పెట్రోల్‌పై రూ. 3.77 లు మరియు డీజల్ పై రూ. 2.91 లు తగ్గిన ధరలు

Written By:

లీటర్ పెట్రల్ మీద రూ.3.77 లు మరియు లీటర్ డీజల్ మీద రూ. 2.91 లు మేర తగ్గింపు జరిగింది. రెండున్నర నెలల తరువాత జరిగిన సవరణతో ఇంధన ధరలు భారీగా దిగివచ్చాయి.

దేశీయ చమురు సంస్థలు తీసుకున్న నిర్ణయం మేరకు శనివారం అర్థరాత్రి నుండి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 71.14 లు మరియు లీటర్ డీజల్ ధర రూ. 59.02 లుగా ఉన్నాయి.

రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నుల్లో కూడా తగ్గుదల ఉంటే, ఆయా రాష్ట్రాల వారీగా ఇంధన ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది.

అంతర్జతీయ విపణిలో చమురు ధరల సవరణ మేరకు ఇప్పుడు పెట్రో మరియు డీజల్ ధరలు తగ్గించడానికి వీలయ్యిందని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ఓ ప్రకటనలో పేర్కొంది.

దేశీయంగా ఇంధన ధరల సవరణ చివరగా జరిగింది జనవరి 16 న, ఆ సమయంలో పెట్రోల్ మీద 54 పైసలు పెంచగా, డీజల్ మీద రూ. 1.20 లు పెరిగాయి.

 

Story first published: Saturday, April 1, 2017, 10:31 [IST]
English summary
Petrol Prices Drop By Rs 3.77 Paise Diesel By 2.91 paise
Please Wait while comments are loading...

Latest Photos