ఇండియాకొచ్చిన రెనో క్యాప్చర్ ?

Written By:

2017 ఏడాది చివరి నాటికి రెనో ఇండియా విభాగం దేశీయంగా నూతన ఎస్‌యూవీని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. రెనో తమ మాతృదేశంలో అభివృద్ది చేస్తున్నప్పటికీ దేశీయ విపణిలో విడుదల కావాల్సి ఉంది కాబట్టి, దేశీయ రహదారుల మీద పలుమార్లు రహస్యంగా పరీక్షిస్తోంది. డ్రైవ్‌స్పార్క్ తెలుగు ఇది వరకే పలుమార్లు క్యాప్చర్ ఎస్‌యూవీ పేరుతో పలు కథనాలు ప్రచురించింది.

నేటి కథనం ద్వారా నూతన క్యాప్చర్ ఎస్‌యూవీ గురించి మరింత తాజా సమాచారం నేటి కథనంలో తెలుసుకుందాం రండి...

రెనో తమ రెండు క్యాప్చర్ ఎస్‌యూవీలను ఊటీ సమీపంలో కార్‌టాక్ బృందం ఆధ్వర్యంలో పరీక్షించింది. ఇందులో ఒకటి టాప్ ఎండ్ వేరియంట్ అలాగే మరొకటి ఎంట్రీ లెవల్ వేరియంట్ అని తెలిసింది.

టాప్ ఎండ్ వేరియంట్ రెనో క్యాప్చర్ ఎస్‌యూవీలో ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, లెథర్ సీట్లు మరియు అత్యాధునిక తాకె తెర గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు.

ఇక క్యాప్చర్ ఎంట్రీ లెవల్ వేరియంట్లో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ మరియు స్టీల్ రిమ్ముల గల చక్రాలను గుర్తించవచ్చు.

రెనో ఇండియా ఈ క్యాప్చర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని ప్రస్తుతం ఉన్న డస్టర్ ఎస్‌యూవీకి పై స్థానంలో అందుబాటులోకి తీసుకురానుంది. డస్టర్ ను అభివృద్ది చేసి రెనో యొక్క బిఒ వేదిక ఆధారంగా ఈ ఎస్‌యూవీని నిర్మించడం జరిగింది.

అంతర్జాతీయ వెబ్‍‌సైట్ ప్రకారం రెనో క్యాప్చర్ ను డస్టర్ కన్నా పరిమాణం పరంగా పెద్దదని పేర్కొంది. దీని ప్రకారం ఇంటీరియర్ స్పేస్ డస్టర్ కన్నా ఎక్కువగా ఉంటుందనే విషయం స్పష్టమపుతోంది.

అంతర్జాతీయ విపణిలోకి ప్రస్తుతం రెనో క్యాప్చర్ ఎస్‌యూవీ 1.6-లీటర్ మరియు 2.0-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ వేరియంట్లతో లభిస్తోంది. అయితే ఇండియా కోసం క్యాప్చర్‌లో ప్రత్యేకంగా డీజల్ ఇంజన్‌ను పరిచయం చేసే అవకాశాలు ఉన్నాయి.

ప్రస్తుతం అందుతున్న నివేదికల మేరకు రెనో ఇండియా ఈ క్యాప్చర్ ఎస్‌యూవీని 2017 నాటికి దేశీయంగా విడుదల చేసే అవకాశం ఉంది. ఈ సరికొత్త ఎస్‌యూవీ హ్యుందాయ్ క్రెటా మరియు టక్సన్ ఎస్‌యూవీలకు గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది.

విడుదలకు సిద్దమైన టియాగో ఏఎమ్‌టి: విడుదల మరియు సాంకేతిక వివరాలు

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Read more on: #రెనో #renault
English summary
Also Read In Telugu: Renault Kaptur Spied Testing In India
Please Wait while comments are loading...

Latest Photos