రెనో క్విడ్ "లీవ్ ఫర్ మోర్ ఎడిషన్" విడుదల: పాత ధరలతోనే అందుబాటులో

Written By:

లీవ్ ఫర్ మోర్ అనే పేరుతో స్పెషల్ ఎడిషన్ క్విడ్ ను మార్కెట్లోకి విడుదల చేసింది రెనో. ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ మీద కాస్మొటిక్ మెరుగులతో వచ్చిన ఇది సాధారణ క్విడ్‌తో పోల్చుకుంటే చాలా వరకు విభిన్నంగా ఉంటుంది. రెనో ఇండియా ఈ "లీవ్ ఫర్ మోర్ ఎడిషన్" క్విడ్‌ను 0.8 మరియు 1.0 లీటర్ ఇంజన్ వేరియంట్లలో అందుబాటులోకి తీసుకువచ్చింది.
 

ప్రత్యేంగా కనబడేందుకు ఎరుపు మరియు బూడిద రంగులోని పట్టీలు జోడీగా ముందు వైపు బ్యానెట్ మీద నుండి బాడీ టాప్ గుండా వెనుకకు మరియు ప్రక్క వైపు నుండి వెనుక వైపుకు సాగిపోయాయి. ఈ రెండు పట్టీలు దీనికి మిక్కిలి ఆకర్షణగా నిలిచాయి.

సాధారణంగా క్విడ్ స్పోర్టివ్ లుక్‌తో ఉంటుంది. ఇక దీనిని శరీరం మీద స్పెషల్ ఎడిషన్ గుర్తులను ముంద్రించే సరికి మరింత ఆకర్షణీయంగా తయారైంది. నాలుగు చక్రాలకు ఉన్న వీల్స్ మీద ఒక చోట ఎర్రటి మార్కు మరియు ఫ్రంట్ గ్రిల్ లోని నాలుగు స్లాట్లలో ఒకదాని మీద ఎర్రటి రంగును రెనో పులిమింది.

క్విడ్ ఇంటీరియర్ లో లీవ్ ఫక్ మోర్ ఎడిషన్ లో భాగంగా ఎరుపు మరియు గ్రే రంగులో ఉండేవిధంగా తీర్చిదిద్దడం జరిగింది. నల్లటి ఇంటీరియర్ లో ఎరుపు మరియు గ్రే రంగులో ఉన్న సొబగులు ప్రత్యేకంగా నిలిచాయి.

ఇంటీరియర్ లో ప్రధాన భాగాలయిన స్టీరింగ్ వీల్, డోర్ మ్యాట్లు, డోర్ ట్రిమ్స్, అహ్‌హోల్‌స్ట్రే వంటి వాటిని డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్‌లో అందివ్వడం జరిగింది.

రెనో ఇండియా తమ లీవ్ ఫర్ మోర్ ఎడిషన్ క్విడ్ లో యాథావిధంగా తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ను ప్రత్యేకించిన మోడల్స్‌లో అందించింది. సుమారుగా రూ. 20,000 విలువైన అదనవు యాక్ససరీలను అందించినప్పటికీ పాత ధరలతోనే వీటిని అందుబాటులో ఉంచింది.

సాంకేతికంగా ఈ క్విడ్ లీవ్ ఫర్ మోర్ ఎడిషన్ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ 800సీసీ మరియు 1.0-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్‌లతో అందుబాటులో ఉంది. రెండు ఇంజన్ వేరియంట్లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానంతో పాటు 1.0-లీటర్ వేరియంట్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కూడా లభిస్తుంది.

రెనో క్విడ్ ధరల శ్రేణి రూ. 2.65 నుండి 4.32 లక్షల (ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉంది) మధ్య ఉంది. అన్ని వేరియంట్లు కూడా ఈ శ్రేణి మధ్య ధరలతో లభించును.

ఒక కొత్త హ్యాచ్‌బ్యాక్ ఎంచుకోవాలనుకుంటున్నారా...? మారుతి తమ స్విఫ్ట్ ను నెక్ట్స్ జనరేషన్ ‌గా త్వరలో మార్కెట్లోకి విడుదల చేయనుంది. సాంకేతిక మరియు డిజైన్ అంశాల పరంగా ఎన్నో మార్పులకు గురైన 2017 స్విఫ్ట్ ఫోటోలు మీ కోసం......

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Read more on: #రెనో #renault
Story first published: Monday, January 16, 2017, 13:31 [IST]
English summary
renault-kwid-live-for-more-edition-launched-gets-cosmetic-upgrades
Please Wait while comments are loading...

Latest Photos