మార్చి 5 న టాటా విడుదల చేయనున్న సబ్ కాంపాక్ట్ సెడాన్: పూర్తి వివరాలు

టాటా మోటార్స్ మార్చి 5, 2017 న తమ అప్ కమింగ్ సబ్ కాంపాక్ట్ సెడాన్ ను మార్కెట్లోకి విడుదల చేయనుంది. దీని గురించి సమగ్ర వివరాలు...

By Anil

టాటా మోటార్స్ 2016 ప్రారంభంలో విపణిలోకి విడుదల చేసిన టియాగో హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసిన సంగతి విధితమే. టాటా మోటార్స్ చరిత్రలో కనీవిని ఎరుగని విజయాన్ని సాధించిన టియాగో హ్యాచ్‌బ్యాక్‌కు కొనసాగింపుగా కైట్ 5 కోడ్ పేరుతో అవే డిజైన్ పోలికలతో ఉన్న సబ్ కాంపాక్ట్ సెడాన్‌ను విడుదలకు సిద్దం చేసింది.

టాటా కైట్ 5 సబ్ కాంపాక్ట్ సెడాన్‌

దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ ప్యాసింజర్ కార్ల తయారీలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకునేందుకు ప్రణాళికలను సిద్దం చేస్తోంది. అందుకోసం ఎప్పటికప్పుడు నూతన డిజైన్ భాషలో, విభిన్న ఉత్పత్తుల విడుదలకు శ్రీకారం చుట్టింది.

టాటా కైట్ 5 సబ్ కాంపాక్ట్ సెడాన్‌

టియాగో, హెక్సా విడుదల అనంతరం ఇప్పుడు కైట్ 5 మరియు నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీల విడుదల మీద దృష్టి సారిస్తూనే ప్రీమియమ్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి అత్యంత విలాసవంతమైన వాహనాన్ని అభివృద్ది చేస్తోంది.

టాటా కైట్ 5 సబ్ కాంపాక్ట్ సెడాన్‌

కైట్ 5 కోడ్ పేరుతో సుపరిచితమైన ఈ సబ్ కాంపాక్ట్ సెడాన్ టియాగో హ్యాచ్‌బ్యాక్‌ను నిర్మించిన ఫ్లాట్ ఫామ్ ఆధారంగా అభివృద్ది చేయడం జరిగింది. ఎక్ట్సీయర్ పరంగా దాదాపు టయాగో ను పోలి ఉన్నప్పటికీ ఇంటీరియర్ పరంగా అనేక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.

టాటా కైట్ 5 సబ్ కాంపాక్ట్ సెడాన్‌

టాటా మోటార్స్ ఈ కైట్ 5 సబ్ కాంపాక్ట్ సెడాన్‌ను 2017 జనవరిలోనే విడుదల చేయాల్సి ఉండగా, కొత్తగా విడుదలయ్యే కార్లను సమకూర్చుకోవడంలో డీలర్లు ఇబ్బందులు ఎదుర్కోవడం మరియు ఇదే మాసంలో హెక్సా ఎమ్‌పీవీ కూడా విడుదల ఉండటంతో కైట్ 5 విడుదల వాయిదా పడింది.

టాటా కైట్ 5 సబ్ కాంపాక్ట్ సెడాన్‌

టాటా మోటార్స్ కైట్ 5 అనే కోడ్ పేరుతో అనేక మార్లు పరీక్షలు నిర్వహిస్తూనే ఉంది, కాని దీని అసలైన పేరును ఇంకా ఖరారు చేయలేదు. అయితే దీనికి టాటా వియాగో లేదా టాటా ఆల్టీగో అనే వాటిలో ఒక దానిని ఎంపిక చేసే అవకాశం ఉంది.

టాటా కైట్ 5 సబ్ కాంపాక్ట్ సెడాన్‌

టాటా తమ ఉత్పత్తులకు పెట్టే పేర్లను ఖరారు చేసే విషయంలో చాలా ఆచితూచి వ్యవహరిస్తుందనడంలో సందేహం లేదు. గతంలో జికా పేరుతో పరిచయం చేసి టియాగో అనే పేరును తమ హ్యాచ్‌బ్యాక్‌కు నామకరణం చేయడాన్ని ఇందుకు ప్రదాన ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

టాటా కైట్ 5 సబ్ కాంపాక్ట్ సెడాన్‌

టాటా మోటార్స్ ఈ కైట్ 5 సబ్ కాంపాక్ట్ సెడాన్‌ను మొదటి సారిగా ఢిల్లీలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించబడింది. వాహన ప్రేమికులకు అప్పట్లో ఈ నూతన డిజైన్‌లో ఉన్న కైట్ 5 హాట్ టాపిక్‌గా మారిపోయింది. కాన్సెప్ట్ దశ నుండి ప్రొడక్షన్ దశకు చేరుకున్న మోడల్‌లో ఇప్పుడు స్వల్ప మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

టాటా కైట్ 5 సబ్ కాంపాక్ట్ సెడాన్‌

టాటా నూతనంగా విడుదల చేసే అన్నింటిని కూడా ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీతో అభివృద్ది చేస్తోంది. హెక్సా మరియు టియాగో లు కూడా ఇంపాక్ట్ డిజైన్ భాషలో డెవలప్ చేసినవే. కనెక్ట్ నెక్ట్స్ సిస్టమ్ తో పాటు తమ అన్ని నూతన ఉత్పత్తుల్లో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ అందివ్వాలని ప్లాన్ చేస్తోంది.

టాటా కైట్ 5 సబ్ కాంపాక్ట్ సెడాన్‌

టాటా ఇందులో 5-అంగుళాల పరిమాణం గల తాకే తెర ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 8 స్పీకర్లు మరియు స్టీరింగ్ ఆధారిత ఆడియో కంట్రోల్స్‌లను అందివ్వనుంది.

టాటా కైట్ 5 సబ్ కాంపాక్ట్ సెడాన్‌

భద్రత పరంగా ఇందులో డ్యూయల్ ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ వంటివి తప్పనిసరిగా రానున్నాయి.

టాటా కైట్ 5 సబ్ కాంపాక్ట్ సెడాన్‌

సాంకేతికంగా కైట్ 5 టియాగో లోని ఇంజన్‌లతో రానుంది. అవి, 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న రివట్రాన్ పెట్రోల్ మరియు 1.05-లీటర్ సామర్థ్యం ఉన్న రివటార్క్ డీజల్ ఇంజన్.

టాటా కైట్ 5 సబ్ కాంపాక్ట్ సెడాన్‌

పోటీ దారులను దృష్టిలో ఉంచుకుని ధరలను నిర్ణయించడంలో టాటా మోటార్స్ ఆరితేరిన సంస్థ. కాబట్టి కైట్ 5 సబ్ కాంపాక్ట్ సెడాన్ ను రూ. 5 నుండి 7 లక్షల మధ్య ప్రారంభ ధరతో విడుదల చేసే అవకాశం ఉంది.

టాటా కైట్ 5 సబ్ కాంపాక్ట్ సెడాన్‌

మారుతి సుజుకి తమ 15 వ ఎడిషన్ డెసర్ట్ స్టార్మ్ ర్యాలీని నిర్వహిస్తోంది. రాజస్థాన్ ఎడారుల్లో కొనసాగుతున్న ఈ ర్యాలీని డ్రైవ్‌స్పార్క్ కవర్ చేస్తోంది. దీనికి సంభందించిన ఫోటోల క్రింది గ్యాలరీ ద్వారా అందిస్తోంది....

Most Read Articles

English summary
Tata Motors’ Kite 5 Sedan Launch Details Revealed
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X