కారు కొనమని సలహా ఇస్తే... కార్ల కంపెనీనే కొనేశాడు...!!

ట్విట్టర్‌లో ఓ వ్యక్తి ఆనంద్ మహీంద్రా కు కారు కొనమని సలహా ఇచ్చాడు.... అయితే దిగ్గజ వ్యాపారవేత్త ఏకంగా ఆ కార్లు తయారు చేసే కంపెనీనే కొనేశాడు.

Written By:

పినిన్ఫారినా విడుదల చేసిన బర్డ్ కేజ్ అనే గారు గురించి ఆనంద్ మహీంద్రా గారు ట్విట్టర్ లో ఓ ట్వీట్ చేశారు. "పినిన్ఫారినా అద్బుతమైన పురాతణ మరియు పాత్ బ్రేకింగ్ డిజైన్ ను తమ కార్లలో అందిస్తోంది. నాకు తెలియకుండానే ఆ కార్లకు అభిమాని అయిపోయానని" తెలిపాడు.

అయితే ఒక వ్యక్తి మిస్టర్ ఆనంద్ మహీంద్రా గారు, ఆ కారు గురించి అంతలా పొగడటం బదులు, దానిని కొనవచ్చు కదా. మిమ్మల్ని ఎవరు ఆపగలరు అని ట్వీట్ చేశాడు.

ఆనంద్ మహీంద్రా గారు కేవలం ఐదే నిమిషాల్లో అతగాడికి ఆన్సర్ ఇలా ఇచ్చాడు, కారును కొనేబదులు.... ఆ కారు కంపెనీ (పినిన్ఫారినా)నే కొనేసానని తెలిపాడు.

ఒక శక్తివంతమైన, తెలివైన వ్యాపార మరియు పారిశ్రామిక వేత్తకు అచ్చమైన ఉదాహరణ ఆనంద్ మహీంద్రా. ప్రస్తుతం మహీంద్రా అండ్ మహీంద్రా అనేక రంగాల్లో ఆటోమొబైల్స్‌ను విస్తరించి, వాహన పరిశ్రమకు చెందిన జాతీయ మరియు అంతర్జాతీయ సంస్థలను కొనుగోలు చేసింది. వీటన్నింటి వెనుక ఆనంద్ మీహీంద్రా గారి పాత్ర ఎంతో ఉంది.

ట్విట్టర్ లో ఆనంద్ మహీంద్రాకు ప్రశ్నను సంధించిన యువకుడికి ఆనంద్ గారు ఇచ్చిన తెలివైన సమాధానానికి ప్రశంసల వర్షం కురిసింది

నిజమే, మహీంద్రా అండ్ మహీంద్రా 2015 ఇటలీకి చెందిన సూపర్ కార్ల తయారీ సంస్థ పినిన్ఫారినా ను కొనుగోలు చేసింది.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Wednesday, January 25, 2017, 11:15 [IST]
English summary
Slow Clap Or Anand Mahindras Reply To Tweet Suggesting He Buy This Car
Please Wait while comments are loading...

Latest Photos