సరికొత్త మారుతి ఆల్టో 800 విడుదల తారీఖు వెల్లడి - క్విడ్‌ను వెనక్కి నెడుతుందా ?

Written By:

భారత దేశపు ఎంట్రీ లెవల్ కార్ల సెగ్మెంట్లో పోటీ అనేది ఎరుగకుండా కొన్ని సంవత్సరాల పాటు మారుతి సుజుకి తమ విభిన్నమైన ఉత్పత్తులతో అమ్మకాల్లో మొదటి స్థానంలో దూసుకుపోతూ వచ్చింది. అయితే దేశీయంగా ఉన్న అవకాశాలను దృష్టిలో ఉంచుకుని విదేశీ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థలు కొన్ని ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చాయి. అందులో ప్రధానంగా రెనో వారి క్విడ్ హ్యాచ్‌బ్యాక్. దీని విడుదలకు మారుతి ఆల్టో 800 అమ్మకాలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అయితే దీనిని ఎలాగైనా అధిగమించేందుకు నూతన ఆల్టో 800 ను విడుదలకు సిద్దం చేస్తోంది.

క్విడ్ కు పోటీగా మారుతి తమ నూతన ఆల్టో 800 ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌ను 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదికగా విడుదలకు సన్నాహాలు చేస్తోంది. ముందుగా ఈ వాహన ప్రదర్శన వేదిక మీద కాన్సెప్ట్ రూపంలో ప్రవేశపెట్టి అదే ఏడాదిలో అమ్మకాలు సిద్దం చేయనుంది.

ప్రస్తుతం ఉన్న రెనో క్విడ్ డిజైన్‌తో పోల్చుకుంటే మారుతి ఆల్టో 800 వయస్సు ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకోసం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సరికొత్త ఆల్టో 800 ను డిజైన్ చేయడం జరిగింది.

మారుతి తమ 2018 ఆల్టో 800 కారును కంపెనీ యొక్క నెక్ట్స్ జనరేషన్ ఫ్లాట్‌మీద అభివృద్ది చేయడం జరుగుతోంది. నిర్మాణ పరమైన అంశాల్లో ధృడత్వానికి అధిక ప్రాధాన్యతనిస్తూ, లైట్ వెయిట్‌గా ఉండేట్లు అభివృద్ది చేస్తున్నారు.

మారుతి సుజుకి యొక్క నెక్ట్స్ జనరేషన్ ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించిన బాలెనో ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ మరియు ఇగ్నిస్ క్రాసోవర్ కార్లు సాధించిన విజయం తెలిసిందే.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మారుతి ఈ ఆల్టో 800లో సరికొత్త డీజల్ వేరియంట్‌ను కూడా పరిచయం చేయనుంది. అయితే బిఎస్-VI ఉద్గార నియమాలను పాటించే విధంగా ఇంజన్‌ను అభివృద్ది చేసి 2020 నాటికి పరిచయం చేయనున్నట్లు సమాచారం.

ప్రస్తుతం మారుతి లైనప్‌లో ఉన్న సెలెరియో డీజల్ వేరియంట్లో ఉన్న రెండు సిలిండర్ల ఇంజన్‌నే దీని కోసం అభివృద్ది చేస్తున్నట్లు సమాచారం.

ఇంటీరియర్ ఫీచర్లకు మారుతి సుజుకి అధిక ప్రాధాన్యతనివ్వనుంది. ఈ కారణం చేతనే క్విడ్ విజయం సాధించిన విశయాన్ని ఇక్కడ మనం గుర్తుచేసుకోవచ్చు. క్విడ్‌కు పోటీగా వస్తున్నందున ఇందులో న్యావిగేషన్, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎయిర్ బ్యాగులు, వేగాన్ని హెచ్చరించే వ్యవస్థ వంటివి రానున్నాయి.

మారుతి స్విఫ్ట్ అప్‌డేటెడ్ వెర్షన్ 2017 స్విఫ్ట్ ను విడుదలకు సిద్దం చేస్తోంది. దీనికి సంభందించిన ఫోటోలు క్రింది గ్యాలరీలో....

 

English summary
New Maruti Alto 800 Launch Date Revealed — Will It Push Back The Kwid?
Please Wait while comments are loading...

Latest Photos