ఇండియాలో అత్యధికంగా గూగుల్ చేసిన కారు ఏదో తెలుసా ?

Written By:

ఇంటర్నెట్ వాడకం బాగా పెరిగిపోవడంతో గూగుల్ సెర్చింజన్‌లో వెతుకులాటలు బాగా అధికమయ్యాయి. అయితే గడిచిన ఏడాదిలో ఇండియన్ కార్ల గురించి కూడా బాగానే గూగుల్ చేశారు. రెనో క్విడ్ కారు గురించి అత్యంధికంగా సెర్చింజన్‌లో శోధించినట్లు తెలిసింది. సిల్వర్ పుష్ అనే సంస్థ తెలిపిన వివరాలు ప్రకారం 16.11 శాతం మంది క్విడ్ కారు గురించి గూగుల్ చేసినట్లు తెలిపింది.

ట్రాకింగ్ మరియు ప్రకటనలను టార్గెట్ చేస్తూ సిల్వప్ పుష్ సంస్థ జరిపిన అధ్యయనం ప్రకారం గత ఏడాదిలో గూగుల్ సెర్చింజన్ లో ఎక్కువగా వెతికిన కార్ బ్రాండ్ లో మేడిన్ ఇండియా రెనో క్విడ్ గురించి అత్యధికంగా శోధించినట్లు వెల్లడైంది.

ఇంటర్నెట్లోనే కాదు టెలివిజన్ లో కూడా అత్యధిక ప్రకటనలు ఇచ్చుకున్న బ్రాండ్ కారు ఇదే. 4.81 శాతం ఇండియన్ టెలివిజన్ తెరల్లో ప్రకటనలకు వచ్చింది. దీంతో టీవీలో ప్రకటనలకు వచ్చిన కార్ బ్రాండ్ల జాబితాలో టాప్ 5 స్థానంలో నిలిచింది.

తరువాత హోండా కార్లు రెండు కస్టమర్ల ఫేవరెట్ కార్లుగా నిలిచాయి. గూగుల్ వేదికగా 4.37 శాతం మంది హోండా బిఆర్-వి మరియు 3.88 శాతం మంది హోండా జాజ్ గురించి శోధించినట్లు సిల్వర్ పుష్ తమ అధ్యయనం ద్వారా తెలిపింది.

సిల్వర్ పుష్ సంస్థ లగ్జరీ కార్ల శోధనల మీద కూడా దృష్టి పెట్టింది. ఇందులో ఆడి కు చెందిన ఎ6 మ్యాట్రిక్స్ గురించి గరిష్టంగా 4.15 శాతం వరకు శోధనలు జరిగినట్లు తన అధ్యయనంలో పేర్కొంది.

ప్రస్తుతం రెనో ఇండియా దేశీయంగా భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. నోట్ల రద్దు కారణంగా రెండు నెలల నుండి వాహన తయారీ సంస్థలకు అమ్మకాల్లో తీవ్ర పరాభవం ఎదురైనప్పటికీ క్విడ్ అత్యుత్తమ విక్రయాలను సాధిస్తోంది.

ఫ్రెంచ్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ రెనో ఇండియాకు డిసెంబర్ అమ్మకాలు మంచి వృద్దిని సాధించిపెట్టాయి. ఇందులో గరిష్టంగా క్విడ్ అమ్మకాలు ఉండటం గమనార్హం. డిసెంబర్ 2016 విక్రయాల్లో 9 శాతం వృద్దిని నమోదు చేసుకున్నట్లు రెనో ప్రకటించింది.

డిసెంబర్ 2016 తో రెనో క్విడ్ మొత్తం 1.65 లక్షల బుకింగ్స్ మరియు ఒక లక్షకు పైబడి అమ్మకాలు సాధించింది. అక్టోబర్ 2015 లో మార్కెట్లోకి విడుదలైనప్పటి నుండి ఇది సాధ్యమైందని రెనో ఇండియా తెలిపింది.

రెనో క్విడ్ లో కొన్ని ఫస్ట్ ఇన్ క్లాస్ సెగ్మెంట్ ఫీచర్లు ఉండటం దీని భారీ విజయానికి ప్రధానం కారణం అని చెప్పవచ్చు. అవి, తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ న్యావిగేషన్, రిమోట్ కీ లెస్ ఎంట్రీ, డ్రైవర్ ఎయిర్ బ్యాగు, 180ఎమ్ఎమ్ గ్రౌండ్ క్లియరెన్స్, లతో పాటు 25.17 కిమీ/లీ మైలేజ్ కూడా ఒక ముఖ్య కారణం.

రెనో ఇండియా తమ క్విడ్ ను 800సీసీ మరియు 1.0-లీటర్ సామర్థ్యం గల ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంచింది. వీటిని మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ లతో ఎంచుకునే అవకాశం కూడా కలదు.

రెనో క్విడ్ ఎంట్రీ లెవల్ వేరియంట్ ధర రూ. 2.65 లక్షలు మరియు క్విడ్ ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ. 4.26 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.

వితారా బ్రిజాకు పోటీగా హ్యుందాయ్ క్యుఎక్స్ఐ
హ్యుందాయ్ మోటార్స్ తమ అప్‌‌కమింగ్ కాంపాక్ట్ ఎస్‌యువి మీద పనిచేస్తోంది. దీనికి క్యుఎక్స్ఐ అనే కోడ్ పేరును కూడా ఖరారు చేసినట్లు తెలిసింది.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Read more on: #రెనో #renault
English summary
This Made-In-India Car Is The Most Searched Brand In Google
Please Wait while comments are loading...

Latest Photos