దేశీయంగా ఉన్న 9 ఉద్గార రహిత హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ కార్లు

పర్యావరణంలో జరుగుతున్న అనేక అసమానతలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పర్యావరణానికి హాని కలిగించే పెట్రోల్, డీజల్ కార్లను వదిలేసి తమవంతుగా హైబ్రిడ్ లేదా ఎలక్ట్రిక్ కార్లను ఎంచుకోవాలి.

By Anil

భూమి అనగానే గుండ్రంగా ఉండే రెండక్షరాల గ్రహం అనుకుంటాం... కానీ భూమి అంటే ఇది కాదు. సమస్త ప్రకృతిని మోస్తున్న పుడమి తల్లి. సాంకేతికత కొత్త పుంతలు తొక్కేకొద్దీ పర్యావరణ పరిరక్షణ పట్ల శ్రద్ద తగ్గిపోతోంది. పర్యావరణాన్ని పరిరక్షించకపోయినా... దానిని నాశనం చేయకుండా ఉండటం మంచిది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రపంచ వ్యాప్తంగా ఏటా ఏప్రిల్ 22వ తేదీనన ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం...

దేశీయంగా ఉన్న 9 ఉద్గార రహిత హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ కార్లు

ఈ ప్రక్రియలో మాట్లాడే అవకాశం వచ్చే ప్రతి నాయకుడు, ప్రతి వ్యాఖ్యాత పర్యావరణం గురించి అనేక పాఠాలు భోదించి వెళుతుంటారు. కాని పర్యావరణానికి హాని కలిగించే పెట్రోల్, డీజల్ కార్లను వదిలేసి తమవంతుగా హైబ్రిడ్ లేదా ఎలక్ట్రిక్ కార్లను మాత్రం వినియోగించరు.

దేశీయంగా ఉన్న 9 ఉద్గార రహిత హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ కార్లు

మీరు గమనించినట్లయితే పర్యావరణం కోసం ప్రాణం ఇస్తామని పలికే ప్రతి వ్యక్తి పర్యావరణ ఆరోగ్యానికి తూట్లు పొడిచే విధంగా భారీ ఉద్గారాలను విడుదల చేసే డీజల్ మరియు పెట్రోల్ కార్లను వినియోగిస్తాడు. కాబట్టి మీరు... మీ తోటి కార్లను వినియోగించే వారి కోసం దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్ కార్లను ఇవాళ్టి కథనంలో అందిస్తున్నాము.

9. బిఎమ్‌డబ్ల్యూ ఐ8

9. బిఎమ్‌డబ్ల్యూ ఐ8

బవేరియన్ మోటార్ వర్క్స్ సంస్థ తమ ఫ్లాగ్‌షిప్ స్పోర్ట్స్ కారు, ఐ8 స్పోర్ట్స్ హైబ్రిడ్ కారును 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద తొలిసారిగా ప్రదర్శించింది. తరువాత కొంతకాలానికి భారత మాజీ క్రికెటర్ మరియు కెప్టెన్ సచిన్ టెండూల్కర్ సారథ్యంలో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది.

దేశీయంగా ఉన్న 9 ఉద్గార రహిత హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ కార్లు

భవిష్యత్ డిజైన్ ఫిలాసఫీతో వచ్చిన ఐ8 హైబ్రిడ్ స్పోర్ట్స్ కారులో వివేకవంతమైన హైబ్రిడ్ వ్యవస్థ కలదు. ఇది పెట్రోల్ ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటార్ అనుసంధానంతో ఉంది. ఇందులోని 7.1కిలోవాట్ సామర్థ్యం ఉన్న బ్యాటరీ మరియు 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్ సంయుక్తంగా 357బిహెచ్‌పి పవర్ మరియు 570ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

దేశీయంగా ఉన్న 9 ఉద్గార రహిత హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ కార్లు

బిఎమ్‌డబ్ల్యూ ఇందులోని శక్తివంతమైన ఇంజన్‌కు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ అనుసంధానం కలదు. ఇది కేవలం 4.4 సెకండ్ల కాలంలోనే 0 నుండి 100 కిమీల వేగాన్ని అదే విధంగా గంటకు 250కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

దేశీయంగా ఉన్న 9 ఉద్గార రహిత హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ కార్లు

