టాటా నెక్ట్స్ ప్రొడక్ట్: అత్యంత విలాసవంతమైన ఎస్‌యువి

టాటా మోటార్స్ మొదటి సారిగా అత్యంత విలాసవంతమైన లగ్జరీ ఎస్‌యూవీని రహదారి పరీక్షలకు తీసుకొచ్చింది. టాటా యొక్క తరువాత లగ్జరీ ఎస్‌యువి ఇదే అని మీడియా ప్రతినిధులు నొక్కి చెబుతున్నారు.

Written By:

బస్సులు, లారీలు, పికప్ ట్రక్కులు, చిన్న కార్లు మరియు ఎస్‌యూవీల తయారీకి పేరుగాంచిన టాటా మోటార్స్ ఇప్పుడు లగ్జరీ కార్ల తయారీ మీద దృష్టిసారించింది. వచ్చే నాలుగేళ్లలోపు దేశీయ వాహన పరిశ్రమలో ఉన్న అన్ని సెగ్మెంట్లలోకి తమ ఉత్పత్తులను విడుదల చేయాడనికి టాటా సిద్దమవుతోంది. అందులో భాగంగా మొదటి సారిగా అత్యంత విలాసవంతమైన ఎస్‌యూవీని అభివృద్ది చేస్తోంది.

2020 నాటికి దేశీయంగా ఉన్న అన్ని విదేశీ కార్ల తయారీ సంస్థలు అందించే అన్ని వాహనాలకు కూడా గట్టి పోటీనిచ్చే ఉత్పత్తులను విడుదల చేయడాన్ని టాటా మోటార్స్ లక్ష్యంగా పెట్టుకుంది.

టాటా మోటార్స్ ఇంత వరకు తమ లైనప్‌ నుండి లగ్జరీ సెగ్మెంట్లోకి ఎలాంటి ఉత్పత్తిని కూడా ప్రవేశపెట్టలేదు. అయితే ఇప్పుడు ల్యాండ్‌రోవర్‌కు చెందిన డిస్కవరీ స్పోర్ట్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా సరికొత్త లగ్జరీ ఎస్‌యూవీని అభివృద్ది చేస్తోంది.

మోనోకోక్యూ వేదిక ఆధారంగా నిర్మించబడుతున్న ఈ ఎస్‌యూవీకి ఇప్పటికే క్యూ501అనే కోడ్ పేరును టాటా ఖరారు చేసింది. ప్రస్తుతం ప్రీమియమ్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఉన్న టయోటా ఫార్చ్యూనర్ మరియు ఫోర్డ్ ఎండీవర్ లకు గట్టి పోటీనివ్వనుంది.

టాటా మోటార్స్ క్యూ501 పేరుతో మొదటి సారిగా పరీక్షలకు తీసుకొచ్చిన ఎస్‌యువిలో స్టీల్ చక్రాలను గుర్తించవచ్చు. బాడీ మొత్తాన్ని గమిస్తే నూతన డిజైన్ శైలిలో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.

తరువాత పరీక్షలకొచ్చే సమయంలో డిజైన్ మరియు ఫీచర్లను పసిగట్టకుండా అత్యంత రహస్యంగా రానుంది. అందుకోసం బాడీ మొత్తం గుర్తుపట్టడానికి వీలుకాని విధంగా నల్లటి పెయింటింగ్ చేయనున్నారు.

ప్రస్తుతం సమాచార వర్గాల నుండి అందుతున్న సమాచారం మేరకు దేశీయ అవసరాలకు అనుగుణంగా మరియు ఇండియన్ రోడ్లకు పూర్తిగా సరిపోయే విధంగా నిర్మించడంలో టాటా మోటార్స్ కసరత్తులు చేస్తోంది.

ఈ ఎస్‌యూవీ ఇండియన్ మార్కెట్లోకి విడుదలయితే, దీని ధరను సుమారుగా రూ. 20 నుండి 25 లక్షల మధ్య ఉండేటట్లు నిర్ణయం తీసుకోనుంది.

ప్రస్తుతం టాటా లైనప్‌లో ఉండే కార్లతో పోల్చితే మరింత శక్తివంతమైన ఇంజన్‌ ఆప్షన్‌లతో రానుంది. సాంకేతికంగా అడ్వాన్స్‌డ్ ఫీచర్లను ఇందులో పరిచయం చేయడానికి ల్యాండ్ రోవర్ మరియు టాటా ఇరు సంస్థలు భాగస్వామ్యంతో అభివృద్ది చేస్తున్నాయి.

టాటా మోటార్స్ ఈ లగ్జరీ ఎస్‌యూవీని 2018 నాటికి ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉంది.
Via ThrustZone

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Tata Q501 Premium SUV Spied The First Time
Please Wait while comments are loading...

Latest Photos