లీటర్ పెట్రోల్ మీద రూ. 1.39 లు మరియు లీటర్ డీజల్ ధర రూ. 1.04 ల వరకు పెరిగిన ధరలు

Written By:

తాజాగా పెట్రోల్ మరియు ఇంధన ధరలు పెరిగాయి. చివరి ఇంధన ధరల సవరణ అనంతరం పెట్రో భారీగా తగ్గిన అనంతరం మళ్లీ పెంపు బాట పట్టి పెట్రోల్ మరియు డీజల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ రూ. 1.39 లు మరియు డీజల్ మీద రూ. 1.04 లు వరకు పెరిగింది.

శనివారం రాత్రి ప్రభుత్వ చమురు రంగ సంస్థలు నిర్వహించిన సమావేశంలో పెట్రోల్ మీద రూ. 1.39 లు మరియు లీటర్ డీజల్ ధర రూ. 1.04 ల పెంపును ప్రకటించాయి. పెరిగిన ధరలు శనివారం అర్థ రాత్రి నుండి అమల్లోకి వచ్చాయి.

దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలోని ప్రభుత్వాలు విధించే పన్నుతో కలుపుకుంటే ఇంధన ధరల్లో పెంపు ఇంకా ఉండే అవకాశం ఉంది.

ధరల పెంపు అనంతరం ఢిల్లీ మరియు కేంద్ర రాజధాని ప్రాంత పరిధిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 66.29 లు మరియు లీటర్ డీజల్ ధర రూ. 55.61 లుగా ఉంది.

అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరల్లో వ్యత్యాసం మరియు డీజల్, పెట్రోల్ కొనుగోళ్ల ద్వారా జరిగే డాలరుతో రుపాయి మారకం విలువ తగ్గడంతో ఇంధన ధరలను తప్పనిసరిగా పెంచాలని నిర్ణయం తీసుకుని పెంపు చేపట్టినట్లు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ పేర్కొంది.

మే నుండి రోజూ వారీగా ధరల సవరణను ఉదయ్ పూర్, జంషెడ్‌పూర్, పాండిచ్చేరి, చంఢీఘర్ మరియు వైజాగ్ వంటి నగరాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా చేపట్టనున్నట్లు ఇండియన్ అయిర్ కార్పోరేషన్ ఇప్పటికే ప్రకటించింది.

సుమారుగా రెండున్నర నెలల నుండి పెరుగుతూ వచ్చిన ఇంధన ధరలు చివరిసారిగా జరిగిన ఏప్రిల్ సవరణల్లో పెట్రోల్ మీద రూ. 3.77 లు మరియు డీజల్ మీద రూ. 2.91 ల వరకు ధరలు తగ్గించబడ్డాయి.

English summary
Read In Telugu About petrol Price Hike By Rs 1.39 Diesel By Rs 1.04 Per Litre.
Please Wait while comments are loading...

Latest Photos