమ్ లుక్ సొంతం చేసుకుంది. వెర్నాలోని టాప్ ఎండ్ వేరియంట్ 7-స్పీడ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు.

భద్రత పరంగా నెక్ట్స్ జనరేషన్ హ్యుందాయ్ వెర్నాలో డ్యూయల్ ఎయిర్ బ్యాగులు, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు స్టాండర్డ్‌గా రానున్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ప్రస్తుత జనరేషన్‌కు అనుగుణంగా ఫీచర్లను తమ వెర్నాలో అందించే విషయంలో పట్టును కోల్పోతోంది హ్యుందాయ్. ఫీచర్ల పరంగా సిటి మరియు సియాజ్ కార్లు మంచి ఫలితాలను రాణిస్తున్నాయి. నూతన జనరేషన్ వెర్నా అన్ని అధునాత ఫీచర్లతో విడుదలైతే మళ్లీ విజయాన్ని అందుకోవడం గ్యారంటీ...

English summary
Read In Telugu Next-Generation Hyundai Verna India Launch Details Revealed
Please Wait while comments are loading...

Latest Photos