టాటా టియాగో ఆటోమేటిక్ విడుదల: ధర రూ. 5.39 లక్షలు

Written By:

భారతదేశపు దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ ప్యాసింజర్ కార్ల విభాగంలోకి విడుదల చేసిన సంచలనాత్మక హ్యాచ్‌బ్యాక్ టియాగోను ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ వేరియంట్ ధర రూ. 5.39 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

టియాగో ఆటోమేటిక్ ఇప్పుడు ఎక్స్‌జడ్ఏ పెట్రోల్ వేరియంట్ కూడా లభించనున్నట్లు మరియు నేటి నుండి దేశవ్యాప్తంగా ఉన్న టాటా మోటార్స్ విక్రయ కేంద్రాలలో అమ్మకాలకు సిద్దంగా ఉన్నట్లు టాటా ప్రతినిధులు తెలిపారు.

ఈజీ షిఫ్ట్ ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో ఆటోమేటిక్, న్యూట్రల్, రివర్స్ మరియు మ్యాన్యువల్ అనే నాలుగు పొజిషన్లు ఉన్నాయి. మరియు ఇందులో స్పోర్ట్ మరియు సిటి అనే రెండు రకాల డ్రైవింగ్‌ మోడ్‌లను అందివ్వడం జరిగింది.

ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల టాటా టియాగో వేరియంట్లో 1.2-లీటర్ సామర్థ్యం గల మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 84బిహెచ్‌పి పవర్ మరియు 114ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

టాటా టియాగో ఆటోమేటిక్ హ్యాచ్‌బ్యాక్ విడుదల వేదిక మీద టాటా ప్యాసింజర్ వెహికల్స్ సేల్స్ విభాగాధ్యక్షుడు మయాంక్ పరీక్ మాట్లాడుతూ, టాటా మోటార్స్ టియాగో ను తొలిసారి(2016) విడుదల చేసినప్పటి నుండి వినియోగదారుల నుండి మంచి స్పందన లభిస్తోంది. ఇప్పుడు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో పాటు నూతన ఫీచర్ల జోడింపుతో సరసమైన ధరకు అందుబాటులో ఉంచామని తెలిపాడు.

టాటా టియాగో ఆటోమేటిక్ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి సెలెరియో ఏఎమ్‌టి, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ఏఎమ్‌టి, మారుతి సుజుకి ఇగ్నిస్ ఏఎమ్‌టి మరియు క్విడ్ 1.0-లీటర్ ఏఎమ్‌టి వంటి ఉత్పత్తులకు బలమైన పోటీనివ్వనుంది.

ఎంట్రీ లెవల్ ఆటోమేటిక్ హ్యాచ్‌బ్యాక్ కార్ల ధరలు

  • టియాగో ఏఎమ్‌టి ధర రూ. 5.39 లక్షలు
  • మారుతి సుజుకి సెలెరియో ఏఎమ్‌టి ధర రూ. 4.51 లక్షలు
  • హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ఏఎమ్‌టి ధర రూ. 5.99 లక్షలు
  • మారుతి సుజుకి ఇగ్నిస్ ఏఎమ్‌టి ధర రూ. 5.74 లక్షలు
  • క్విడ్ 1.0-లీటర్ ఏఎమ్‌టి ధర రూ. 3.84 లక్షలు
అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.

మారుతి సుజుకి ఈ ఏడాది ప్రారంభంలో విపణిలోకి విడుదల చేసిన ఇగ్నిస్ క్రాసోవర్ కొనే ఆలోచనలో ఉన్నారా...? అయితే షోరూమ్‌కు వెళ్లే ముందు ఇగ్నిస్ ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ ఫోటోలను వీక్షించండి....

 

English summary
Tata Tiago AMT Launched In India; Priced At Rs 5.39 Lakh
Please Wait while comments are loading...

Latest Photos