2017 హ్యుందాయ్ వెర్నా గురించి పది ముఖ్యమైన విషయాలు

హ్యుందాయ్ మోటార్స్ అతి త్వరలో 2017 వెర్నా మిడ్ సైజ్ సెడాన్ కారును ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనుంది. 2017 వెర్నా గురించి అతి ముఖ్యమైన పది విషయాలు నేటి కథనంలో....

By Anil

ఇండియన్ మార్కెట్లోని మిడ్ సైజ్ సెడాన్ సెగ్మెంట్లో ఒకప్పుడు ఎక్కువ మంది ఎంచుకునే కారు హ్యుందాయ్ వెర్నా. అయితే వెర్నాకు అప్‌గ్రేడ్స్ నిర్వహించకపోవడంతో, తర్వాత కాలంలో వచ్చిన హోండా సిటి మరియు మారుతి సియాజ్ కార్లు ఈ సెగ్మెంట్‌ను పూర్తిగా ఆక్రమించేశాయి.

అయితే హ్యుందాయ్ మోటార్స్ తమ తరువాత తరం వెర్నా కారును 2017 ఎడిషన్‌లో అతి త్వరలో విపణిలోకి విడుదల చేయడానికి సిద్దం అవుతోంది. నేటి కథనంలో, 2017 హ్యుందాయ్ వెర్నాలో రానున్న ప్రధానమైన మార్పులు మరియు ఫీచర్ల గురించి తెలుసుకుందాం రండి...

2017 హ్యుందాయ్ వెర్నా

కొలతలు:

ప్రస్తుతం లభించే వెర్నా కన్నా అప్ కమింగ్ వెర్నా కొలతల్లో పెద్దదిగానే ఉంటుంది. మునుపటి వెర్నా కన్నా 70ఎమ్ఎమ్ పొడవు, 29ఎమ్ఎమ్ వెడల్పు మరియు 10ఎమ్ఎమ్ వీల్ బేస్ పెరిగింది. కారు మొత్తం ఎత్తు పెరగకపోయినప్పటికీ క్యాబిన్ స్పేస్ ఎక్కువగా ఉండనుంది.

2017 హ్యుందాయ్ వెర్నా

డిజైన్:

హ్యుందాయ్ చివరిగా విడుదల చేసిన ఆరవ తరానికి చెందిన ఎలంట్రా డిజైన్ శైలిలో 2017 వెర్నా ఫ్రంట్ డిజైన్‌ను రూపొందిస్తోంది. ప్రత్యేకించి ఫ్లూయిడిక్ స్కల్పచర్ 2.0 డిజైన్ లాంగ్వేజ్‌తో పాటు సిగ్నేచర్ హెక్సాగోనల్ ఫ్రంట్ గ్రిల్, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు, ఎల్ఇడి టెయిల్ లైట్లు, డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ మరియు రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్ వంటివి రానున్నాయి.

2017 హ్యుందాయ్ వెర్నా

ఇంటీరియర్

సరికొత్త 2017 వెర్నా క్యాబిన్ లేఅవుట్ పూర్తిగా మారిపోనుంది. ప్రస్తుతం విపణిలో ఉన్న వెర్నాతో ఏ మాత్రం పోలికల్లేకుండా సరికొత్త వెర్నా ఇంటీరియర్‌లో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఐ20 హ్యాచ్‌బ్యాక్ ఇంటీరియర్ తరహాలో, అప్ మార్కెట్ ఫీల్ కలిగించే విధంగా, ప్రీమియమ్ ఫీచర్లతో ఇంటీరియర్‌ను అభివృద్ది చేస్తోంది.

