టాటా మోటార్స్ నెక్ట్స్ ప్రొడక్ట్ ఇదే!

టాటా మోటార్స్ తరువాత విడుదల చేయనున్న వెహికల్ నెక్సాన్ కాంపాక్ట్ క్రాసోవర్ ఎస్‌యూవీని ప్రొడక్షన్ దశలో పరీక్షించింది. మరికొన్ని రానున్న నెలల్లో విడుదల కానున్న దీని గురించి మరిన్ని వివరాలు...

Written By:

ప్రొడక్షన్ దశకు చేరుకున్న నెక్సాన్ ఎస్‌యూవీని ఎలాంటి ముసుగులు లేకుండా దేశీయ రహదారుల మీద టాటా మోటార్స్ పరీక్షించింది. టియాగో, హెక్సా, టిగోర్ ల తరువాత వరుసగా విడుదలకు సిద్దమైన నాలుగవ మోడల్ నెక్సాన్ ఎస్‌యూవీని మరిన్ని కొన్ని నెలల్లోపు మార్కెట్లోకి విడుదల చేయనుంది టాటా.

రహదారి మీద ప్రొడక్షన్ రెడీ మోడల్ నెక్సాన్‌ను పరీక్షిస్తున్న సమయంలో ఓ ఆటోమొబైల్ సైట్ కొన్ని ఫోటోలను సేకరిచింది. ఆ ఫోటో ప్రకారం ఇది టాప్ ఎండ్ వేరియంట్‌ అని తెలుస్తోంది. ఇందులో అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించిన కాన్సెప్ట్ మోడల్‌తో పోల్చుకుంటే ఈ ప్రొడక్షన్ రెడీ మోడల్‌లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.

టాటా నెక్సాన్ ఎస్‌యూవీలో ముందు వైపున టాటా లోగో గల స్మైలింగ్ ఫ్రంట్ గ్రిల్‌ను కలగి ఉంది. మరియు ఇది ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్‌తో కూడా రానుంది.

ప్రస్తుతం ఇంటర్నెట్లో ఆవిష్కృతమైన ఫోటోలు ఎస్‌యూవీ యొక్క రియర్ ప్రొఫైల్ స్పష్టంగా రిలీవ్ చేశాయి. ఇందులో కండలు తిరిగిన వీల్ ఆర్చెస్, బాడీ క్లాడింగ్, అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్ మీద ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి.

ముందువైపున వీల్ ఆర్చెస్ నుండి మొదలయ్యే క్యారెక్టర్ లైన్స్ డోర్ హ్యాండిల్స్ మీద గుండా వెనుక వైపు ఉన్న టెయిల్ ల్యాంప్స్ వరకు పొడగించబడి ఉన్నాయి.

రియర్ ప్రొఫైల్ నందు క్లియర్ లెన్స్ గల టెయిల్ లైట్లు, రూఫ్ మౌంటెడ్ బ్లాక్ స్పాయిలర్ మరియు నెంబర్ ప్లేట్‌కు చుట్టూ నలుపు రంగు కలదు. అంతే కాకుండా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో రూఫ్ రెయిల్స్, ప్లాస్టిక్ క్లాడింగ్ మరియు డోర్ ప్యాడ్స్ ఉన్నాయి.

సాంకేతికంగా నెక్సాన్ ఎస్‌యూవీలో 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ మరియు 1.3-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ వచ్చే అవకాశం ఉంది. రెండు ఇంజన్‌లు కూడా మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో రానున్నాయి.

టాటా మోటార్స్ స్థిరంగా ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీతో వరుసగా విడుదల చేస్తూ వచ్చిన నాలుగవ మోడల్ నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ. విడుదల చేసిన కొంత కాలానికి నెక్సాన్ టాప్ ఎండ్ వేరియంట్లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ పరిచయం చేసే అవకాశం ఉంది.

టాటా దీనిని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తే, ప్రస్తుతం విపణిలో ఉన్న మారుతి సుజుకి బ్రిజా, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మరియు మహీంద్రా టియువి300 వంటి వాటికి గట్టిపోటీనివ్వనుంది.

 

WHAT OTHERS ARE READING

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Read In Telugu to know about Production Ready Tata Nexon Spied. Get more details about tata nexon launch, engine, features, specifications and more.
Please Wait while comments are loading...

Latest Photos