పోటీని ఎదుర్కొనేందుకు డస్టర్‌తో మరో ప్రయోగానికి సిద్దమైన రెనో!!

Written By:

రెనో ఇండియా డస్టర్ విడుదలతో దేశీయంగా కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో సృష్టించిన అలజడి అంతా ఇంత కాదు. అయితే కాలానికి అనుగుణంగా విడుదలైన ఇతర ఉత్పత్తులు డస్టర్ అమ్మకాలకు గండి కొట్టాయి. ఎలాగైనా విపణిలో నిలబడేందుకు రెనో ఇప్పుడు మరో ఐడియాతో వచ్చింది. తమ లైనప్‌లో ఉన్న పెట్రోల్ వేరియంట్ డస్టర్‌లో కూడా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అందివ్వడానికి సిద్దమైంది. దీని గురించి మరిన్ని వివరాలు...

గత ఏడాది రెనో ఇండియా తమ డస్టర్ ఎస్‌యూవీలోని డీజల్ వేరియంట్లో 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అందించి విపణిలోకి విడుదల చేసింది. అయితే ఇప్పడు పెట్రోల్ వేరియంట్ డస్టర్‌లో సివిటి(కంటిన్యూయస్లీ వేరిబుల్ ట్రాన్స్‌మిషన్) గేర్‌బాక్స్‌తో పరిచయం చేయనుంది.

దిగ్గజ ఆన్‌లైన్ వార్తా వేదిక కథనం మేరకు రెనో ఇండియా తమ పెట్రోల్ వేరియంట్ ఆటోమేటిక్ డస్టర్‌ను మే 2017లో అధికారికంగా విడుదల చేయనున్నట్లు తెలిపింది.

ఏఎమ్‌టి ట్రాన్స్‌మిషన్ పెట్రోల్ డస్టర్ ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో 1.6-లీటర్ సామర్థ్యం ఉన్న ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 103బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగలదు.

నిజానికి డస్టర్ లోని డీజల్ వేరియంట్ల మీద కొనుగోలు ఆసక్తిచూపుతున్నారు. అయితే పెట్రోల్ వేరియంట్లో ఏఎమ్‌టి పరిచయం చేయడం ద్వారా అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని రెనో పెట్రోల్ ఆటోమేటిక్ డస్టర్ విడుదలకు ఆసక్తికనబరుస్తోంది.

రెనో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఒ సుమిత్ సాహ్నే మాట్లాడుతూ, "సరికొత్త పెట్రోల్ డస్టర్ ఆటోమేటిక్ వేరియంట్ విడుదలకు మేము సిద్దంగా ఉన్నామని తెలిపారు".

డస్టర్ పెట్రోల్ మోడల్‌లో మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల వేరియంట్లు ఏమున్నాయంటే? మధ్య స్థాయి వేరియంట్లయిన ఆర్ఎక్స్ఇ మరియు ఆర్ఎక్స్ఎల్ లను కొనుగోలుదారులు ఎంచుకోవచ్చు.

డస్టర్ పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ ప్రస్తుతం విపణిలో ఆప్షనల్ ఆటోమేటిక్ పెట్రోల్ వేరియంట్లతో అందుబాటులో ఉన్న హ్యుందాయ్ క్రెటా మరియు హోండా బిఆర్-వి ఎస్‌యూవీలకు పోటీనివ్వనుంది.

ప్రస్తుతం పెట్రోల్ మ్యాన్యువల్ డస్టర్ ఇవ్వగల మైలేజ్ 13.06కిమీ/లీ తో పోల్చుకుంటే పెట్రోల్ ఆటోమేటిక్ డస్టర్ మైరుగ్గా లీటర్‌కు 14కిమీల మైలేజ్ ఇవ్వగలదు.

కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో టాటా మోటార్స్ నుండి మరో మోడల్ రానుంది. క్రాసోవర్ ఎస్‌యూవీ అయిన టాటా నెక్సాన్ యొక్క మరిన్ని ఫోటోల కోసం క్రింది గ్యాలరీ మీద క్లిక్ చేయండి.

Read more on: #రెనో #renault
English summary
Renault Duster Petrol (Automatic) India Launch Details Revealed
Please Wait while comments are loading...

Latest Photos