కరోక్ కాంపాక్ట్ క్రాసోవర్ ఆవిష్కరించిన స్కోడా

సిజెక్ కు చెందిన కార్ల తయారీ సంస్థ సరికొత్త కాంపాక్ట్ క్రాసోవర్ కరోక్ ను ఆవిష్కరించింది. అంతర్జాతీయ ఆవిష్కరణ చేసిన కరోక్ ఎస్‌యూవీని తొలుత యూరోపియన్ మార్కెట్లోకి తీసుకురానుంది.

Written By:

స్కోడా సంస్థ తమ కాంపాక్ట్ క్రాసోవర్ కరోక్‌ను అంతర్జాతీయంగా ఆవిష్కరించింది. వయసైపోయినటువంటి యెటి ఎస్‌యూవీ స్థానాన్ని భర్తీ చేయనున్న కరోక్ ఎస్‌యూవీ మరియు కాంపాక్ట్ క్రాసోవర్ సెగ్మెంట్లలో స్థానం పధిలం చేసుకోనుంది.

యెటి ఎస్‌యూవీకి కొనసాగింపుగా వచ్చిన ఈ కాంపాక్ట్ క్రాసోవర్ పేరు మాత్రమే కాదు, పూర్తి స్థాయి డిజైన్, ఇంజన్ మరియు ఫీచర్ల పరంగా సమస్తం మారిపోయింది. డిజైన్ విషయానికి వస్తే, ఇది కాంపాక్ట్ క్రాసోవర్ మరియు ఎస్‌యూవీ రెండింటి పరంగా విక్రయాలు సాధించపెట్టనుంది.

ఫ్రంట్ డిజైన్‌ను యథావిధంగా కొనసాగిస్తూ వస్తున్న తీరును మనం కరోక్ ఫ్రంట్ డిజైన్ ద్వారా గమనించవచ్చు. ఇదే తరహా డిజైన్ శైలిని తమ సెడాన్ కార్లలో గుర్తించవచ్చు. డబుల్ స్లాట్లతో ఉన్న రేడియేటర్ ఫ్రంట్ గ్రిల్ మరియు చిన్న పరిమాణంలో ఉన్న హెడ్ లైట్లలో టర్న్ ఇండికేటర్లు మరియు పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్ల జోడింపు కలదు.

స్కోడా కరోక్ ఎస్‌యూవీ ఇంటీరియర్‌లో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే లను సపోర్ట్ చేయగల తాకే తెర ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అదే విధంగా డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ మరియు డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ప్రధానమైన ఇంటీరియర్ ఫీచర్లు ఉన్నాయి.

కరోక్ కాంపాక్ట్ క్రాసోవర్ మరియు ఎస్‌యూవీలో ఐదు సురక్షితంగా, సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు డిజైన్ చేయబడింది. అయితే ఎక్కువ బూట్ స్పేస్ కోరుకునే వారు మూడు సీట్లను తొలగించి బూట్ స్పేస్‌ను పెంచుకోవచ్చు.

భద్రత కోసం అన్ని స్టాండర్డ్ ఫీచర్లతో పాటు పార్క్ అసిస్ట్, లేన్ అసిస్ట్ మరియు బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ వంటి అధునాత భద్రత ఫీచర్లను జోడించడం జరిగింది.

స్కోడా అంతర్జాతీయ మార్కెట్‌ను దృష్టిలో అభివృద్ది చేయడం వలన దీనిని నాలుగు రకాల ఇంజన్ ఆప్షన్‌లలో అందివ్వడం జరిగింది. అవి, 1.0-లీటర్ మరియు 1.5-లీటర్ పెట్రోల్ వేరియంట్లు అదే విధంగా 1.6-లీటర్ మరియు 2.0-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ వేరియంట్లు.

కరోక్ ఎస్‌యూవీలోని అన్ని ఇంజన్ వేరియంట్లు 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌లతో అందిస్తోంది మరియు టాప్ ఎండ్ వేరియంట్ కరోక్ లో ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ కూడా కలదు.

స్కోడా తెలిపిన వివరాల మేరకు 2017 మలిసగంలో తమ కరోక్‌ను యూరోపియన్ మార్కెట్లోకి విడుదల చేసి 2018 ప్రారంభంలో ఇండియన్ మార్కెట్లోకి తీసుకురానున్నట్లు తెలిసింది.

ప్రస్తుతం దేశీయంగా కాంపాక్ట్ క్రాసోవర్ మరియు ఎస్‌యూవీలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కరోక్ మంచి విజయాన్ని సాధించే అవకాశం ఉంది. అయితే స్కోడా కరోక్ ఎస్‌యూవీని దేశీయంగానే ఉత్పత్తి చేయనుంది.

WHAT OTHERS ARE READING

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Read more on: #స్కోడా #skoda
English summary
Read In Telugu Skoda Karoq Revealed
Please Wait while comments are loading...

Latest Photos