న్యూ యూరోపియన్ డ్రైవింగ్ సైకిల్ పరీక్షల ప్రకారం బిఎమ్‌డబ్ల్యూ ఐ8 హైబ్రిడ్ కారు లీటర్‌కు 47.6కిమీల మైలేజ్ ఇవ్వగలదు. దీని ధర రూ. 2.23 కోట్లు ఎక్స్-షోరూమ్‌గా ఉంది. సామాన్యులు ఇంత ధర వెచ్చించి హైబ్రిడ్ కారు ఎలా కొంటారని ప్రశ్నిస్తున్నారా..? అయితే మరిన్ని ఇతర హైబ్రిడ్ కార్లు నేటి కథనంలో...

వోల్వో ఎక్స్‌సి90 ఎక్సలెన్స్ టి8 హైబ్రిడ్

వోల్వో ఎక్స్‌సి90 ఎక్సలెన్స్ టి8 హైబ్రిడ్

వోల్వో ఇండియా లైనప్‌లో ఉన్న వాటిలో ఎక్స్‌సి ఎక్సలెన్స్ టి8 హైబ్రిడ్ అత్యంత శక్తివంతమైన ఏకైక కారు. వోల్వో ఇందులో 2.0-లీటర్ సామర్థ్యం ఉన్న సూపర్ ఛార్జ్‌‌డ్ మరియు టుర్బో ఛార్జ్‌డ్ అదే విధంగా ఎలక్ట్రిక్ మోటార్ అనుసంధానం ఉన్న ఇంజన్ అందించింది.

దేశీయంగా ఉన్న 9 ఉద్గార రహిత హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ కార్లు

9.2కిలోవాట్ సామర్థ్యం ఉన్న ఎలక్ట్రిక్ మోటార్ మరియు పెట్రోల్ ఇంజన్ రెండు కూడా 401బిహెచ్‌పి పవర్ మరియు 640ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ద్వారా పవర్ మరియు టార్క్ నాలుగు చక్రాలకు అందుతుంది.

దేశీయంగా ఉన్న 9 ఉద్గార రహిత హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ కార్లు

వోల్వో ఎక్స్‌సి90 కేవలం 5.6 సెకండ్ల కాలంలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్నిఅందుకుంటుంది. మరియు దీని గరిష్ట వేగం గంటకు 225కిమీలుగా ఉంది. న్యూ యూరోపియన్ డ్రైవింగ్ సైకిల్ పరీక్షల ప్రకారం వోల్వో ఎక్స్‌సి90 ఎక్సలెన్స్ మైలేజ్ 47.61కిమీలుగా ఉంది.

  • వోల్వో ఎక్స్‌సి9 ధర రూ. 1.2 కోట్లు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉంది.
  • 7.లెక్సస్ ఆర్ఎక్స్450హెచ్

    7.లెక్సస్ ఆర్ఎక్స్450హెచ్

    దేశీయంగా పరిచయమైన హ్యుందాయ్ మోటార్స్ లగ్జరీ కార్ బ్రాండ్ లెక్సస్ హైబ్రిడ్ కార్లను విరివిగా అందుబాటులోకి తెచ్చింది. అందులో మొదటిది లెక్సస్ ఆర్ఎక్స్450హెచ్. ఇందులో 3.5-లీటర్ల సామర్థ్యం ఉన్న ట్విన్ టుర్బో వి6 ఇంజన్ ఎలక్ట్రిక్ మోటార్ అనుసంధాన గల ఇంజన్ వ్యవస్థ ఉంది.

    దేశీయంగా ఉన్న 9 ఉద్గార రహిత హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ కార్లు

    శక్తివంతమైన ఇంజన్‌కు అనుసంధానం చేసిన 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ ద్వారా 308బిహెచ్‌పి పవర్ మరియు 335ఎన్ఎమ్ గరిష్ట టార్క్ చక్రాలకు సరఫరా అవుతుంది. ఇది కేవలం 7.7 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100కిలోమీటర్ల వేగాన్ని అదే విధంగా గరిష్టంగా 220కిమీల వేగాన్ని అందుకుంటుంది.

