Just In
- 2 min ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 58 min ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 1 hr ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 2 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- News పిఠాపురంకు చిరంజీవి, మెగా హీరోలు - ముహూర్తం ఫిక్స్..!!
- Movies అడ్డంగా బుక్ అయిన నాగచైతన్య, శోభితా ధూళిపాళ.. ఆ దేశంలో హాలీడే ట్రిప్.. పట్టేసిన నెటిజెన్లు!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్రొడక్షన్ దశకు చేరుకున్న టిగువాన్‌ను టెస్ట్ చేసిన వోక్స్వ్యాగన్
పూర్తి స్థాయిలో ప్రొడక్షన్ దశకు చేరుకున్న వోక్స్వ్యాగన్ టిగువాన్‌కు ఇండియన్ రోడ్ల మీద చివరి దశ పరీక్షలను నిర్వహించారు. ఈ తరుణంలో విడుదలకు సిద్దమైన టిగువాన్ మీడియా కంటపడింది.
జర్మనీకి
చెందిన
దిగ్గజ
ప్యాసింజర్
కార్ల
తయారీ
దిగ్గజం
వోక్స్వ్యాగన్
వ్యాగన్
ఇండియన్
ఎస్యూవీ
బరిలోకి
దిగడానికి
సర్వం
సిద్దం
చేసుకుంది.
ఇండియన్
ఎస్యూవీ
సెగ్మెంట్లోకి
వోక్స్వ్యాగన్
తరపున
రానున్న
టిగువాన్
ఎస్యూవీ
పూర్తి
స్థాయిలో
పరీక్షలను
పూర్తి
చేసుకుని
ప్రొడక్షన్
దశకు
చేరుకుంది.
మహారాష్ట్రలోని స్కోడా ప్రొడక్షన్ ప్లాంటుకు సమీపంలో వోక్స్వ్యాగన్ తమ శక్తివంతమైన టిగువాన్‌కు రహదారి పరీక్షలు నిర్వహిస్తుండగా మీడియా కెమెరా కంటికి చిక్కింది.
ప్రొడక్షన్ రెడీ మోడల్ టిగువాన్ గురించి మరిన్ని ఎక్ట్సీరియర్, ఇంటీరియర్ మరియు సాంకేతిక వివరాలు కోసం క్రింది స్లైడర్లను గమనిద్దాం రండి...
వోక్స్వ్యాగన్ గ్రూపునకు చెందిన ఎమ్‌క్యూబి ప్లాట్ ఫామ్ ఆధారంగా టిగువాన్ ఎస్‌యూవీని అభివృద్ది చేసింది. మునుపటి టిగువాన్ మోడల్‌తో పోల్చితే ఇండియన్ మార్కెట్ కోసం అభివృద్ది చేసిన మోడల్ బరువును 50కిలోల వరకు తగ్గించినట్లు తెలిసింది.
ఫ్రంట్ డిజైన్‌లో వెడల్పాటి ఫ్రంట్ గ్రిల్ కలదు. ఫ్రంట్ గ్రిల్‌లోని క్రోమ్ స్లాట్లు ఇరువైపులా ఉన్న హెడ్ ల్యాంప్స్ వరకు విస్తరించి ఉన్నాయి. హెడ్ ల్యాంప్ అసెంబుల్లో పగటి పూట వెలిగే లైట్ల జోడంపు కలదు.
టిగువాన్ ఎస్‌యూవీలో రెండు వేరియంట్లు ఉన్నాయి. అందులో ఒక వేరియంట్లోని ఫ్రంట్ డిజైన్‌లో క్రోమ్ సొబగులు ఉండగా మరో వేరియంట్లో లేకపోవడాన్ని గమనించడం జరిగింది. వీటికి కంఫర్ట్ లైన్ మరియు హైలైన్ అనే పేర్లు కూడా ఉన్నాయి.
టిగువాన్ ఐదు మంది కూర్చునే సీటింగ్ సామర్థ్యంతో వస్తోంది. ఇందులో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఫ్లాట్‌బాటమ్ స్టీరింగ్ వీల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు ఇంటీరియర్‌లో పియానో బ్లాక్ తొడుగులు ఉన్నాయి.
దేశీయంగా రానున్న వోక్స్వ్యాగన్ టిగువాన్ ఎస్‌యూవీలో 2.0-లీటర్ సామర్థ్యం ఉన్న నాలుగు సిలిండర్ల టిడిఐ డీజల్ అందిస్తున్నట్లు సమాచారం. ఇది గరిష్టంగా 147బిహెచ్పి పవర్ ఉత్పత్తి చేస్తుంది.
ఇందులోని శక్తివంతమైన డీజల్ ఇంజన్‌కు 7-స్పీడ్ డైరక్ట్ షిఫ్ట్ గేర్‌బాక్స్ అందివ్వడం జరిగింది.
వోక్స్వ్యాగన్ టిగువాన్ పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదలయితే, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ టక్సన్ మరియు హోండా సిఆర్-వి లకు గట్టి పోటీనివ్వనుంది.