ఇక మీదట హైదరాబాద్‌లో కార్లు కొనడం కష్టమే: ఎందుకంటే...?

హైదరాబాద్‌లో కొత్తగా కొనుగోలు చేసిన కార్ల రిజిస్ట్రేషన్ కు పార్కింగ్ స్పేస్ తప్పనిసరి అని చట్టాన్ని తీసుకొచ్చే నిర్ణయంలో తెలంగాణ సర్కారు ఉన్నట్లు తెలిసింది.

Written By:

పార్కింగ్ స్పేస్ అందుబాటులో ఉన్న వారు మాత్రమే కొత్త కారును కొనుగోలు చేయగలరు అని ఢిల్లీలో కేంద్ర పట్టాణాభివృద్ది మంత్రిత్వ శాఖ కొత్త చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చింది. అచ్చం ఇదే రీతిలో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో కొత్త కారును కొనుగోలు చేసే వారు, దానికి సంభందించిన పార్కింగ్ స్పేస్ ఉన్నట్లు చూపడం తప్పనిసరి అనే చట్టాన్ని అమలు చేయడానికి ప్రతిపాదనలు సిద్దం చేస్తోంది.

రవాణా, రోడ్లు మరియు బిల్డింగ్ విభాక కార్యదర్శి, సునీల్ శర్మ మాట్లాడుతూ, నూతన వాహనాల రిజిస్ట్రేషన్‌కు పార్కింగ్ స్పేస్ తో అనుసంధానం చేయడం ద్వారా భవిష్యత్తులో రహదారుల మీద పార్కింగ్ ద్వారా కలిగే సమస్యలకు చెక్ పెట్టవచ్చని తెలిపాడు.

పార్కింగ్ స్పేస్‌కు సంభందించిన సలహాలను సేకరించిన అనంతరం, మార్గదర్శకాలను సిద్దం చేసి ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్లు శర్మ గారు తెలిపారు.

పార్కింగ్ స్పేస్‌కు సంభందించిన చట్టాలను తీసుకురావడానికి నగరాలలో పార్కింగ్ సమస్యల పట్ల సిటి ప్లానింగ్ అధికారులు, రవాణా నిపుణులతో పాటు ఇతర ఏజెన్సీల నుండి సలహాలను సేకరిస్తున్నారు మరియు ప్రత్యేకించి దీనిని అమలు చేయడంలో నగర ప్రజల నిర్ణయాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చి అనంతరం దీనిని అమలు చేస్తే బాగుంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్య నాయుడు తాజాగ తెలిపిన వివరాల మేరకు కొత్త వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే పార్కింగ్ స్థలం ఉన్నట్లు తెలిపే ఆధారాన్ని తప్పనిసరిగా సమర్పించాలని తెలిపాడు.

అయితే కొంత మంది నిపుణులు మాత్రం, కొత్త చట్టాలను అమలు చేయడం కన్నా ఫోర్ వీలర్ల తయారీ సంస్థలకు వాటి ఉత్పత్తి మీద పరిమితులు విధించడం ఉత్తమం అని చెబుతున్నారు.

దీని మీద నిర్మాణ రంగ నిపుణులు స్పందిస్తూ, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం అపార్ట్‌మెంట్లలో మరియు ప్రత్యేకించి పార్కింగ్ బిల్డింగ్స్ గల వారికి ఈ చట్టం సరైనదే అయితే వ్యక్తిగత గృహాలున్న వారికి ఇది చాలా ఇబ్బందిగా మారుతుందని అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.

నగర మరియు దేశ నిర్మాణ ప్రణాళిక డైరెక్టర్ కె ఆనంద్ బాబు మాట్లాడుతూ, పార్కింగ్ స్పేస్ కు సంభందించి సమస్యలు మరియు వాటి పరిష్కారాలతో కూడిన నివేదికను హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజన్‌కు అందజేసినట్లు తెలిపాడు.

కార్ల అమ్మకాలు మెట్రో నగరాలలో విపరీతంగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలలోని నగరాలను పరిశీలిస్తే హైదరాబాద్ నగరంలో కార్ల అమ్మకాలు విపరీతంగా ఉన్నాయి. తద్వారా భవిష్యత్తులో పార్కింగ్ మరియు ట్రాఫిక్ పరంగా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఢిల్లీ మహానగరం ఈ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటోంది.

కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌కు పార్కింగ్ స్థలాన్ని తప్పనిసరి చేస్తూ తీసుకొచ్చే చట్టం ద్వారా ట్రాఫిక్ మరియు పార్కింగ్ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

36 గంటల్లో 64,000 ల బుకింగ్స్: ఏంటి దీని ప్రత్యేకత
2017 కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ షో వేదిక మీద ఫారడే ఫ్యూచర్ తమ సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యువి ఎఫ్ఎఫ్91 ను ఆవిష్కరించింది. కేవలం 36 గంటల్లో 64,000 బుకింగ్స్ నమోదు చేసుకుంది.

బేబీ డాల్ సన్నీలియోన్ అభిమానుల కోసం మాత్రమే....!!
గూగుల్ శోధనలో ఎక్కువ మంది వెతికిన శృంగార తరహా నటులలో సన్నీ లియోన్ మొదటి స్థానంలో ఉంది. నేడు డ్రైవ్‌స్పార్క్ వెబ్‌సైట్ పాఠకుల కోసం బేబీ డాల్ హాట్ కార్ల గురించి ప్రత్యేక కథనం...

2017 మోడల్ స్విప్ట్ అతి త్వరలో విడుదల కానుంది... దీని పూర్తి ఫోటోలు మీకోసం.....
 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Tuesday, January 10, 2017, 14:55 [IST]
English summary
Telangana Government Working On Linking Parking Space And Car Registration
Please Wait while comments are loading...

Latest Photos

LIKE US ON FACEBOOK