    దేశీయంగా ఉన్న 9 ఉద్గార రహిత హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ కార్లు

    లెక్సస్ ఆర్ఎక్స్450 హెచ్ మైలేజ్ లీటర్‌కు 18.86కిమీలుగా ఉంది.రెండు వేరియంట్లలో లభించే లెక్సస్ ఆర్ఎక్స్450 హెచ్ ధరలు...

    • ఆర్ఎక్స్450హెచ్ లగ్జరీ వేరియంట్ ధర రూ. 1,07,29,000 లు
    • ఆర్ఎక్స్450హెచ్ ఎఫ్ స్పోర్ట్ ధర రూ. 1,09,61,000 లు
    • రెండు ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.
      6.లెస్ ఇఎస్300హెచ్

      6.లెస్ ఇఎస్300హెచ్

      లెక్సస్ సంస్థ పరిచయం చేసిన మరో హైబ్రిడ్ వెర్షన్ ఇఎస్300హెచ్. శక్తివంతమైన 2.5-లీటర్ సామర్థ్యం ఉన్న నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ ఎలక్ట్రిక్ అనుసంధానం ఇందులో కలదు. ఇది గరిష్టంగా 202బిహెచ్‌పి పవర్ మరియు 213ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. సివిటి గేర్‌బాక్స్ ద్వారా పవర్ ముందు చక్రాలకు సరఫరా అవుతుంది.

      దేశీయంగా ఉన్న 9 ఉద్గార రహిత హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ కార్లు

      లెక్సస్ ఇఎస్300హెచ్ కేవలం 8.8 సెకండ్ల కాలంలోనే 0 నుండి 100 వేగాన్ని అందుకుంటుంది. మరియు దీని గరిష్ట వేగం గంటకు 180కిమీలుగా ఉంది. ఈ హైబ్రిడ్ సెడాన్ మైలేజ్ 17.8కిమీలుగా ఉంది.

      • లెక్సస్ ఇఎస్300హెచ్ ధర రూ. 55,27,000 లు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉంది.
      • 5. టయోటా ప్రియస్

        5. టయోటా ప్రియస్

        ప్రపంచ హైబ్రిడ్ కార్ల మార్కెట్లో బాగా గుర్తించదగిన మోడల్ టయోటా ప్రియస్. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది బాధ్యతాయుతంగా హైబ్రిడ్ కార్ల కొనుగోలుకు సముఖత చూపుతున్నారు. ఈ నేపథ్యంలో టయోటా తమ ప్రియస్ హైబ్రిడ్ సెడాన్‌ను పరిచయం చేసినప్పటి నుండి భారీ విక్రయాలు చేపడుతోంది.

        దేశీయంగా ఉన్న 9 ఉద్గార రహిత హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ కార్లు

        ప్రస్తుతం దేశీయంగా అందుబాటులో ఉన్ ప్రియస్ హైబ్రిడ్ సెడాన్ కారులో 1.8-లీటర్ సామర్థ్యం ఉన్న నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ ఎలక్ట్రిక్ మోటార్ అనుసంధానంతో అందుబాటులో ఉంది. ఇది గరిష్టంగా 122బిహెచ్‌పి పవర్ మరియు 142ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

        దేశీయంగా ఉన్న 9 ఉద్గార రహిత హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ కార్లు

        లీటర్‌కు 26.27కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగల టయోటా ప్రియస్ ప్రారంభ ధర రూ. 38,96,040 లు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉంది.

        4. హోండా అకార్డ్ హైబ్రిడ్

        4. హోండా అకార్డ్ హైబ్రిడ్

        ఇండియన్ రోడ్ల మీద అకార్డ్ కార్లను బాగానే గుర్తించవచ్చు. ప్రస్తుతం రోడ్ల మీద మీరు చూడగలిగే కొత్త అకార్డ్ సెడాన్ హైబ్రిడ్ మరియు లగ్జరీ లక్షణాలను కలిగి ఉంది. ప్రస్తుతం హోండా మోటార్స్ తమ అకార్డ్ లగ్జరీ సెడాన్‌ను కేవలం హైబ్రిడ్ వెర్షన్‌గలో మాత్రమే అందుబాటులో ఉంచింది.

