క్విడ్ సొంతం చేసుకోవడానికి రెనో అరుదైన అవకాశం

Written By:

ఇండియన్ మార్కెట్లో ఉన్న స్మాల్ హ్యాచ్‌‌బ్యాక్ సెగ్మెంట్‌ను కుదిపేసిన క్విడ్ మీద రెనో రెండు అత్యుత్తమ ఆఫర్లను ప్రవేశపెట్టింది. స్మాల్ హ్యాచ్‌బ్యాక్‌ను ఎంచుకునే ప్రణాళికల్లో ఉన్న వారికి ఇదో సదావకాశం అని చెప్పవచ్చు.

రెనో ఇండియా తమ క్విడ్ రెండు గొప్ప ఫైనాన్స్ ఆఫర్లను అందుబాటులో ఉంచింది. అందులో మొదటిది తక్కువ నెలసరి వాయిదా చెల్లించడం మరియు రెండవది తక్కువ డౌన్ పేమెంట్ చెల్లించడం.

చిన్న కారును సామాన్యులు సులభంగా సొంతం చేసుకోవడానికి ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనో ఈ అద్బుతమైన ఆఫర్లను ప్రవేశపెట్టింది. అయితే కస్టమర్లు ఈ రెండింటిలో ఏదో ఒక ఆఫర్ మాత్రమే ఎంచుకోగలరు.

క్విడ్ మీద ఉన్న మొదటి ఆఫర్ గురించి చూస్తే, రెనో క్విడ్ ఎస్‌టిడి వేరియంట్ మీద అతి తక్కువ నెలసరి వాయిదాను అందుబాటులో ఉంచింది. ఈ ఆఫర్ ఎంచుకునే వారు నెలకు కేవలం రూ. 2,999 లను ఇఎమ్‌ఐ గా చెల్లించవచ్చు.

రెనో క్విడ్ స్టాండర్డ్ వేరియంట్ ధర రూ. 2.65 లక్షలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉంది. ఈ ఆఫర్ 1.8 లక్షల వరకు బుణ సదుపాయం కలదు. తొలి అడ్వాన్స్ నెలసరి వాయిదాతో పాటు మొత్తం 84 నెలల్లో ఈ లోన్ చెల్లించాల్సి ఉంటుంది.

ఒక వేళ మీరు రెండవ ఆఫర్ తక్కువ డౌన్ పేమెంట్ ఎంచుకోదలిస్తే, కేవలం రూ. 17,999 లు మాత్రమే చెల్లించి రెనో క్విడ్ ఎంచుకోవచ్చు. మిగతా మొత్తాన్ని లోన్ రూపంలో చెల్లించవచ్చు. ఈ ఆఫర్ రెనో క్విడ్ లోని బేస్ వేరియంట్ మీద మాత్రమే అందుబాటులో ఉంది.

క్విడ్ ఎంచుకోవాలనుకునే సామాన్యులకు రెనో ఈ రెండు అత్యుత్తమ ఫైనాన్స్ ఆఫర్లను అందుబాటులో ఉంచింది. రెనో క్విడ్ 800సీసీ మరియు 1.0-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్ వేరియంట్లలో అందుబాటులో ఉంది.

Read more on: #రెనో #renault
English summary
Read In Telugu Renault Offers Finance Schemes For The Kwid
Please Wait while comments are loading...

Latest Photos