మహీంద్రాకు షాక్: సరికొత్త ఎలక్ట్రిక్ కారును అభివృద్ది చేస్తున్నా టాటా మోటార్స్

Written By:

టాటా మోటార్స్ ఈ ఏడాది ప్రారంభంలో టామో అనే సబ్ మొబైలటి బ్రాండ్‌ను ప్రారంభించింది. మరియు జెనీవా మోటార్ షో వేదిక తమ మొదటి ఉత్పత్తి రేస్‌మో స్పోర్ట్స్ కారును ఆవిష్కరించింది. భారత్ యొక్క భవిష్యత్ రవాణా మీద దృష్టి సారించిన టామో మరో కొత్త వెహికల్‌ను పరిచయం చేయడానికి సిద్దమైంది.

టాటా ఉప బ్రాండ్ అయిన టామో తమ రేస్‌మో స్పోర్ట్స్ కారును మోఫ్లెక్స్ మోడ్యులర్ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా అభివృద్ది చేసింది.

ప్రపంచ రేసింగ్ కార్లతో పోటీపడుతున్న జెనీవా మోటార్ షో వేదిక మీద కొలువుదీరిని రేస్‌మోకు సందర్శకుల నుండి మంచి ఆదరణ లభించింది.

ఇప్పుడు ఈ దేశీయ దిగ్గజం మరో మోడల్ మీద దృష్టి సారించింది. టామో బ్రాండ్ క్రింద ఎలక్ట్రిక్‌ పవర్‌తో నడిచే ఎలక్ట్రిక్‌ కారును రూపొందిస్తోంది.

ప్రస్తుతం విపణిలో ఉన్న ఇతర మోడళ్లతో భిన్నంగా ఉండేందుకు స్థిరమైన సీటింగ్ సామర్థ్యం, తక్కువ వీల్ బేస్‌ను కలిగి ఉండనుంది.

ప్రస్తుతం ఈ చిన్న హ్యాచ్‌బ్యాక్‌ కారులో ఎలక్ట్రిక్ డ్రైవ్ వ్యవస్థ అందించే పనిలో టాటా నిమగ్నమయ్యింది. అయితే యురోపియన్‌కు చెందిన కార్ల తయారీ దిగ్గజాలకు చెందిన టెక్నికల్ సెంటర్లలో దీనికి సంభందించిన పరీక్షలు జరుగుతున్నాయి.

టాటా మోటార్స్ టామో మొబిలిటి బ్రాండ్ క్రింద ఎలక్ట్రిక్ వాహన శ్రేణిని ప్రదర్శించేందుకు బోల్ట్ ఇవి(ఎలక్ట్రిక్ వెహికల్)ని కూడా అభివృద్ది చేస్తోంది.

టాటా త్వరలో ఈ స్మాల్ ఎలక్ట్రిక్ కారుకు చెందిన మరిన్ని వివరాలు వెల్లడించనుంది. మరిన్ని తాజా ఆటోమొబైల్ కథనాల కోసం మాతో కలిసి ఉండండి. మీ నగరంలో టాటా కార్ల ధరలను తెలుసుకోండి....

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Read In Telugu Tata To Develop A New Electric Hatch Based On The Moflex Platform
Please Wait while comments are loading...

Latest Photos