నెక్ట్స్ జనరేషన్ వ్యాగన్ ఆర్ మరియు స్టింగ్‌రే ఫోటోలు లీక్

సరికొత్త డిజైన్‌లో ఉన్న తరువాత తరం వ్యాగన్ ఆర్ మరియు వ్యాగన్ ఆర్ స్టింగ్‌రే ఫోటోలు అతి రహస్యంగా లీక్ అయ్యాయి. వీటి గరించి పూర్తి వివరాలు...

Written By:

మారుతి సుజుకి లైనప్‌లో బెస్ట్ బడ్జెట్ ప్యాసింజర్ కారుగా వ్యాగన్ ఆర్ అత్యుత్తమ విక్రయాలు సాధిస్తోంది. దీనికి కొనసాగింపుగా మారుతి స్టింగ్‌రే మోడల్‌ను కూడా ప్రవేశపెట్టింది.

అయితే ఆన్‌లైన్ మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ మరియు వ్యాగన్ ఆర్ స్టింగ్‌రే లకు చెందిన తరువాత డిజైనింగ్ ఫీచర్లను కూడిన ఫోటోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇవి జపాన్ ఆధారిత మోడళ్లా అనే సందేహం కూడా లేకపోలేదు.

ఈ ఫోటోలను పరిశీలించిన అనంతరం ఇవి జపాన్ ఆధారిత మోడళ్లే అని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. వీటిలో పరిచయం అయిన నూతన డిజైన్ ఫీచర్ల విషయానికి వస్తే ఫ్రంట్ గ్రిల్, హెడ్ ల్యాంప్స్, విభిన్నంగా డిజైన్ చేయబడిన బి-పిల్లర్, డోర్ మీద నిర్మించిన రియర్ వ్యూవ్ మిర్రర్లు మరియు తోరణం వంటి ఆకృతిలో ఉన్న వీల్ అర్చెస్ కలవు.

వెనుక వైపు డిజైన్ విషయానికి వస్తే పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదనే విషయం స్పష్టమవుతుంది. ఎలాంటి హంగులు లేకుండా విశాలంగా ఉంది. మరియు టెయిల్ లైట్లను బాడీకి క్రింది భాగంలో రియర్ బంపర్‌కు కొద్దిగా పై స్థానంలో అందివ్వడం గుర్తించవచ్చు.

స్టింగ్‌రే విషయానికి వస్తే వ్యాగన్ ఆర్ కన్నా కాస్త భిన్నంగా ఉంది. వ్యాగన్ ఆర్ కన్నా పెద్ద ఫ్రంట్ గ్రిల్ కలిగి ఉంది. సింగల్ పీస్ హెడ్ లైట్ అని తెలపడానికి ఒక లైటు మీద మరొకటి ఉండేట్లు హెడ్ ల్యాంప్ డిజైన్ గుర్తించవచ్చు.

ఇప్పటి వరకు ఎక్ట్సీరియర్ డిజైన్ ఫోటోలు మినహాయించి, దీనికి సంభందించిన ఇంటీరియర్ లేదా ఇంజన్ వివరాలు ఇప్పటి వరకు వెల్లడి కాలేదు.

జపనీస్ మార్కెట్లోని వ్యాగన్ ఆర్ సిరీస్‌లో అత్యధిక పాపులారిటీని దక్కించుకున్న 660సీసీ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్‌ ఈ న్యూ జనరేషన్ వ్యాగన్‌ ఆర్ లలో వచ్చే అవకాశం ఉంది.

అయితే ఈ న్యూ జనరేషన్ వ్యాగన్ ఆర్ వేరియంట్లు దేశీయ విడుదలకు సిద్దమైతే ప్రస్తుతం ఉన్న మోడళ్ల కన్నా డిజైన్ పరంగా చాలా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. సాంకేతికంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న 1.0-లీటర్ ఇంజన్‌ను అందిచవచ్చు.

మన తెలుగు భాషలో తక్షణం ఆటోమొబైల్ వార్తల కోసం చూస్తూ ఉండండి... తెలుగు డ్రైవ్‌స్పార్క్(telugu.drivespark.com).
/

అడ్డంగా దొరికిపోయింది, ఇదిగో సాక్ష్యం
టాటా మోటార్స్ తమ నెక్సాన్ ఎస్‌యువిని మరో మారు రహస్యంగా పరీక్షించింది. ఈ ఏడాదిలో ఆలస్యంగా విడుదల కానున్న నెక్సాన్ ప్రొడక్షన్ రెడీ మోడల్ ఇప్పుడు ఇండియన్ రోడ్ల మీద అనేక అంశాల పరంగా పరీక్షించబడుతోంది.

ఎట్టకేలకు రష్యాతో ఫలించిన చైనా జిమ్మిక్కులు
గత ఏడాది చైనా ఏవియేషన్ ప్రదర్శన వేదిక మీద తమ శక్తివంతమైన జె 20 పైటర్ జెట్ ను ప్రదర్శించింది. అయితే రష్యా అత్యంత శక్తివంతమైన తమ ఐదవ తరానికి చెందిన ఎస్‌యు-35 ఫైటర్ జెట్‌లను చైనాకు డెలివరీ ఇచ్చింది.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Next Gen Maruti Suzuki WagonR And WagonR Stingray Images Leaked
Please Wait while comments are loading...

Latest Photos