అడ్డంగా దొరికిపోయింది, ఇదిగో సాక్ష్యం

Written By:

ఈ ఏడాది చివరికి మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉన్న నెక్సాన్ ఎస్‌యువిని ఇప్పటికే పలుమార్లు పరీక్షించింది. దీని విడుదలకు సమయం ఆసన్నమవుతున్న నేపథ్యంలో ప్రొడక్షన్ రెడీ నెక్సాన్ ఎస్‌యువిని అతి రహస్యంగా పరీక్షించింది.

టాటా మోటార్స్ ఈ క్రాసోవర్ ఎస్‌యువి నెక్సాన్ ను తొలిసారిగా కాన్సెప్ట్ రూపంలో 2014 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించింది. తరువాత దాదాపు ప్రొడక్షన్‌కు సిద్దమైన నెక్సాన్ ను 2016 వాహన ప్రదర్శన వేదిక మీద ప్రదర్శించింది.

డిజైన్ ఫీచర్లను గుర్తించడానికి ఏ మాత్రం వీలు లేకుండా నల్లటి పేపర్ ‌తో పూర్తిగా కప్పేశారు. చివరికి హెడ్ లైట్లు మరియు టెయిల్ లైట్ సెక్షన్ కూడా కనబడకుండా బ్లాక్ పేపర్‌తో కవర్ చేసారు.

ప్రొడక్షన్‌కు సిద్దమైన నెక్సాన్ క్రాసోవర్ ఎస్‌యువి రెండు ఇంజన్ వేరియంట్లలో పరిచయం అయ్యే అవకాశం ఉంది. అందులో ఒకటి 1.2-లీటర్ సామర్థ్యం గల మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్. టియాగో హ్యాచ్‌బ్యాక్‌ను సేకరిస్తోంది.

మరియు డీజల్ వేరింట్ నెక్సాన్ కోసం 1.5-సామర్థ్యం గల కొత్త ఇంజన్‌ను నిర్మించనుంది. రెండు ఇంజన్‌లు కూడా మ్యాన్యువల్ మరియు ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ల అనుసంధానంతో అందుబాటులోకి రానున్నాయి.

టాటా మోటార్స్ దాదాపుగా 2016 వాహన ప్రదర్శన వేదిక మీద ఆవిష్కరించిన నెక్సాన్ యొక్క డిజైన్ తరహాలోనే ఈ ప్రొడక్షన్ రెడి మోడల్ విడుదల కానుంది. అవే యాంగులర్ హెడ్ లైట్లు, ప్రకాశవంతమైన బాడీ పెయింట్ స్కీమ్, రూఫ్ మీద వాలుగా ఉండే గీతలు రానున్నాయి.

సబ్-నాలుగు మీటర్ల పొడవున్న ఎస్‌యువి సెగ్మెంట్ శ్రేణిలోకి టాటా విడుదల చేస్తున్న మొదటి మోడల్ ఇదే. ఆటో ఎక్స్ పో లో ప్రదర్శించిన వివరాల ప్రకారం. దీని పొడవు 3.99 మీటర్లు వెడల్పు 1.73 మీటర్లు, ఎత్తు 1.6 మీటర్లతో పాటు 2.54 మీటర్ల పొడవైన వీల్ బేస్ కలిగి ఉంది.

టాటా మోటార్స్ తమ మొదటి క్రాసోవర్ ఎస్‌యువి నెక్సాన్ ను 2017 మలిసగంలో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనుంది. ప్రస్తుతం విపణిలో ఉన్న మారుతి సుజుకి వితారా బ్రిజా మరియు ఫోర్డ్ ఎకో స్పోర్ట్ లకు గట్టి పోటీ ఇవ్వనున్న ఇది 5 నుండి 8 లక్షల మధ్య ప్రారంభ ధరతో విడుదలయ్యే అవకాశం ఉంది.

ఎలక్ట్రిక్, హైబ్రిడ్ మరియు అటానమస్ శ్రేణిలో ఫోర్డ్ నుండి 7 వెహికల్స్
అమెరికాకు చెందిన దిగ్గజ ప్యాసింజర్ల తయారీ దిగ్గజం ఫోర్డ్ ఎలక్ట్రిక్, హైబ్రిడ్ మరియు అటానమస్ శ్రేణిలో ఇది వరకే ఆవిష్కరించిన ఏడు వాహనాలను మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్దమైంది.

 

English summary
Spy Pics: Tata Nexon Spotted Testing
Please Wait while comments are loading...

Latest Photos