ఢిల్లీ నుండి ప్యారిస్ వరకు 19,000కిమీల పాటు రెనో క్విడ్ నాన్ స్టాప్ ట్రిప్

ఢిల్లీ నుండి ప్యారిస్‌కు ప్రపంచపు అత్యంత కఠినమైన భూబాగాల గుండా రహదారి ప్రయాణం సాగింది. మేడిన్ ఇండియా రెనో క్విడ్‌తో 19,000 కిమీల సాహసోపేత ప్రయాణం జరిపింది. దీని గురించి పూర్తి వివరాలు....

Written By:

"పిట్ట కొంచం కూత ఘనం" సామెతను క్విడ్ ను తలచుకొని గుర్తు చేసుకోవాల్సిన సందర్భం వచ్చింది. సుమారుగా 19,000 కిలోమీటర్ల పాటు, 13 దేశాల గుండా ఢిల్లీ నుండి ప్యారిస్‌కు రెనో క్విడ్ రోడ్ ట్రిప్ పూర్తి చేసుకుంది. ఓ చిన్న కారు భారీ సాహసోపేత అడ్వెంచర్ జర్నీని పూర్తి చేసింది. క్విడ్ గురించి భారతీయులు గర్వంగా చెప్పుకునే మరిన్ని విశేషాలు నేటి కథనంలో చూద్దాం రండి...

రికార్డులను తిరగరాయడంలోనే కాదు, ప్రపంచ పటంలో తన గుర్తింపును ముద్రించుకునే విశయంలో కూడా మేడిన్ ఇండియా రెనో క్విడ్ వెనక్క తగ్గలేదు. రాహుల్ కక్కర్ అనే వ్యక్తి మనం వినగానే భయపడే నిర్ణయం తీసుకున్నాడు. 19,000 కిలోమీటర్ల నాన్ స్టాప్ రోడ్ ట్రిప్‌ను విజయవంతంగా పూర్తి చేసాడు.

పూర్తిగా ఇండియన్ రోడ్ల కోసం తయారు చేసిన క్విడ్ కారును 13 దేశాల గుండా ఈ కారును నడిపాడు. విభిన్న వాతావరణ పరిస్థితుల్లో(నీరు గడ్డకట్టే వాతావరణం) కూడా క్విడ్ కారుతో ప్రయాణాన్ని కొనసాగించాడు.

ఐదు మంది సభ్యులున్న బృందం ఈ అడ్వెంచర్ జర్నీని పూర్తి చేసింది. భయంకరమైన రహదారుల గుండా మయమన్నార్‌లో భారీ వర్షాలను, చైనాలోని మంచును లెక్కచేయకుండా అన్ని సవాళ్లను ఎదుర్కోవడంలో క్విడ్ విజయం సాధించింది.

ఈ బృందంలోని సభ్యులు మాట్లాడుతూ, చైనాలోని చెంగ్డులో చలికాలం కోసం ప్రత్యేక టైర్లను ఉపయోగించినట్లు చెప్పాడు. చైనా దాటుకొని, కిర్గిజ్‌స్తాన్, కజకిస్తాన్, రష్యా మీదుగా యూరోప్‌ను చేరుకున్నారు.

వివిధ భూబాగాల నుండి ఎదుర్కొనే కఠినమైన సవాళ్లను ఎదుర్కోవడం మాత్రమే కాకుండా జర్మనీలో ప్రయాణిస్తున్నప్పుడు మేమంతా ఆశ్చర్యపోయే విధంగా గంటకు 174కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లు కక్కర్ మీడియా వివరించాడు.

ఈ 45 రోజుల ప్రయాణంలో మాకు ఎదురైన భయంకరమైన అనుభవం, కజకిస్తాన్‌లో వాతావరణ ఉష్ణోగ్రత మైనస్ 25 డిగ్రీలకు పడిపోయింది. అప్పుడు ఇంధనం కూడా ఖాళీ అయిపోయింది. మా బృందంలోని సభ్యులు క్యాన్‌ల ద్వారా ప్రాంతీయంగా ఉన్న జెర్రీ క్యాన్లలో నింపుకొని ప్రయాణాన్ని కొనసాగించడం జరిగింది.

2016 సెప్టెంబర్ తో క్విడ్ విడుదలయ్యి ఒక ఏడాది పూర్తయిన సంధర్బంగా క్విడ్ ను ఢిల్లీ నుండి ప్యారిస్ వరకు నడిపి రికార్డు సృష్టించారు.

ఈ సంధర్బంగా రెనో ఇండియా ముఖ్య కార్యనిర్వహణ అధికారి సుమిత్ సాహ్నే మాట్లాడుతూ, 98 శాతం పూర్తి స్థాయిలో దేశీయంగా ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపాడు. మేకిన్ ఇండియా కథలో క్విడ్ తనను తాను నిరూపించుకుందని సుమిత్ పేర్కొన్నాడు.

ఢిల్లీ నుండి ప్యారిస్ వరకు అత్యంత కఠినమైన సాహసయాత్రను పూర్తి చేసిన రెనో క్విడ్ ఇప్పుడు అత్యంత నాణ్యమైన ఉత్పత్తిగా నిలిచింది.

రెనో క్విడ్ లోని సాంకేతిక అంశాలను పరిశీలిస్తే, ఇందులో 800సీసీ మరియు 1.0-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. 800సీసీ వేరియంట్‌ను 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 1.0-లీ వేరియంట్‌ను మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ వేరియంట్లలో ఎంచుకోవచ్చు.

రెనో క్విడ్ శ్రేణిలోని ప్రారంభ వేరియంట్ ధర రూ. 2.60 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 4.33 లక్షలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి. మీ నగరంలో మీకు నచ్చిన కార్ల ధరలతో పాటు మీకు నచ్చిన కారు గురించి అన్ని వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి....

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Read more on: #రెనో #renault
English summary
Renault Kwid Delhi To Paris Non Stop Trip
Please Wait while comments are loading...

Latest Photos