పినిన్ఫారినా నుండి హైబ్రిడ్ లగ్జరీ సెడాన్

Written By:

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ పినిన్ఫారినా తమ హెచ్600 అనే హైబ్రిడ్ లగ్జరీ సెడాన్ కారుకు చెందిన కొన్ని ఫోటోలతో పాటు ఇతర వివరాలను మీడియా ప్రతినిధులతో పంచుకుంది. నిజానికి అత్యంత ఆసక్తికరమైన ఈ మోడల్‌ను 2017 జెనీవా మోటార్ షో వేదిక మీద ప్రదర్శనకు సిద్దం చేస్తోంది. హాంగ్-కాంగ్ ఆధారిత కైనటిక్ గ్రూప్ పక్షాన దీని వివరాలను వెల్లడించింది - మరిన్ని వివరాలు నేటి కథనంలో తెలుసుకుందాం రండి.

పినిన్ఫారినా గతంలో హెచ్600 లగ్జరీ హైబ్రిడ్ సెడాన్‍‌కు సంభందించిన రియర్ ప్రొఫైల్ ను వివరించే ఫోటోను విడుదల చేసింది. అయితే ఇప్పుడు ఫ్రంట్ మరియు ఇంటీరియర్ ప్రొఫైల్‌కు చెందిన మరో రెండు ఫోటోలను అధికారికంగా పత్రికా పాత్రికేయుల కోసం విడుదల చేసింది.

నూతన ఫోటోలను పరిశీలిస్తే, హెచ్600 ఫ్రంట్ ప్రొఫైల్ మెర్సిడెస్ బెంజ్ యొక్క ఇక్యూ కాన్సెప్ట్‌ను మరియు మసేరాటి లెవంటే లను పోలి ఉంటుంది. భవిష్యత్ డిజైన్ లక్షణాలను మెండుగా కలిగి ఉండటానికి ఈ ఫోటో ద్వారా గ్రహించవచ్చు.

పాక్షికంగా తీసిన మరో ఫోటో ఇంటీరియర్ వ్యూవ్. ఇందులో పెద్ద పరిమాణంలో ఉన్న రెండు స్క్రీన్‌లను గుర్తించవచ్చు. వీటిలో ఒకటి ఇంస్ట్రుమెంట్ ప్యానల్ అయితే మరొక ఇన్పోటైన్‌మెంట్ కోసం గల సెంటర్ కన్సోల్.

పినిన్ఫారినా సంస్థ ఈ హెచ్600 లగ్జరీ సెడాన్‌కు సంభందించి మరే విధమైన వివరాలను వెల్లడించలేదు. వచ్చే జెనీవా మోటార్ షో వేదిక మీద హెచ్600 తో పాటు ఎఫ్600 మరియు ఫార్ములా1 ఛాంపియన్‌షిప్ ఫిట్టిపాల్డి భాగస్వామ్యంతో నిర్మించిన ఫిట్టిపాల్డి ఇఎఫ్7 విజన్ గ్రాన్ టురిస్మొ కారును కూడా ప్రదర్శనకు సిద్దం చేస్తోంది.

ఇప్పుడు హైబ్రిడ్ కార్లకు విలువ పెద్దగా ఇవ్వకపోయినా.... భవిష్యత్ మొత్తం హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ కార్లదే. దీనిని ముందుగానే గ్రహించిన టయోటా ప్రియస్ హైబ్రిడ్ కారును దేశీయ విపణిలోకి విడుదల చేసింది. దీని ఫోటోలను వీక్షించడానికి క్రింది గ్యాలరీ మీద ఓ లుక్కేసుకోండి...

 

Story first published: Tuesday, February 28, 2017, 9:00 [IST]
English summary
Pininfarina Designed Hybrid Luxury Sedan Teased For Geneva
Please Wait while comments are loading...

Latest Photos