2017 పోలో ఆవిష్కరించిన వోక్స్‌వ్యాగన్

జర్మన్‌కు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం ఆరవ తరానికి చెందిన 2017 సరికొత్త పోలో హ్యాచ్‌బ్యాక్ కారును బెర్లిన్‌లో ఆవిష్కరించింది.

By Anil

జర్మన్‌కు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం ఆరవ తరానికి చెందిన 2017 సరికొత్త పోలో హ్యాచ్‌బ్యాక్ కారును బెర్లిన్‌లో ఆవిష్కరించింది. ప్రస్తుతం ప్రపంచ విపణిలో ఉన్న ఐదవ తరం పోలోతో పోల్చుకుంటే నూతన పోలో హ్యాచ్‌బ్యాక్‌లో అత్యాధునిక టెక్నాలజీ మరియు ఫీచర్లున్నాయి.

2017 వోక్స్‌వ్యాగన్ పోలో

ఎక్ట్సీరియర్ డిజైన్ మార్పులతో మరియు నూనత ఇంటీరియర్ ఫీచర్లతో రానున్న 2017 వోక్స్‌వ్యాగన్ పోలో హ్యాచ్‌బ్యాక్ 2017 ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షో వేదిక మీద సందర్శకుల ప్రదర్శనకు రానుంది.

2017 వోక్స్‌వ్యాగన్ పోలో

సరికొత్త పోలో నాలుగు పెట్రోల్ మరియు ఒక డీజల్ ఇంజన్ వేరియంట్లో లభించనుంది. ఇందులోని 1.6-లీటర్ డీజల్ ఇంజన్ 80 మరియు 95 బిహెచ్‌పి రెండు రకాలుగా పవర్ ఉత్పత్తి చేస్తుంది.

2017 వోక్స్‌వ్యాగన్ పోలో

వోక్స్‌వ్యాగన్ వద్ద ఉన్న బేస్ పెట్రోల్ వేరియంట్ 1.0-లీటర్ మూడు సిలిండర్ల ఇంజన్ 64 లేదా 74 బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది. వోక్స్‌వ్యాగన్ అభివృద్ది చేసిన 1.0-లీటర్ టుర్బో ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ 95 లేదా 114బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగలదు.

2017 వోక్స్‌వ్యాగన్ పోలో

మూడవ ఇంజన్ వేరియంట్ 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న టుర్బో ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ 148బిహెచ్‌పి పవర్ చేస్తుంది. ఇంధన ఆదా చేసుకునేందుకు ఇంజన్‌లోని ఓ సిలిండర్‌‌ను ఆపేయవచ్చు.

2017 వోక్స్‌వ్యాగన్ పోలో

ఎంచుకునే ఇంజన్ ఆప్షన్ ఆధారంగా 5-స్పీడ్ మ్యాన్యువల్, 6-స్పీడ్ మ్యాన్యువల్ అదే విధంగా 7-స్పీడ్ డైరెక్ట్ షిఫ్ట్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ ఆప్షన్‌లను ఎంచుకోవచ్చు.

2017 వోక్స్‌వ్యాగన్ పోలో

వోక్స్‌వ్యాగన్ పోలో హ్యాచ్‌బ్యాక్ లోని శక్తివంతమైన వెర్షన్ జిటిఐ. సరికొత్త పోలో జిటిఐ 2.0-లీటర్ సామర్థ్యం ఉన్న టుర్బో ఛార్జ్‌డ్ ఇంజన్ 7-స్పీడ్ డిఎస్‌జి ట్రాన్స్‌మిషన్ అనుసంధానం కలదు. ఇది గరిష్టంగా 196బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది మునుపటి మోడల్ కన్నా 8బిహెచ్‌పి ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది.

2017 వోక్స్‌వ్యాగన్ పోలో

వోక్స్‌‌వ్యాగన్ చిన్న కార్ల అభివృద్ది కోసం ఉపయోగిస్తున్న ఎమ్‌క్యూబి ఎఒ ఫ్లాట్‌ఫామ్ ఉపయోగిస్తోంది. 2017 పోలో పొడవు 4,053ఎమ్ఎమ్, వెడల్పు 1,751ఎమ్ఎమ్, ఎత్తు 1,446ఎమ్ఎమ్ కొలతల్లో ఉంది. మునుపటి పోలో కన్నా 81ఎమ్ఎమ్ పొడవైనది, 63ఎమ్ఎమ్ వరకు వెడల్పుగా ఉంది, అయితే ఎత్తు 7ఎమ్ఎమ్ వరకు తక్కువగా ఉంది. వీల్ బేస్ 2564ఎమ్ఎమ్‌గా ఉంది.

2017 వోక్స్‌వ్యాగన్ పోలో

డిజైన్ విషయానికి వస్తే, ముందు వైపున కండలు తిరిగిన డిజైన్ లక్షణాలున్నాయి. ఆంగ్లపు సి-ఆకారంలో ఉన్న పగటి పూట వెలిగే లైట్లు, స్పోర్టివ్ ఎయిర్ ఇంటేకర్, రియర్ డిఫ్యూసర్, రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్ కలదు. విభిన్న పోలో జిటి స్పోర్ట్స్ బంపర్, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ మరియు ఎల్ఇడి టెయిల్ ల్యాంప్స్ ఉన్న టెయిల్ గేట్ కలదు.

2017 వోక్స్‌వ్యాగన్ పోలో

ఇంటీరియర్ విషయానికి వస్తే, వీల్ బేస్ పెరగడంతో క్యాబిన్ స్పేస్ మరింత పెరిగింది. తద్వారా ఇంటీరియర్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. 6.5 నుండి 8 అంగుళాల పరిమాణంలో ఉన్న ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ గల డ్యాష్‌బోర్డ్ మరియు నూతన స్టీరింగ్ వీల్ కలదు.

2017 వోక్స్‌వ్యాగన్ పోలో

2017 వోక్స్‌వ్యాగన్ పోలో లోని టాప్ ఎండ్ మోడల్‌ను 11 రంగుల్లో ఉన్న అప్‌హోల్‌స్ట్రే(టాపు లోపలి భాగం) మరియు 13 రంగుల్లో ఉన్న డ్యాష్ బోర్డ్. అంతే కాకుండా వోక్స్‌వ్యాగన్ ఆక్టివ్ డిస్ల్పే అందిస్తున్నట్లు సమాచారం.

2017 వోక్స్‌వ్యాగన్ పోలో

ప్రొడక్షన్ దశకు చేరుకున్న సరికొత్త పోలో హ్యాచ్‌బ్యాక్ ఈ ఏడాది చివరి నాటికి ఇండియన్ మార్కెట్లోకి పూర్తి స్థాయి విక్రయాలకు విడుదల కానుంది. అయితే వచ్చే ఏడాది ప్రారంభం నుండి వీటి డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఆటోమోటివ్ ప్రపంచంలో వోక్స్‌వ్యాగన్ వద్ద అధునాకన సాంకేతిక పరిజ్ఞానం ఉంది. అయితే వోక్స్‌‌వ్యాగన్ టాటా మోటార్స్‌తో ఉమ్మడి భాగస్వామ్యపు ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. కాబట్టి టాటా వారి ఏఎమ్‌పి ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా కూడా పోలో వచ్చే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Read In Telugu All-New 2017 Volkswagen Polo Revealed
Story first published: Saturday, June 17, 2017, 18:15 [IST]
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X