        దేశీయంగా ఉన్న 9 ఉద్గార రహిత హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ కార్లు

        హోండా అకార్డ్ హైబ్రిడ్ సెడాన్‌లో ఎలక్ట్రిక్ మోటార్ అనుసంధానంతో ఉన్న 2.0-లీటర్ సామర్థ్యం ఉన్న అట్కిన్సన్ సైకిల్ పెట్రోల్ ఇంజన్ కలదు. గరిష్టంగా 212బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల దీని మైలేజ్ 23.1కిమీలుగా ఉంది.

        దేశీయంగా ఉన్న 9 ఉద్గార రహిత హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ కార్లు

        హోండా అకార్డ్ హైబ్రిడ్ సెడాన్‌ ధర రూ. 37,00,622 లు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉంది.

         3. టయోటా క్యామ్రీ

        3. టయోటా క్యామ్రీ

        ఇండియాలో అసెంబుల్ అవుతున్న మొదటి హైబ్రిడ్ మోడల్, టయోటా క్యామ్రీ హైబ్రిడ్ కారు.

        దేశీయంగా ఉన్న 9 ఉద్గార రహిత హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ కార్లు

        టయోటా ఈ క్యామ్రీ హైబ్రిడ్ కారులో ఎలక్ట్రిక్ మోటార్ అనుసంధానం గల 2.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 158బిహెచ్‌పి పవర్ మరియు 213ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. సివిటి గేర్‌బాక్స్ గల సరికొత్త క్యామ్రీ హైబ్రిడ్ లీటర్‌కు 19.21కిమీల ఇవ్వగలదు.

        • టయోటా క్యామ్రీ హైబ్రిడ్ ధర రూ. 31,98,500 లు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉంది.
        • 2. మహీంద్రా ఇవెరిటో

          2. మహీంద్రా ఇవెరిటో

          మహీంద్రా ఇండియా లైనప్‌లో రెండు ఎలక్ట్రిక్ కార్లను అందిస్తోంది. పూర్తి స్థాయిలో ఉద్గార రహిత కార్లను అందిస్తున్న ఎకైక సంస్థ మహీంద్రా. తమ ఇవెరిటో కారులో 3-స్టేజ్ ఏ/సి ఇండక్షన్ మోటార్ గల 72వి ఎలక్ట్రిక్ మోటార్ కలదు.

          దేశీయంగా ఉన్న 9 ఉద్గార రహిత హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ కార్లు

          72ఏహెచ్ బ్యాటరీ ద్వారా పవర్ ఎలక్ట్రిక్ మోటార్‌కు చేరుతుంది. గంటకు 90కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఇది సింగల్ చార్జంగ్‌తో 110 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఛార్జింగ్ కోసం 8 గంటల సమయం తీసుకుంటుంది.

          • మహీంద్రా ఇవెరిటో ప్రారంభ ధర రూ. 9.50 లక్షలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉంది.
          • 1. మహీంద్రా ఇ2ఒ ప్లస్

            1. మహీంద్రా ఇ2ఒ ప్లస్

            ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల ప్రస్తానం మొదలుపెట్టిన కంపెనీ రెవా. మహీంద్రా ఈ రెవా బ్యాడ్జిని కొనుగోలు చేసి ఇ2ఒగా పేరు మార్చింది. ప్రస్తుతం మహీంద్రా ఇ2ఒ ప్లస్ హ్యాచ్‌‌బ్యాక్ నాలుగు డోర్ల వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.

            దేశీయంగా ఉన్న 9 ఉద్గార రహిత హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ కార్లు

            మహీంద్రా ఇ2ఒలో 11కెడబ్ల్యూహెచ్(పి4 మరియు పి6) లేదా 16కెడబ్ల్యూహెచ్(పి8) బ్యాటరీలతో 3-ఫేస్ఏ/సి ఇండక్షన్ మోటార్ కలదు. 25.47బిహెచ్‌పి పవర్ మరియు 70ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగలదు.

            దేశీయంగా ఉన్న 9 ఉద్గార రహిత హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ కార్లు

            110 కిలోమీటర్ల వరకు ప్రయాణించే రేంజ్ ఉన్న దీనికి ఛార్జింగ్ సమయం 6 నుండి 7 గంటల వరకు తీసుకోనుంది. ఇ2ఒ ప్రారంభ ధర రూ. 6,26,387 లు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉంది.

Most Read Articles

English summary
Read in Telugu To Know About Top 9 Green Cars on Sale In India
Story first published: Monday, April 24, 2017, 13:50 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X