నెక్ట్స్ జనరేషన్ థార్‌ను సిద్దం చేస్తున్న మహీంద్రా

Written By:

దేశీయ దిగ్గజ ఎస్‌యూవీ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా నెక్ట్స్ జనరేషన్ థార్‌ను విడుదలకు సిద్దం చేస్తోంది. నూతన ఇంజన్ ఆప్షన్‌లతో పాటు కొన్ని ఫీచర్లను జోడించనుంది. సంస్థ నెక్ట్స్ జనరేషన్ థార్ మీద పనిచేస్తున్నట్లు మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా ప్రకటించాడు.

మహీంద్రా తొలిసారి 2010 లో ఆఫ్ రోడ్ ఔత్సాహికుల కోసం థార్ ఎస్‌యూవీని విడుదల చేసింది. తరువాత 2015 లో మైల్డ్ మిడ్ లైఫ్ ఫేస్‌లిఫ్ట్‌గా నూతన ఇంటీరియర్ మరియు మెకానికల్ లాకింగ్ రియర్ డిఫరెన్షియల్ ఫీచర్‌తో విడుదల చేసింది.

మహీంద్రా మునుపటి థార్ డిజైన్‌ను కొనసాగిస్తూనే, అంతర్జాతీయ కస్టమర్లను ఆకట్టుకునేందుకు పినిన్ఫారినా మరియు శాంగ్‌యాంగ్ సంస్థలతో నెక్ట్స్ జనరేషన్ థార్‌ను అభివృద్ది చేసే అవకాశం ఉన్నట్లు గోయెంకా వెల్లడించాడు.

మహీంద్రా అభివృద్ది చేసే ప్రతి నూతన ఉత్పత్తి కూడా శాంగ్‌యాంగ్, పినిన్ఫారినా మరియు మహీంద్రా మూడు డిజైన్ బృందాలు పొల్గొంటాయి.

మహీంద్రా నెక్ట్స్ జనరేషన్ థార్‌లో 2498సీసీ సామర్థ్యం గల టుర్బో చార్జ్‌డ్ సిఆర్‌డిఇ డీజల్ ఇంజన్‌తో రానుంది. ఇది గరిష్టంగా 105బిహెచ్‌పి పవర్ మరియు 247ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. ఇండియన్ మార్కెట్ కోసం రానున్న వేరియంట్లో 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో రానుంది.

మహీంద్రా నెక్ట్స్ జనరేషన్ థార్‌లో 2498సీసీ సామర్థ్యం గల టుర్బో చార్జ్‌డ్ సిఆర్‌డిఇ డీజల్ ఇంజన్‌తో రానుంది. ఇది గరిష్టంగా 105బిహెచ్‌పి పవర్ మరియు 247ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. ఇండియన్ మార్కెట్ కోసం రానున్న వేరియంట్లో 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో రానుంది.

ఫీచర్ల పరంగా, ఈ నెక్ట్స్ జనరేషన్ థార్‌లో వైర్ లెస్ మొబైల్ ఛార్జింగ్, మెమొరీ సీట్లు, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే కనెక్టివిటీ వంటి ఫీచర్లతో రానుంది. అంతే కాకుండా ఇంటెలిజెంట్ మరియు అసిస్టెడ్ డ్రైవింగ్ ఫీచర్లతో రానుంది.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Friday, March 3, 2017, 9:00 [IST]
English summary
Next Generation Mahindra Thar Confirmed — Here’s More Details
Please Wait while comments are loading...

Latest Photos