2017 హ్యుందాయ్ వెర్నా

ఇంటీరియర్ ఫీచర్లు

ప్రస్తుతం మార్కెట్లో కీలకంగా వ్యవహరిస్తున్న అన్ని ప్రధాన ఫీచర్లు సరికొత్త 2017 వెర్నాలో రానున్నాయి. మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యుఎస్‍‌బి మరియు ఏయుఎక్స్-ఇన్ కనెక్టివిటి, పవర్ సాకెట్స్, ఆర్మ్ రెస్ట్ వంటి వాటితో పాటు సన్ రూఫ్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, ఫాలో మి హెడ్ ల్యాంప్స్, క్రూయిజ్ కంట్రోల్, రియర్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్లు కూడా రానున్నాయి.

2017 హ్యుందాయ్ వెర్నా

సేఫ్టీ ఫీచర్లు

హ్యుందాయ్ మోటార్స్ తమ అప్ కమింగా 2017 వెర్నా సెడాన్‌లో సేఫ్టీకి పెద్ద పీట వేయనుంది. ఇందులో ప్రత్యేకించి డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ వంటి వాటిని స్టాండర్డ్ ఫీచర్లు, టాప్ ఎండ్ వేరియంట్లలో, ఆరు ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి ప్రోగ్రాం, ట్రాక్షన్ కంట్రోల్ మరియు ఎలక్ట్రానిక్ బ్రేక్ అసిస్ట్ ఫీచర్లు రానున్నాయి.

2017 హ్యుందాయ్ వెర్నా

ఇంజన్ ఆప్షన్‌లు

హ్యుందాయ్ తమ మునుపటి అవే పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లను అప్ కమింగ్ వెర్నాలో అందివ్వనుంది. ఇదే జరిగితే, 1.4-లీటర్ మరియు 1.6-లీటర్ విటివిటి పెట్రోల్ ఇంజన్‌లు అదే విధంగా 1.4-లీటర్ మరియు 1.6-లీటర్ సిఆర్‌డిఐ డీజల్ ఇంజన్ వేరియంట్ లభించనున్నాయి.

2017 హ్యుందాయ్ వెర్నా

ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్‌(గేర్‌బాక్స్)

1.4-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లో అదే విధంగా, 1.6-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వేరియంట్లు 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లో లభించనున్నాయి. వీటితో పాటు 1.6-లీటర్ పెట్రోల్ వెర్నా వేరియంట్ 6-స్పీడ్ ఆటేమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభించే అవకాశం ఉంది.

2017 హ్యుందాయ్ వెర్నా

మైలేజ్ వివరాలు

2017 హ్యుందాయ్ వెర్నా లోని 1.4-లీటర్ మరియు 1.6-లీటర్ పెట్రోల్ వేరియంట్లు వరుసగా 18కిమీ/లీ మరియు 15కిమీ/లీ మైలేజ్ ఇవ్వగలవు. అదే విధంగా 1.4-లీటర్ మరియు 1.6-లీటర్ డీజల్ వేరియంట్లు వరుసగా 25కిమీ/లీ మరియు 23కిమీ/లీ మైలేజ్ ఇవ్వగలవు.

2017 హ్యుందాయ్ వెర్నా

విడుదల మరియు పోటీ

మార్కెట్ నిపుణులు భావించిన విధంగా జరిగితే, 2017 పండుగ సీజన్ ప్రారంభమయ్యే నాటికి విడుదల కానుంది. పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే, విపణిలో ఇది వరకే ఉన్న 2017 హోండా సిటి, మారుతి సుజుకి సియాజ్, వోక్స్‌వ్యాగన్ వెంటో వంటి మిడ్ సైజ్ సెడాన్ కార్లకు గట్టి పోటీనివ్వనుంది.

2017 హ్యుందాయ్ వెర్నా

ధర

2017 హ్యుందాయ్ వెర్నా ప్రారంభ వేరియంట్ ధర రూ. 7.5 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 14 లక్షల ఎక్స్-షోరూమ్‌గా లభించనున్నాయి.(అంచనాతో ఇవ్వబడ్డాయి).

Most Read Articles

English summary
Read In Telugu: Ten Important things about 2017 Hyundai Verna
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X