పల్స్ స్థానంలోకి ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్‌ను తీసుకొస్తున్న రెనో

Written By:

ఫ్రెంచ్‌కు చెందిన ప్రముఖ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం రెనో ఇండియా విభాగం దేశీయ విపణిలోకి నూతన మోడళ్లను విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అయితే తాజాగ అందుతున్న సమాచారం మేరకు విలాసవంతమైన ఫీచర్లతో కూడిన ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్‌ను అభివృద్ది చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.

ఈ నూతన హ్యాచ్‌బ్యాక్ రెనో లైనప్‌లో క్విడ్ కారుకు పై స్థానాన్ని భర్తీ చేయనుంది. రెనో ఇప్పటికే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించింది, మరో రెండు నుండి మూడేళ్లలోపు దీని అసలు రూపం ఓ కొలిక్కి రానుంది అని ఇటిఆటో ఓ కథనాన్ని ప్రచురించింది.

ఇంటర్నెట్ వేదికగా వస్తున్న ఆధారం లేని వార్తలకు సంభందించి రెనో ఇండియా ఇంకా స్పందించడం లేదు. అయితే క్విడ్‌కు పై స్థానంలోనే విపణిలోకి ప్రవేశపెడుతుందనే విషయం స్పష్టమవుతోంది.

ప్రస్తుతం రెనో లైనప్‌లో ఉన్న పల్స్ హ్యాచ్‌బ్యాక్ ఆశించి స్థాయిలో ఫలితాలను సాధించలేదు. అందుకు గాను, పల్స్ స్థానంలోకి ఈ నూతన ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ విడుదలయ్యే అవకాశం కూడా ఉంది.

రెనో ఇండియా భవిష్యత్తులో విడుదల చేసే ప్రతి మోడల్‌ను కూడా పూర్తి స్థాయిలో దేశీయంగా అభివృద్ది చేసి ఉత్పత్తి చేయనుంది. తద్వారా తక్కువ ధరలో నాణ్యమైన ఉత్పత్తులను త్వరితగతిన ఉత్పత్తి చేసే అవకాశం ఉంది.

రెనో క్విడ్ ఇందుకు ప్రధాన ఉదాహరణ, ఎక్కువ శాతం దేశీయంగా తయారు చేయడం వలన అత్యుత్తమ ఫీచర్ల మేళవింపుతో తక్కువ ధరకు ప్రవేశపెట్టడం ద్వారా భారీ అమ్మకాలు సాధిస్తోంది.

రెనో నూతన హ్యాచ్‌బ్యాక్‌ను తమ సిఎమ్‌ఎఫ్-ఎ ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించనుంది. ప్రస్తుతం విపణిలో ఉన్న మారుతి సుజుకి, హ్యుందాయ్ మరియు టాటా మోటార్స్ కు చెందిన ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌లకు గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Read more on: #రెనో #renault
English summary
Renault Might Launch A Premium Hatchback In India To Replace Pulse
Please Wait while comments are loading...

Latest Photos