గాలితో నడిచే ఎయిర్ పోడ్ కారును సృష్టించిన టాటా

Written By:

2007 లో ఫ్రెంచ్‌కు చెందిన మోటార్ డెవలప్‌మెంట్ ఇంటర్నేషనల్‌తో గాలితో నడిచే కారును అభివృద్ది చేసే అంశం మీద ఒప్పందం చేసుకుంది. ఇరు సంస్థలు కూడా సంయుక్తంగా ఒత్తిడితో నిండిన గాలితో నడిచే కారును అభివృద్ది చేస్తున్నాయి. ఈ కారుకు ఎయిర్‌పోడ్ అనే పేరును కూడా ఖరారు చేసింది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు, సంపీడిన వాయువు (compressed air) ద్వారా వాహనాన్ని నడిపే పరిజ్ఞానాన్ని అభివృద్ది చేస్తున్న టాటా త్వరలో అమ్మకాలకు విడుదల చేయడానికి సిద్దం అవుతోంది.

చాలా కాలం క్రితమే దీనికి జరిపిన పరీక్షల్లో సానుకూల ఫలితాలు వచ్చినట్లు సమచారం. చివర దశ పరీక్షలు విజయవంతమైతే గాలిచో నడిచే కార్లలో తిరిగే కల నిజమవ్వడానికి మార్గం సుగమం అయినట్లే.

టాటా మోటార్స్ అడ్వాన్స్‌డ్ అండ్ ప్రొడక్ట్ ఇంజనీరింగ్ విభాగాధ్యక్షుడు టిమ్ లెవర్టన్ మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్‌కు చెందిన రెండవ దశ అభివృద్ది పనులు మొదలయినట్లు ఆటోకార్ తో తెలిపారు.

పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌ల ద్వారా జరిగే పర్యావరణ వినాశనానికి మరియు ఎలక్ట్రిక్ కార్లలో పవర్ కొరత వంటి సమస్యలకు సరైన సమాధానం ఈ గాలితో నడిచే కారును నిర్మొహమాటంగా చెప్పవచ్చు.

ఇంధనం మరియు విద్యుత్ వినియోగంతో నడిచే కన్వెన్షనల్ కార్ల కన్నా గాలితో నడిచే కారు బరువు తక్కువగా ఉంటుంది. టాటా మోటార్స్ దీనిని కేవలం 907కిలోలు మాత్రమే ఉండే విధంగా అల్యూమినియంతో నిర్మిస్తోంది. తద్వారా మైలేజ్ పెరిగే అవకాశం ఉంది.

టాటా మోటార్స్ ఈ ఎయిర్‌పోడ్ కాన్సెప్ట్‌ను జాయ్ స్టిక్ ఆధారంగా నడిచేటట్లు రూపొందించింది. కేవలం రూ. 70 లతో 200 కిలోమీటర్ల మేర ప్రయాణించవచ్చు.

గాలితో నడిచే ఈ కారు గురించి మరిన్ని వివరాలను వెల్లడించడానికి నిరాకరించింది. ప్రొడక్షన్ దశకు చేరుకునే ఎయిర్‌పోడ్ గరిష్ట వేగం గంటకు 65 కిలోమీటర్లుగా ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు పాఠకుల కోసం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కార్ల ఫోటోలను ఒక చోట చేర్చి గ్యాలరీ రూపంలో అందించింది. మీకు నచ్చిన వాహన తయారీ దారుల యొక్క వాహనాల ఫోటోలను తిలకించడానికి www.telugu.drivespark.com వెబ్‌సైట్లో ఫోటోలు సెక్షన్ ను సందర్శించగలరు.

టాటా హెక్సా ఎమ్‌పీవీ ఫోటోలను తిలకించడానికి క్రింది గ్యాలరీ మీద క్లిక్ చేయండి.........

 

Story first published: Saturday, February 18, 2017, 14:42 [IST]
English summary
Tata Motors’ Air-powered Car Could Hit The Market In 2020
Please Wait while comments are loading...

Latest Photos