2017 స్విఫ్ట్ డిజైర్ విడుదలకు క్షణగణన: బుకింగ్స్ ప్రారంభం...

Written By:

సరికొత్త న్యూ జనరేషన్ స్విఫ్ట్ డిజైర్ కారును వచ్చే నెలలో దేశీయ మార్కెట్లోకి విడుదల చేయడానికి మారుతి సుజుకి సన్నద్దం అవుతోంది. ప్రస్తుతం ఉన్న స్విఫ్ట్ డిజైర్‌తో పోల్చుకుంటే ఈ కొత్త స్విఫ్ట్ డిజైర్‌లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.

ఎక్కువ ఫీచర్లను అందించే దాని మీద మారుతి దృష్టిసారించింది. ఆటోకార్ ఇండియా కథనం మేరకు, దేశ వ్యాప్తంగా ఉన్న కొన్ని మారుతి డీలర్లు రూ. 5,000 నుండి 10,000 లతో బుకింగ్స్ కూడా ప్రారంభించినట్లు తెలిసింది.

శరీర నిర్మాణం పరంగా ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. అయితే ముందు మరియు వెనుక డిజైన్‌లో మునుపటిలా కాకుండా ప్రదానమైన భాగాలలో గుర్తించదగిన మార్పులు ఉన్నాయి. ఫ్రంట్ గ్రిల్, టెయిల్ ల్యాంప్ డిజైన్ మరియు సి-పిల్లర్ నిర్మాణం ఇందులో ప్రధానం.

ఇందులో పగటి పూట వెలిగే లైట్లు, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఎల్ఇడి లైట్లు, రీ డిజైన్ ఫ్రంట్ బంపర్, క్రోమ్ పూతపూయబడిన ఫ్రంట్ గ్రిల్, వెనుక వైపున తోకలా చిన్న పరిమాణంలో ఉన్న యాంటెన్నా మరియు ఎల్ఇడి టెయిల్ లైట్లు ఉన్నాయి.

ఇంటీరియర్‌లో డ్యూయల్ టోన్ బ్లాక్ మరియు బీజి అప్‌హోల్‌స్ట్రే, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్లను సపోర్ట్ చేయగల సరికొత్త సుజుకి స్మార్ట్ ప్లే 7.0-అంగుళాల పరిమాణం ఉన్న ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు.

సాంకేతికంగా సరికొత్త 2017 మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్‌లో మునుపున్న అవే రెండు రకాల ఇంజన్ ఆప్షన్లు ఇందులో రానున్నాయి. అవి, 1.3-లీటర్ సామర్థ్యం ఉన్న డిడిఐఎస్ డీజల్ మరియు 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్ వేరియంట్లు.

ధర విషయానికి వస్తే, ప్రస్తుతం ఉన్న స్విఫ్ట్ డిజైర్ కన్నా న్యూ జనరేషన్ వేరియంట్ ధరలు కాస్త ఎక్కువగా ఉండనున్నాయి.

మారుతి సుజుకి ఈ న్యూ జనరేషన్ స్విఫ్ట్ డిజైర్‌ను విపణిలోకి విడుదల చేస్తే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న టాటా టిగోర్, హ్యుందాయ్ ఎక్సెంట్ కార్లకు గట్టి పోటీనివ్వనుంది.

తాజా ఆటోమొబైల్ వార్తలకు చూస్తూ ఉండండి డ్రైవ్‌స్పార్క్ తెలుగు. డ్రైవ్‌స్పార్క్ బృందం స్వయంగా స్విఫ్ట్ డిజైర్ విడుదలను కవరేజ్ చేయనుంది.

 

English summary
Read In Telugu To Know About 2017 New Maruti Dzire Bookings Open.
Please Wait while comments are loading...

Latest Photos