రేంజ్ రోవర్ వెలార్ ఎస్‌యూవీ విడుదల వివరాలు

రేంజ్ రోవర్ ఫ్యామిలీలోకి తమ నాలుగవ ఉత్పత్తిగా వెలార్ ఎస్‌యూవీని నవంబర్ 2017 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి రేంజ్ రోవర్ సిద్దమైంది. వెలార్ ఎస్‌యూవీకి చెందిన మరిన్ని వివరాలు.

By Anil

రేంజ్ రోవర్ అంతర్జాతీయ విపణిలో ఇది వరకే ఆవిష్కరించిన వెలార్ ఎస్‌యూవీ, ప్రస్తుతం దేశీయ విపణిలో ఉన్న రేంజ్ రోవర్ ఎవోక్ మరియు స్పోర్ట్ మోడళ్ల మధ్య స్థానాన్ని భర్తీ చేయనుంది. అన్ని భూ భాగాలలో అత్యుత్తమ పనితీరును ప్రదర్శించే లక్షణాలు, సరికొత్త లగ్జరీ హంగులు మరియు నూతన డిజైన్ అంశాల జోడింపుతో వచ్చే అవకాశం ఉంది.

రేంజ్ రోవర్ వెలార్ ఎస్‌యూవీ విడుదల వివరాలు

డిజైన్ మరియు రూపకల్పన పరంగా జాగ్వార్ ఎఫ్-పేస్ నిర్మాణంలో ఉపయోగించిన టెక్నాలజీ ఆధారంగా రేంజ్ రోవర్ ఈ వెలార్ ఎస్‌యూవీని అభివృద్ది చేసింది. అయితే ఎఫ్-పేస్ తరహాలో కాకుండా ఆఫ్ రోడింగ్ లక్షణాలతో ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌ కలిగి ఉంది.

రేంజ్ రోవర్ వెలార్ ఎస్‌యూవీ విడుదల వివరాలు

డిజైన్ మరియు ఇంజనీరింగ్‌ మీద తక్కువగా ఆధారపడుతూ వెలార్ ఎస్‌యూవీని డిజైన్‌ చేయడం జరిగింది. గత మూడేళ్ల నుండి డిజైన్ పరంగా భారీ మార్పులకు అవకాశం ఇవ్వకుండా దీనిని ఏరోడైనమిక్(గాలితో కలిగే ఘర్షణను ఎదుర్కునే) లక్షణాలతో రూపొందించినట్లు రేంజ్ రోవర్ పేర్కొంది.

రేంజ్ రోవర్ వెలార్ ఎస్‌యూవీ విడుదల వివరాలు

ఇంటీరియర్‌లో అధునాతన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు. 10-అంగుళాల పరిమాణంతో ఉన్న రెండు టచ్ స్క్రీన్ డిస్ల్పేలు గల సరికొత్త టచ్ ప్రొ డ్యుయొ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు. వెహికల్ ఆన్ చేసినపుడు మాత్రమే డిస్ల్పేలు వెలిగి టచ్‌స్క్రీన్‌లు ఉన్నట్లు తెలుస్తుంది.

రేంజ్ రోవర్ వెలార్ ఎస్‌యూవీ విడుదల వివరాలు

అంతే కాకుండా, రేంజ్ రోవర్ సంస్థ వివిధ శాఖలతో కలిసి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ గల విఢి భాగాలను వెలార్‌లో అందించే దిశగా పనిచేస్తోంది . అందులో భాగంగానే సూపర్ స్లిమ్ మ్యాట్రిక్స్-లేజర్ ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్‌ను ఇందులో అందించింది.

రేంజ్ రోవర్ వెలార్ ఎస్‌యూవీ విడుదల వివరాలు

భద్రత పరంగా రేంజ్ రోవర్ ఈ వెలార్ ఎస్‌యూవీలో అనేక ఫీచర్లను అందించింది. అవి, ఆరు ఎయిర్ బ్యాగులు, డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ కోసం పాదచారులను గుర్తించే పరిజ్ఞానంతో పాటు అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ మరియు అడాప్టివ్ స్పీడ్ లిమిటర్ వంటివి ఉన్నాయి.

రేంజ్ రోవర్ వెలార్ ఎస్‌యూవీ విడుదల వివరాలు

అంతర్జాతీయంగా రేంజ్ రోవర్ వెలార్ పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్‌లతో రానుంది. ఇందులో ఉన్న 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ రెండు రకాలుగా పవర్ మరియు టార్క్ ఉత్పత్తి చేయును. అందులో ఒక వేరియంట్ 246బిహెచ్‌పి పవర్ మరియు 365ఎన్ఎమ్ టార్క్ అదే విధంగా మరొక వేరియంట్ 296బిహెచ్‌పి పవర్ మరియు 400ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

రేంజ్ రోవర్ వెలార్ ఎస్‌యూవీ విడుదల వివరాలు

రేంజ్ రోవల్ వెలార్ ఎస్‌యూవీలో మరో ఇంధన వేరియంట్లో 3.0-లీటర్ టుర్బో ఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ వేరియంట్లో కూడా ప్రవేశపెట్టింది. ఇది 375బిహెచ్‌పి పవర్ మరియు 450ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

రేంజ్ రోవర్ వెలార్ ఎస్‌యూవీ విడుదల వివరాలు

వెలార్ ఎస్‌యూవీలోని అన్ని ఇంజన్ ఆప్షన్‌లలో జడ్ఎఫ్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ మరియు ఇంటెలిజెంట్ డ్రైవ్ లైన్ డైనమిక్స్ పరిజ్ఞానంతో ఉన్న ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌ అనుసంధానం కలదు.

రేంజ్ రోవర్ వెలార్ ఎస్‌యూవీ విడుదల వివరాలు

రేంజ్ రోవర్ వెలార్ ప్రస్తుతం ప్రపంచ విపణిలో ఉన్న వోల్వో ఎక్స్‌సి90, జాగ్వార్ ఎఫ్-పేస్, పోర్షే మకాన్, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 మరియు ఆడి క్యూ7 లకు గట్టి పోటీనివ్వనుంది.

Most Read Articles

English summary
Read In Telugu Range Rover Velar India Launch Details Revealed
Story first published: Thursday, June 8, 2017, 18:26 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X